Brahmamudi Serial Today Episode: కల్యాణ్‌ను ప్రేమించి వేరేవాళ్లతో పెళ్లికి సిద్ధపడటంపై అప్పూను వాళ్ల అక్క స్వప్న  నిలదీస్తుంది. ఇప్పటికైనా ప్రేమించిన విషయం కల్యాణ్‌కు చెప్పమని చెబుతుంది. అయితే కల్యాణ్‌ కు తనపై జాలి తప్ప ప్రేమలేదని అప్పూ  అంటుంది. ఇప్పుడు కల్యాణ్‌ను తాను పెళ్లి చేసుకుంటే జనం వేసిన నిందలే నిజమవుతాయని...తనకు తల్లిదండ్రుల పరువే ముఖ్యమని అప్పు చెబుతుంది. దీంతో నువ్వు కల్యాణ్‌ను ప్రేమించిన విషయం అందరికీ చెబుతానని స్వప్న అనగా.....ఆ విషయం బయటపెడితే తాను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని అప్పూ బెదిరిస్తుంది.


పెళ్లికొడుకు వాళ్లు కల్యాణమండపానికి రాగానే వాళ్లను అప్పూ తల్లిదండ్రులు రిసీవ్ చేసుకుంటారు. వారికి కావ్య, స్వప్న దిష్టితీసి లోపలికి ఆహ్వానిస్తుండగా పక్కకు వెళ్లి ధాన్యలక్ష్మీ , రుద్రాణీ  వాళ్లు చాలా మాట్లాడుకుంటారు


రుద్రాణీ: ధాన్యలక్ష్మీ నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లు ఉన్నావు..ఈ పెళ్లి జరుగుతున్నందుకు


ధాన్యలక్షీ: అవును కల్యాణ్, అప్పు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని నువ్వు చెప్పావు కదా..నేను చాలా తెలివిగా వ్యవహరించి కావ్యచేతే అప్పు పెళ్లి జరిగేలా చేస్తున్నాను.


రుద్రాణీ: కానీ రాజుకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాడికి కల్యాణ్‌తోనే అప్పు పెళ్లి జరగాలని బలంగా కోరకుంటున్నాడు


ధాన్యలక్ష్మీ: తమ్ముడి మీద ప్రేమతో కావ్యను కోప్పాడ్డాడు తప్ప...మరీ పెళ్లి చెడగొట్టడానికి వాడేమీ రుద్రాణీ కొడుకులాంటి వాడు కదా అంటుంది


రుద్రాణీ: మధ్యలో నా కొడుకును ఎందుకు లాగుతావు అంటూ కోప్పడుతూనే....ఇవాళ నా కుడికన్ను ఎందుకో అదురుతోంది కాబట్టి ఏదో జరగబోతోందని హెచ్చరిస్తుంది. రాజుతో స్వప్న పెళ్లి జరుగుతుందనుకుంటే కావ్యతో జరిగిందని...రాహుల్‌ పెళ్లే వెరేవాళ్లతో చేద్దామని చూస్తే స్వప్నతో జరిగిందని కాబట్టి ఏదీ మన చేతుల్లో ఉండదని ధాన్యలక్ష్మీతో అంటుంది.కాబట్టి అప్పూ పెళ్లికూడా కల్యాణ్‌తోనే జరుగుతోందని నాకు అనిపిస్తోంది. ఈ ముగ్గురు అక్కాచెళ్లెళ్ల జాతకాలు ఒక్కటే..


ధాన్యలక్ష్మీ: నువ్వు ఊరికే భయపెట్టకు రుద్రాణీ...ఇంట్లో ఉన్న కల్యాణ్‌ ఇప్పుడు పెళ్లిమండపానికి ఎందుకు వస్తాడు. ఇంతమందిని దాటుుకుని వెళ్లి అప్పు మెడలో తాళి ఎందుకు కడతాడు.


ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండాగ...స్వప్న కల్యాణ్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పూ ఇంకా నిన్నే ప్రేమిస్తోందని చెబుతుంది. మనసులో నిన్ను పెట్టుకుని వేరొకరితో పెళ్లికి సిద్ధమై బాధపడుతోందని చెబుతుందని చెబుతుంది. నువ్వు నిజంగా అప్పును ప్రేమిస్తున్నావా లేదా అని నిలదీస్తుంది. మీ ఇద్దరూ ప్రేమించుకున్నట్లయితే...ఈ పెళ్లి వరకు ఎందుకు తీసుకొచ్చారని అడుగుతుంది. ఎప్పుడూ అప్పూ సంతోషమే ముఖ్యమని అనే నువ్వు ఇప్పుడు అది ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని ప్రశ్నిస్తుంది. ఎవరి కోసమే త్యాగాలు చేస్తే మనమే ఒంటరిగా మిగిలిపోతాం.  ఆ తర్వాత ఎవరు ఓదార్చినా... ఉపయోగం ఉండదు. నా చెల్లి బాధ చూడలేకే నీకు ఈ విషయాలు చెబుతున్నాను అంటుంది. ఆ తర్వాత ఏం చేయాలో నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఈ విషయం మొత్తం పక్కనే ఉండి వింటున్న రాజ‌్...ఈ కల్యాణ్‌, అప్పులను నమ్ముకుని ప్రయోజనం లేదని, తానే ఏదో ఒకటి చేసి వారిద్దరినీ కలపాలనుకుంటాడు.


కల్యాణ్: అప్పు  పెళ్లివరకు వెళ్లిందంటే సంతోషంగా కాపురంచేసుకుంటుదనుకున్నా కానీ...పెళ్లిపీటలపైనా నా గురించే ఆలోచిస్తుందంటే ఇక నేను నిర్ణయం తీసుకోవాల్సిందే. లేకపోతే నా ప్రేమకు అర్థమే లేకుండా పోతుంది. రెండు కుటుంబాల పరువు గురించి ఆలోచించి నేను బాధపడి తనని బాదపెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఏదీఏమైనా జరగని వెళ్లి ఆ పెళ్లి ఆపేసి నా మనసులో మాట అప్పుకు చెబుతాను అని బయలుదేరబోతాడు. అయితే తనను  బెడ్‌రూంలో బంధించి బయట తాళం వేసిన సంగతి అప్పుడే గుర్తిస్తాడు.


అక్కడ పెళ్లిమండపం వద్ద ధాన్యలక్ష్మీ కూడా కంగారుపడిపోతుంది. కల్యాణ్ మండపానికి వచ్చేస్తాడేమోనని...అందుకు రుద్రాణీ ఏం భయంలేదు...కల్యాణ్‌ను రూంలో పెట్టి తాళం వేసి వచ్చానంటూ  తాళం చెవులను రుద్రాణీ చూపెడుతుంది.


రాజు పెళ్లికొడుకు వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పేస్తాడు. మా తమ్ముడు కల్యాణ్, అప్పు ప్రేమించుకున్నారని చెబుతాడు. కానీ పెళ్లికొడుకు మాత్రం అలాటంటిదేమీ లేదని కాసేపటి క్రితమే అప్పూతో మాట్లాడనని...ఆమె ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకుందని చెబుుతాడు. నాకు ఇంతకు ముందే వారిద్దరి గురించి తెలుసని పెళ్లికొడుకు చెబుతాడు. ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తర్వాతే పెళ్లికి అంగీకరించానని చెబుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కావ్య...భర్తను నిలదీస్తుంది. మీరు ఇక్కడికి పెళ్లి చూడడానికి కాదని...చెడగొట్టడానికే వచ్చారు అంటుంది. దానికి నువ్వు చేసిన తప్పు సరిదిద్దుతున్నానంటూ  రాజ్‌ సమాధనమిస్తాడు. ఈ పెళ్లి తప్పకుండా ఆపితీరతానని రాజ్‌ ఛాలెంజ్‌ చేస్తాడు. ఇద్దరూ సవాళ్లు విసురుకుంటారు.


Also Read: టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మృతి - మిస్ యూ బాబాయ్ అంటూ మంచు మనోజ్ నివాళులుz


ఇంటిలో ఇరుక్కుపోయిన కల్యాణ్‌...బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. రెండో తాళం కోసం నాయనమ్మకు ఫోన్ చేస్తాడు. తన గదిలోనే రెండో తాళంచెవి ఉన్నట్లు ఆమె కల్యాణ్‌కు చెబుతుంది.అప్పుడే అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మీ ఆ ఫోన్ కల్యాణే చేసి ఉంటాడని అనుమానిస్తుంది. ఈలోగా కల్యాణ్‌ రెండో తాళం చెవితో ఇంటి తలుపులు తెరుచుకుని బయటకు వచ్చేస్తాడు.



అటు అప్పును ఒప్పించేందుకు పెళ్లిమండపంలో రాజు ప్రయత్నాలు చేస్తుంటాడు. పెళ్లి కుమార్తె రూంలో అప్పు ఉందనుకుని అక్కడి వెళ్లి తనను ప్రశ్నిస్తాడు. ఒకరిని ప్రేమించి మరొకరిని ఎలా పెళ్లిచేసుకుంటావని నిలదీస్తాడు. నవ్వు ఒప్పుకుంటే ఇక్కడి నుంచి తప్పించి తీసుకెళ్తానని చెబుతాడు. బయట కారులో ఎదురుచూస్తూ ఉంటానని చెబుతాడు. అయితే అక్కడ అప్పుకు బదులు కావ్య ఉందని రాజ్‌ గమనించడు. కావ్యనే వెళ్లి కారులో కూర్చోగా....తన మరదలు అప్పు అనుకుని రాజు కారును వేగంగా కల్యాణ్ వద్దకు తీసుకువెళ్తండగా వాళ్లబాబాయి అడ్డుకోవడంతో ఈరోజు ఏపీసోడ్ ముగుస్తుంది..


Also Read: రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్- డ్రగ్స్ అలవాటు చేసిందని లావణ్యపై ఫిర్యాదు