Gruhalakshmi Serial November 15th Episode : నందూకి వాళ్ల అమ్మ టీ ఇస్తుంది. నందూ ఏవేవో మాట్లాడుతాడు ఇంతలో అనసూయ తన భర్తను పిలిచి వీడి గోల ఏంటో చూడండి అంటుంది. పరందామయ్య నందూకి విషయం అడుగుతారు. దాంతో నందూ తను మళ్లీ తులసి జీవితంలోకి వెళ్లాలి అనుకుంటున్నానని ఆ విషయం తులసి తల్లికి చెప్తే వద్దు అని హెచ్చరించిందని చెప్తాడు. దీంతో అనసూయ, పరందామయ్య నందూకి నచ్చచెప్తారు.
మరోవైపు తులసి ఆఫీస్ ఫైల్ చూస్తుంటుంది. ఇంతలో ఆఫీస్ వ్యక్తి వచ్చి సీఈవో పదవికి లాస్ అయ్యేలా ఉందని చెప్తాడు. ఆర్కే గ్రూప్ వాళ్లు తమ కంపెనీని ముంచేందుకు షేర్లు కొనాలి అనుకుంటున్నారని చెప్తాడు. ఇక తమ కంపెనీ బోర్డు మెంబర్ శ్రీనివాస్ తన షేర్లను ఆర్కే గ్రూప్ వాళ్లకు అమ్మడానికి రెడీ అయ్యారని తులసికి చెప్తాడు. దీంతో తులసి, నందూ షాక్ అవుతారు. వెంటనే ఆయనతో మాట్లాడి విషయం సెటిల్ చేయమంటాడు. ఇక తులసి నందూ ఆఫీస్‌కు వెళ్లి అక్కడి నుంచి వైజాగ్ వెళ్లి శ్రీనివాస్‌ను కలిసి మాట్లాడాలి అనుకుంటారు.
అఖిల్‌తో దివ్య: ఏంటి మళ్లీ ఎందుకు వచ్చావు. ఎందుకు నాకు అడ్డుపడుతున్నావు. నువ్వు నా ప్రశాంతతను చెడగొడుతున్నావు. నా కాపురాన్ని ఇబ్బంది పెడుతున్నావు. నీ కారణంగా నాకు మా ఆయనకు గొడవలు అయ్యాయి. నువ్వు కోరుకున్నది అదే కదా
అఖిల్: నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం దివ్య. ఆరాధిస్తున్నాను. కానీ నీ కాపురం చెడగొట్టాలి అని నాకు లేదు.
దివ్య: పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.
అఖిల్: నీ మీద ఒట్టు అని అఖిల్ అనగానే ఆ సీన్‌ను విక్రమ్ చూసేస్తాడు. వారి దగ్గరకు విక్రమ్ వస్తాడు. అఖిల్ వెళ్లిపోతుంటే పట్టుకొని..
విక్రమ్: ఇతనేనా ప్రియమైన నీ చిన్న నాటి స్నేహితుడు.. ఎందుకు రా పదే పదే దివ్యను కలుస్తున్నావ్
అఖిల్: తను రమ్మంటుంది నేను వస్తున్నా
విక్రమ్: నువ్వు దివ్య చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు కదా తను ఏ స్కూల్ కాలేజ్ చెప్పు..
అఖిల్: నాకు సరిగా గుర్తులేదు సార్
అఖిల్‌ను విక్రమ్ కొడతాడు. (అంతకు ముందు అఖిల్ తన ఫ్రెండ్‌తో ఫోనులో మాట్లాడుతుంటే విక్రమ్ వింటాడు.. నాకు రిసార్ట్‌లో ఓ కత్తిలాంటి ఆఫర్ దొరికింది మచ్చా. కత్తిలాంటి ఓ అమ్మాయి మీద మచ్చ పడేలా యాక్టింగ్ చేయాలి. బాగానే గిట్టుబాటు అవుతుంది అంతే కాకుండా ఆ ఫిగర్‌ను కూడా పడేయాలి.)
విక్రమ్: కత్తిలాంటి ఫిగర్ గురించి, ఆ డీల్ గురించి నువ్వు నీ ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే నేను విన్నాను. నిజం చెప్పు ఎందుకు అలా చేశావ్. చెప్తావా పోలీసులకు చెప్పాలా
అఖిల్: వద్దు సార్ నిజం చెప్పేస్తాను. రిసార్ట్‌లో మీ ఎదురుగా ఉండే ఆ భాషా వాళ్లు నాతో ఈ పని చేయించారు.
దివ్య: వాళ్లు ఎందుకు ఈ పని చేశారు. వాళ్లకు ఏం అవసరం
విక్రమ్: ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అదే
దీపక్ భార్య తులసి తల్లికి టిఫెన్ ఇస్తుంది. తాను తిననూ అంటూ దీపక్, తన భార్య, తల్లి నందూ గురించి తులసి గురించి మాట్లాడుకుంటారు. తులసి అవకాశం ఇవ్వడం వల్లే నందూ ఇలా చేస్తున్నాడని దీపక్ అంటాడు. ఈ విషయం అక్కకు నువ్వే చెప్పు అని దీపక్ తన తల్లికి చెప్తాడు. ఈ విషయాన్ని వదిలేయ్ అని దీపక్ తన తల్లిని ఓదార్చుతారు. ఇక దీపక్ తల్లి తనకు ఓ మాట ఇమ్మంటుంది. తులసిని ఒంటరిగా వదిలేయొద్దని తనకి ఎప్పటికీ తోడుగా ఉండాలని కోరుతుంది. శ్రావణి, దీపక్ మాటిస్తారు. ఇంతలో తులసి తల్లికి హార్ట్ ఎటాక్ వస్తుంది. దీపక్ అంబులెన్స్‌కి కాల్ చేస్తాడు.
మరోవైపు తులసి, నందూ కారులో వెళ్తుంటారు. కంపెనీ గురించి మాట్లాడుకుంటారు. కంపెనీ చేయి జారకుండా ఎలా అని ఆలోచిస్తుంటారు. ఎలా అయినా శ్రీనివాస్‌ను ఒప్పించి కంపెనీని రక్షించుకోవాలని తులసి అంటుంది. ఇక వైజాగ్ నుంచి తిరిగి వచ్చేలోపు తన మనసులో మాట చెప్పి తులసిని ఒప్పిస్తానని నందూ మనసులో అనుకుంటాడు.
దివ్య, విక్రమ్‌లు భాషా, జాఫ్రిన్ వాళ్ల గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే వాళ్లు రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయింటారు. దివ్య, విక్రమ్‌లు వాళ్ల కోసం ఆలోచిస్తుంటారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
తరువాయి భాగంలో: తులసి తల్లి పరిస్థితి సీరియస్‌గా ఉందని.. ఆపరేషన్‌కు 10 లక్షల రూపాయలు అవసరం అవుతాయని డాక్టర్ చెప్పారు. దీంతో దీపక్ తులసికి ఫోన్ చేస్తే నందూ ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు.