Naga Panchami Serial November 15th Episode : మోక్ష: పంచమి ఈ రోజు నుంచి నువ్వు నాకు యజమానివి కూడా ఇక రోజూ నువ్వే నా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి. లెక్కలు అడిగితే మాత్రం చెప్పను. సరేనా. సరేనా ఈ రోజు నుంచి నీకు డబుల్ డ్యూటీ. ఓనర్ డ్యూటీలో పడి భార్య డూటీ మర్చిపోకు. 


చైత్ర: ఈ ఇంట్లో అందరికీ నా చేత తన్నులు తినాలని ఉంది. లేకపోతే ఒక పెద్ద కొండలా ఇంట్లో అటూ ఇటూ తిరిగే నేను ఎవరి కంట్లో పడలేదు. కంట్లో నలుసు అంత ఉండే ఆ పాముల పిల్ల పంచమికి ఇంటి పగ్గాలు అంటగట్టారు. నాకు ఇవ్వకపోయినా నీకు ఇచ్చున్నా నేను చాలా సంతోషించేదాన్ని. కానీ పంచమికి ఇవ్వడమే నేను అస్సలు భరించలేక పోతున్నా అక్క.


జ్వాలా: ఈ విషయంలో నేను ఎవరితోనూ రాజీ పడను. ఈ ఇంటి పెత్తనం నేనే చేయాలి అని నా డ్రీమ్. కావాలంటే నీకు ఏం కోరికలు ఉన్నా నేను తీర్చుతాను. నాకు పోటీగా మాత్రం నువ్వు రాకూడదు. 


చైత్ర: విందు భోజనం మొత్తం ఆ పంచమి చేస్తే ఖాళీ విస్తర్లు మనం పట్టుకున్నట్లు ఉంది. అయిపోయింది అంతా అయిపోయింది అక్క ఇక మన భర్తలతో మనం ఫైట్ చేసి ఈ ఇంట్లో మనం ఉండాలో వద్దో తేల్చుకోవాలి అక్క


జ్వాలా: అలా చేస్తే మనం ఓడిపోయినట్లే చైత్ర. అన్నంలో విషం కలిపి ఈ ఇంట్లో అందరూ చనిపోయిన తర్వాతే నేను ఇంటి నుంచి కాలు బయట పెడతా. కానీ ఏదో ఒకటి చేస్తే నాకు కోపం తగ్గదు. నాదో ఐడియా చైత్ర మోక్షని చంపేసి ఆ నింద పంచమి మీద వేసేస్తే పంచమి జైలుకి వెళ్తుంది. తర్వాత మనకి మజా. 


జ్వాలా చెప్పిన ఐడియా సూపర్ అంటూ చైత్ర చెప్తుంది. ఇక ఇద్దరు హైఫై కొడితే రెండు చేతులు అతుక్కుపోతాయి. దానితో ఇద్దరు కుస్తీలు పడతారు. నీకు ఇంకా అర్థం కాలేదా ఇదంతా ఆ సుబ్బు మాయ చూడు ఇక్కడే ఎక్కడో ఉంటాడని జ్వాలా అంటుంది. ఇక అక్కడికి హనీ పాప వస్తుంది. మీరు ఏం ఆట ఆడుతున్నారో చెప్పండి అని అంటుంది. అయితే జ్వాలా తనకు సుబ్బుని వెతకమని చెప్తే సుబ్బు వద్దు ఇంట్లో అందరికీ పిలుస్తాను వాళ్లు మిమల్ని లాగుతారు అని చెప్పి హనీ లోపలికి వెళ్తుంది. ఇంతలో అక్కడికి సుబ్బు వస్తాడు. మా చేతులు విడిపించు సుబ్బు మేం ఎవరినీ చంపమని చైత్ర వేడుకుంటుంది. ఇంతలో వాళ్ల చేతులు విడిపోతాయి. 


పంచమి: (రాత్రి మేడ మీద) అమ్మా.. నాగదేవత నేను మీ ముందు చాలా అల్పురాలిని తల్లి. మీ మాటను నేను ధిక్కరించలేను. మీరు చెప్పినట్లే నాగలోకం వచ్చేస్తాను. యువరాణి పీఠంలో కూర్చొంటాను. శాశ్వతంగా అక్కడే ఉండిపోతాను తల్లీ. పంచమిగా నాది ఒకే ఒక కోరిక తల్లీ అది నెరవేర్చమ్మా. మీ ఆదేశం ప్రకారం మోక్ష బాబుని కాటేసి చంపుతాను. కానీ నా కోసం నా ప్రార్థన కోసం నా భర్తని తిరిగి బతికించుతల్లి. అమ్మ నాగదేవత ఏలోకంలో ఉన్న ఏ రూపంలో ఉన్నా మీ యువరాణి తప్పు చేయకూడదు. ధర్మం పాటించాలి. ఒక భార్యగా ఒక ఇళ్లాలిగా నా భర్త ప్రాణాలను కాపాడుకోవడం నా కర్తవ్యం. పంచమిగా నా ధర్మాన్ని పాటించేలా నువ్వే చేయాలి తల్లి. నా భర్తను బతికిస్తానని మాటిస్తే ఈ క్షణం నుంచి నేను మీ ఆజ్ఞని శిరసావహిస్తాను. ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వు తల్లీ. నా మొర ఆలకించు అమ్మా. 


ఫణేంద్ర: (పంచమి కోరుకోగానే ఫణేంద్ర దర్శనం ఇస్తాడు) భయపడకు యువరాణి. నేను మన నాగలోక యువరాజుని. పేరు ఫణేంద్ర. ఆ నాగ దేవత నీ బాధ్యత నాకు అప్పగించింది. పౌర్ణమికి నువ్వు పాముగా మారగానే నేను నిన్ను తీసుకుపోతాను.


పంచమి: నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను యువరాజా. కానీ నేను నాగలోకం రావాలి అంటే ఇక్కడ పంచమిగా నాభర్తని కాపాడుకున్నాకే రాగలను. నాగ గండం నుంచి నాభర్తను రక్షించాలి. 


ఫణేంద్ర: అది జరగని పని యువరాణి


పంచమి: జరిగి తీరాలి


ఫణేంద్ర: ఆ శత్రువుని చంపడానికి నీకు పౌర్ణమి వరకే గడువు ఉంది యువరాణి. ఆ తర్వాత ఆ అవకాశం కూడా నీకు ఉండదు. నేనే మన శత్రువుని చంపి నిన్ను మన లోకం తీసుకెళ్లి పోతాను. 


పంచమి: అలా జరగనివ్వను నన్ను కాదని నా భర్తను కాటేయడం ఎవ్వరి తరం కాదు. 


ఫణేంద్ర: ఆ పని ఈ క్షణం కూడా చేయగలను యువరాణి కానీ నీకు నాగదేవత పౌర్ణమి వరకు గడువు ఇచ్చినందున ఆగుతున్నాను. నిన్ను చాలా పవిత్రంగా నాగలోకం తీసుకెళ్లాలి. అక్కడ నేను నిన్ను వివాహమాడాలి. నువ్వు రాణివి అయితే నీకు రక్షణగా నేను ఉంటాను. జరగబోయేది అదే. 


ఇంతలో మోక్ష అక్కడికి వచ్చి పంచమిని ఎత్తుకొని తిప్పుతాడు. దాన్ని చూసి ఫణేంద్ర కోపంగా చూస్తాడు. ఎంత మంది వచ్చినా మనల్ని ఎవ్వరూ వేరుచేయలేరని అంటాడు. నువ్వు నా పక్కన ఉంటే ఏ పాము నన్ను కాటేయలేదని చెప్పి మోక్ష పంచమి చేతులకు ముద్దు పెడతాడు. అది చూసి ఫణేంద్ర రగిలిపోతాడు. ఇక ఆకలిగా ఉందని పంచమిని మోక్ష అక్కడి నుంచి తీసుకెళ్తాడు. 


ఇక ఫణేంద్ర కోపంగా వాళ్ల వైపు వెళ్తుండగా నాగ దేవత దర్శనం ఇస్తుంది. కోపంతో ఏం జయించలేవు అని చెప్తుంది. మన యువరాణి ఇప్పుడు మానవ కన్య అని వాళ్లకి ప్రేమలు, అనుబంధాలు అన్నీ ఉంటాయని చెప్తుంది. తమ యువరాణికి పరిమితులు ఉంటాయని ఎన్నడూ తప్పు చేయదని కేవలం తమ యువరాణికి రక్షణగా ఉండాలని ఫణేంద్రకు సూచిస్తుంది.


మరోవైపు కరాళి పంపించిన తంత్రి, కంత్రి పంచమి ఇంటికి వస్తారు. వారిని సుబ్బు గమనిస్తాడు. వాళ్లు పంచమి చేసిన వంటకాలు తినాలని చూస్తే గరిటలతో సబ్బు మాయ చేసి వాళ్లని కొడతాడు. ఆ సీన్ ఫన్నీగా ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.