Brahmamudi Serial November 15th Episode : కల్యాణ్ తనకు అనామికాకు పెళ్లి ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారు అని చెప్తాడు. దీంతో అనామిక కల్యాణ్‌ను హగ్ చేసుకుంటుంది. ఇక అప్పు ఫీలై కల్యాణ్ పిలిచినా వినకుండా తన ఫ్రెండ్ బైక్ మీద అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక రాహుల్ స్వప్నను గతంలో ప్రేమించిన అబ్బాయిని ఒంటరిగా కలుస్తాడు.
రాహుల్: నీకు నా భార్యకు ఏంటిరా సంబంధం. కాలేజ్‌లో స్వప్నకు నువ్వు ప్రపోజ్ చేయలేదా.. నీకు ఎంత ఇష్టం లేకపోతే తను నాతో లేచిపోయింది అని తెలిసి కూడా తనని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు. నిజం చెప్పు నీకు నా భార్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? (నవ్వుతూ) భయపడ్డావా.. కంగారు పడకు నిన్ను ఏం చేద్దామని పిలవలేదు. నీకో హెల్ప్ చేయాలని పిలిచా. చేస్తున్న ఉద్యోగం మానేసి సొంతంగా హాస్పిటల్ పెట్టాలని ఎదురు చూస్తున్నావ్. దానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలని ఎదురు చూస్తున్నావు కదా అది వచ్చేలా నేను చేస్తా.
అరుణ్: దానికి బదులుగా నేను ఏం చేయాలి సార్
రాహుల్: అయిపోతావ్ పెద్ద హాస్పిటల్ పెట్టి కోటీశ్వరుడివి అయిపోతావ్ నువ్వు పెద్ద బిజినెస్ మెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. సింపుల్ నా భార్యతో రిలేషన్ పెట్టుకున్నట్లు నటించాలి. పెళ్లి తర్వాత కూడా నీతో తిరుగుతున్నట్లు అందర్ని నమ్మించాలి.
అరుణ్: సార్.. మీది చాలా పెద్ద కుటుంబం కొంచెం తేడా జరిగినా మీ వాళ్లు నన్ను జీవితాంతం జైల్లో పెడతారు.
రాహుల్: నేను చెప్పినట్లు చేస్తే వారం రోజుల్లో నువ్వు నీ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రతీ సారి అవకాశం రాదు అరుణ్. ఎక్కువగా ఆలోచించకు.
అరుణ్: సరే సార్. మీరు చెప్పినట్లు ఫాలో అవుతా.
ఇక రాజ్ ఇంట్లో ఓ బోర్డు మీద సారీ కళావతి అని రాసి ఉంటుంది. అందరూ అక్కడికి వచ్చి అది చూస్తారు. కావ్య మేడ మీద నుంచి అది చూస్తూ ఇప్పుడు చూడండి శ్రీవారు నేను ఎంత బాగా నటిస్తానో అని మనసులో అనుకుంటుంది. అయితే భార్య విషయంలో ఏదో తప్పు చేసుంటాడని అందుకే అందరి ముందు సారీ చెప్పాలని అనుకుంటున్నాడని అందరూ అనుకుంటారు. ఇక కావ్య అక్కడికి వచ్చి ఏమీ తెలీనట్లు నటిస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అంటాడు. అందరూ నువ్వు చేసిన ఘనకార్యం చూస్తున్నామంటారు. ఏంటని అడిగి ఆ బోర్డును దానిపై ఉన్న సారీ కళావతిని చూసి షాక్ అవుతాడు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది.
కావ్య: మీరు నాకు సారీ చెప్పడం ఏంటి. పైగా ఇంతమంది ముందు ఏవండీ మీరు రాసిన దాని గురించే చెప్తున్నా అండీ (చిన్నగా) ఎలా ఉంది యాక్టింగ్ బాగుందా..
చిట్టీ: అయినా నువ్వు ఏం తప్పు చేశావ్ రాజ్
అపర్ణ: ఎందుకు అని అడిగితే నవ్వుతావ్ ఏంటి రాజ్
రాజ్: ఏదో ప్లాన్ చేసి చచ్చావ్ కదా అందరికీ చెప్పు.. ఏం లేదు అమ్మమ్మ గారు వారం రోజులుగా ఇంట్లో జరిగిన గొడవల వల్ల నాతో సరిగా మాట్లాడటం లేదు. నేను ఎంత బతిమాలినా నా మాట వినిపించుకోవడం లేదు. ఇప్పుడు నా తప్పు లేదు అని తెలిసినట్లు ఉంది అందుకే ఇలా అందరి ముందు సారీ చెప్పారు. కదండీ..
రాజ్: అంతే అంతే చెప్పింది కదా అదే కరెక్ట్
ధాన్యలక్ష్మి: సారీ చెప్పాలి అనుకున్నావ్ కదా ఇలా బోర్డులమీద చెప్పడం ఎందుకు ఎదురుగా ఉంది కదా నోటితో చెప్పెయ్ రాజ్ కావ్య కూడా హ్యాపీగా ఫీలవుతుంది.
రాజ్: ఈ ఇంట్లో ఇప్పటి దాకా జరిగిన వాటన్నింటికీ (కావ్య రాజ్ నోరు మూస్తూ) పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. అలాంటి మీరు నాకు సారీ చెప్పడం ఏంటి. రాజ్ మనసులో ఓరి దీని యాక్టింగ్ ఏమి నటిస్తున్నావే తల్లీ..
కావ్య: ఏవండీ మీరు నా మీద చూపిస్తున్న ప్రేమతో పోలిస్తే ఇలాంటివి ఎన్ని అయినా భరిస్తానండీ. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. అది చాలు అండీ నాకు కడుపు నిండిపోయింది.
రుద్రాణి: కానీ మా కడుపు నిండాలి అంటే టిఫిన్ తింటేనే అవుతుంది కాస్త వెళ్లి ఆ పని చూస్తావా?
చిట్టీ: ఇంతలా అర్థం చేసుకునే భార్య నీకు దొరకడం నీ అదృష్టం రాజ్
రాజ్: (వెటకారంగా) అవును నానమ్మ నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు.
మరోవైపు అప్పు అనామిక, కల్యాణ్‌లను గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఇంతలో కల్యాణ్ అక్కడికి వస్తాడు. అప్పుని పిలవమంటాడు. అప్పు పెద్దమ్మ పిలవడానికి వస్తుంది. అప్పుని నచ్చచెప్పి తీసుకెళ్తుంది. ఇక తనకు పెళ్లి ఫిక్స్ అయిందని కల్యాణ్ కనకానికి చెప్తాడు. కనకం చాలా సంతోష పడుతుంది. అప్పు మాత్రం సంతోష పడలేదని కల్యాణ్ ఫీల్ అవుతాడు. అదే విషయం కనకానికి చెప్తాడు. అప్పు పొగరుగా మాట్లాడుతుంది. నాకు ఎవరూ లేరు నేను ఒంటరిని అని మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక కల్యాణ్ కనకంతో మాట్లాడుతూ.. అప్పు మారిపోయిందని ఇంతకు ముందులా లేదని చెప్పి బాధ పడతాడు. ఇక అప్పు కల్యాణ్ ఫొటో చూస్తూ ఏడుస్తుంది. మరోవైపు రాజ్ హాల్‌లో జరిగిన విషయం గురించి కావ్యను అడుగుతాడు. ఎప్పటిలాగే కావ్య తింగరిగా సమాధానం చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.