Nindu Noorella Saavasam Today Episode: అరుంధతి ఇంట్లో చిన్న పిల్లలందరూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు... అరుంధతి కిటికీలోంచి అంతా చూస్తూ ఉంటుంది. అన్నీ తెలిసినా ఏం చేయలేక రాథోడ్ బాధను దాచుకుంటూ పిల్లల కోసం నవ్వుతూ  మాట్లాటానికి ప్రయత్నిస్తాడు.  కానీ నటించలేక, సహాయం చేయలేకపోతున్నాను అంటూ  ఏడుస్తాడు. వీళ్లను చూస్తూ ఉన్న అరుంధతి చిత్రగుప్త కూడా చాలా బాధపడుతూ ఉంటారు.


పిల్లలు అందరూ కలిసి అమ్మను చాలా మిస్ అవుతున్నాము కాబట్టి మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేసేయమని తండ్రికి చెప్పమని చెబుతారు. అమ్మ లేకపోతే  ఇంత బాధగా ఉందని తెలిస్తే మేము కూడా అమ్మతోపాటు దేవుడి దగ్గరికి వెళ్లిపోయే వాళ్ళము అని  అంటారు.. ఆమాటలకి  దానికి అక్కడ దూరం నుండి చూస్తున్న అరుంధతి, చిత్రగుప్త పక్కనే ఉన్న రాథోడ్ పిల్లలు అందరూ చాలా వెక్కివెక్కి ఏడుస్తారు. అమ్మలా మనల్ని చూసుకోవడానికి మిస్సమ్మ కూడా లేదని బాధపడతారు. 


గుండెలను మెలిపెట్టే పిల్లల బాధ చూసి దేవుడికి మనసే లేదని, అందుకే ఆడుకోవాల్సిన వయసులో బాపెడుతున్నాడని రాథోడ్ దేవుణ్ణి నిందిస్తాడు. పిల్లల్ని ఎలా అయినా హాస్టల్లో జాయిన్ చేసేయమని   అడుగుతానని చెబుతాడు.  వీళ్లందరిని  చూసి చిత్రగుప్తుడు కూడా కన్నీరు మున్నేరు అవుతాడు. తీరా  పక్కకి తిరిగి  చూసేసరికి అరుంధతి ఉండదు. మళ్ళీ చిత్రగుప్తుడు తన వెతుకులాటను మొదలుపెడతాడు. యమహో యమ అని అనుకుంటూ అరుంధతి ఎక్కడికి వెళ్లిందో, ఎందుకు వెళ్లిందో అని ఆలోచిస్తూ  కళ్యాణమండపం దగ్గరకే వెళ్ళింది అనుకోని అక్కడికి బయలు దేరుతాడు. 


సంభావన ఎక్కువ ఇస్తానన్న మనోహరి మాటతో  పెళ్లి అనుకున్న సమయం కన్నా  ముందుగానే  చేయించడానికి పంతులుగారు అన్నిఏర్పాట్లు చేస్తుంటారు.  కళ్యాణ మండపంలో అమరేందర్ చాలా బాధపడుతూ ఉంటాడు,  అమరేంద్రని పెళ్లి చేసుకోబోయే మనోహరి  ఆనందంగా ఫోటోలు దిగుతూ ఉంటుంది. మరోవైపు బిహారి గ్యాంగ్ వాళ్ళు  ఒక కారు నెంబరు పట్టుకొని, ఆ  కారు అమరేంద్ర పేరు మీద ఉందని తెలుసుకుంటారు.  


అరుంధతి భాగి వాళ్ళింట్లో ప్రత్యక్షమవుతుంది. భాగ్య తన ఇంట్లో తన ఎదురుగుండా ఉన్న వినాయకుడికి చూసి దండం పెడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఒక మంచి వ్యక్తికి మనోహరి లాంటి తప్పుడు వ్యక్తిని ఆ కుటుంబంలోకి పంపావు అని ప్రశ్నిస్తుంది.. సమస్యను నువ్వు తీర్చలేకపోతే తీర్చే శక్తి నాకివ్వు అని వేడుకుంటుంది. ఏదన్నా అద్భుతం చేయమని, మనోహరి, అమరేంద్ర పెళ్లిని ఆపటానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని కోరుకుంటుంది. మనోహరి పెళ్లిని ఆపడానికి అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను అని చెబుతుంది. పిల్లలని కాపాడే మార్గం చూపమని ఏడుస్తుంది.


భాగ్య బాధని, పిల్లలపై ఆమెకున్న ప్రేమని చూసి అరుంధతి చలించిపోతుంది. మనసులోనే భాగికి దండం పెడుతుంది. స్వార్ధంగా ఆలోచించి నీ జీవితాన్ని పణంగా పెడుతున్నానేమోనని చాలా భయంగా ఉంద అని, నీ మనసులోని మాటలు విన్నాక నా మనసులో కలత పోయింది మిస్సమ్మకి థాంక్యూ అని చెబుతుంది. ఎన్ని జన్మలెత్తినా నీ త్యాగం మాత్రం మరిచిపోను అని అంటుంది. మిస్సమ్మ గురించి పిల్లలు అమ్మలా ఉంటుంది, మిస్సమ్మ మా అమ్మ లాగా బాగా చూసుకుంటుంది అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్లి అరుంధతి మిస్సమ్మలోకి ఏకం అయిపోతుంది. అరుంధతి.. మిస్సమ్మగా మారిపోతుంది.


Also Read: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు