Nindu Noorella Saavasam Serial Today Episode:  సరస్వతి గురించి తెలసుకున్న రామ్మూర్తి వెంటనే ఆమెను కలవాలని, ఆమెను చూడాలని అడుగుతాడు. అయితే ఆమె ఇప్పుడు కోమాలో ఉందని ఇదే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ జరుగుతుందని అమర్‌ చెప్తాడు. దీంతో మంగళ భయపడుతుంది. వీళ్లంతా కలిస్తే నీ బతుకు బస్టాండే అని మనోహరిని బెదిరిస్తుంది. దీంతో ఇక సరస్వతిని చంపేయాల్సిన టైం వచ్చిందని మనోహరి అంటుంది. మరోవైపు డాక్టర్‌ సరస్వతిని చూసి ఈమె కండీషన్‌ ఇంకా క్రిటికల్ గానే ఉందని చెప్తుంది. అక్కడే ఉన్న ఆరు ఆత్మ.. మేడం నువ్వు ఒక్కసారి లేవండి అని దేవుడా నా బాధ నీకు వినిపిస్తుందా? అనగానే సరస్వతి లేస్తుంది. ఆమెకు స్పృహ వచ్చిందని నేను ఎవరికైనా చెప్పాలి అని బయటకు వస్తుంది.

Continues below advertisement


మనోహరి: మంగళ మేము వెళ్లగానే ఆ వార్డెన్‌ ప్రాణాలు తీసెయ్‌. అది కళ్లు తెరచి నిజం చెబితే నా బతుకు మొత్తం అమర్‌ ముందు బయట పడిపోతుంది.


మంగళ: ఇగో మనోహరి నువ్వు ఇసువంటి ముచ్చట్లు నాకు చెప్పకు. అవతల ఉన్నది అమరేంద్ర బాబు. బాబుకు ఎదురుపోవడమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. నాతోని కాదు నన్ను విడిచిపెట్టు.


ఆరు: చేసిన పాపాలు చాలవన్నట్టు. ఇంకా చేయాలని చూస్తున్నావా? ఇది మంచిది కాదు మను.


   అని ఆరు ఆత్మ లోపలికి వెళ్లి.. అమర్‌కు సరస్వతి స్పృహలోకి వచ్చిందని చెప్తుంది. అమర్‌ లేచి బయటకు వెళ్లిపోతుంటాడు. ఆరు గట్టిగా అరవగానే అమర్‌ ఆగిపోయి. వార్డెన్‌ ను కూడా చూసి వెళదాం అంటాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. నేను ఇందాకే చూశానని చెప్తుంది. అయినా కూడా అమర్‌ నేను ఒకసారి చూడాలని వార్డెన్‌ దగ్గరకు వెళ్తాడు.


అమర్‌: డాక్టర్‌ వార్డెన్‌ గారికి ఎలా ఉంది.


డాక్టర్‌: ఏ ఇంప్రుమెంటూ లేదు సార్‌. కండిషన్‌ కూడా అలాగే ఉంది.


అమర్‌: ఆవిడ కళ్లు తెరవడం నాకు చాలా ఇంపార్టెంట్‌ డాక్టర్‌ గారు. నా జీవితానికి సంబంధించిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆవిడ కళ్లు తెరవాలి.


మనోహరి: ఇది కోమాలోంచి బయటకు వచ్చేసింది. అమర్‌ కు గాని నిజం తెలిస్తే.. నా గురించి నిజం మొత్తం తెలిసిపోతుంది.


అమర్‌: శత్రువు ఎవరో తెలియకుండా యుద్దం చేస్తున్నా.. సాయం కోరడం లేదు కానీ చిన్న సహకారం కోరుతున్నా.. ఆరును చంపిందెవరో కానీ వాళ్లకు చావును పరిచయం చేసే వరకు నా యుద్దం ఆగదు.


  అని అమర్‌ ఎమోషనల్‌ అవుతాడు. మనోహరి వెళ్దామని అమర్‌ను తీసుకుని వెళ్తుంది. మిస్సమ్మ సాయంత్రం వరకు హాస్పిటల్‌ లోనే ఉంటానని చెప్తుంది. మనోహరి కూడా కాసేపు ఉండి వస్తానని ఆగిపోతుంది. దీంతో మనోహరి మళ్లీ ఏం చేయబోతుందోనని ఆరు ఏడుస్తుంది. మరోవైపు మనోహరి డాక్టర్‌ వేషం వేసుకుని వార్డెన్‌ రూంలోకి వెళ్లి చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో లిఫ్ట్‌ ఎక్కబోయిన అమర్‌ వార్డెన్‌ చేయి పట్టుకుని చూసింది గుర్తు చేసుకుని వార్డెన్‌ స్పృహలోనే ఉన్నారని రూంలోకి పరుగెడతాడు.  అమర్‌ను చూసిన మనోహరి డోర్‌ వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. వార్డెన్‌ ను చూసిన అమర్‌ డాక్టర్‌ ను పిలుస్తాడు. మరోవైపు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శైలజను అంజు బెదిరిస్తుంది. మేము కల్నల్‌ పిల్లలమని గుర్తుంచుకోండి అని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: తమన్నా డబుల్ బొనాంజా - బాలీవుడ్ కెరీర్‌కు కొత్త బిగినింగా? ఎండ్ కార్డా?