Naga Panchami Today Episode: ఇంట్లో అందరూ పంచమిని నిందిస్తారు. పంచమి అసలు ప్రెగ్నెంట్ కాదు అని కావాలనే నాటకం ఆడుతుంది అని చిత్ర, జ్వాలలు అందరి ముందు చెప్తారు. ఇక శబరి నాగసాధువు అబద్ధం చెప్పరు అని వాళ్లని నిందిస్తారు అంటే కళ్లు పోతాయి అని తిడుతుంది.
మోక్ష: ఇప్పుడెందుకు మమల్ని పిలిచి ఇవన్నీ అడుగుతున్నారు. అసలు మీ అనుమానం ఏంటి.
వైదేహి: పంచమి గర్భవతి కాదు అదే మీ అనుమానం.
మోక్ష: సరే నువ్వు నమ్మకు అమ్మ.
వైదేహి: నిజం మాకు తెలియాలి మోక్ష. ఈ అబద్ధం ఒక పెళ్లి ఆగిపోవడానికి కారణం కాకూడదు. గర్భం అని తేలి తనకు పిల్లలు పుట్టరు అని తెలిస్తే ఒక్క నిమిషం కూడా తను ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు.
మోక్ష: పెళ్లి అనేది మా సొంత విషయం అమ్మ. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు. మాకు పిల్లలు కలిగినా కలగకపోయినా మేం భార్యాభర్తలమే. మమల్ని విడిపోండి అని చెప్పడానికి మీకెవరికీ అధికారం లేదు. మేఘనది జరిగిపోయిన కథ. నేను పంచమి కలిసే ఉన్నాం కలిసే ఉంటాం. ఇక ఈ విషయంలో మీకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. పంచమి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. నువ్వు రూంలోకి వెళ్లు నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తాను జాగ్రత్త.
వైదేహి: చూశారా అండి వాడి పొగరు. నేను ఏమైనా వాడి శత్రువునా వాడు సంతోషంగా ఉండాలి అనే కదా నా బాధ అంతా. మళ్లీ పెళ్లి చేస్తే వాడు సంతోషంగా ఉంటాడు అని ఆశ పడ్డాను. కానీ ఇదే మన మోక్షను ఏదో మాయ చేస్తుంది.
జ్వాల: ఏదో రకంగా దీన్ని ఇంట్లో నుంచి పంపించేయండి మామయ్య అప్పుడు అందరం బాగుంటాం.
చిత్ర: ఆ పాము మమల్ని కాటేయాలి అనుకోవడం నిన్ను మీరు చూశారు కదా మామయ్య ఈ పంచమికి పాముకి ఏమాత్రం తేడా కాదు మామయ్య. దీన్ని వెంటనే పంపించేయండి అసలు ఇది ప్రెగ్నెంట్ కాదు ఏం కాదు. అది అంతా అబద్ధం.
రఘురాం: పంచమి ఈ మామయ్య మీద నీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా నాతో రా అమ్మా.
పంచమి: ఎక్కడికి మామయ్య.
రఘురాం: పద చెప్తాను. వైదేహి రా చెప్తాను. అని అందరూ ఎక్కడికి అని అడిగినా చెప్పకుండా రఘురాం పంచమిని తీసుకొని వెళ్తాడు.
మోక్ష: సార్ నావైఫ్ గురించి మీకు పూర్తి డిటైల్స్ తెలుసు కదా.. ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్.
సైంటిస్ట్: వాట్..
మోక్ష: అనుకోని పరిస్థితుల్లో కలిశాం సార్..
సైంటిస్ట్: మరి నీకు ఏం కాలేదా..
మోక్ష: చనిపోయి బతికాను సార్. ఒక రకంగా ఇది నాకు మరో జన్మ సార్. మా వాళ్లు ఆశలు వదిలేసుకున్నారు.
సైంటిస్ట్: నమ్మలేకపోతున్నాను మోక్ష. నాగులావరానికి ఆ శివయ్యకి, నాగుజాతికి ఏదో సంబంధం ఉండి ఉంటుంది. ఆ విషయం విరుగుడుకు పూర్వకాలంలోని నాటు వైద్యులు ఆ శివయ్య విగ్రహం ఏర్పాటు చేసి ఉంటారు.
మోక్ష: అవన్నీ రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి అంటే సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు నా ప్రాబ్లమ్ నా వైఫ్ రక్తంలో ఉన్న విషం తన కడుపులో బిడ్డకు కూడా వస్తుందా..
సైంటిస్ట్: వంద శాతం మోక్ష. అందులో డౌటే అక్కర్లేదు. పంచమికి ఉన్నది వ్యాధి కాదు మోక్ష. జన్మతాహ తను విషకన్య.
మోక్ష: అప్పుడు మా బిడ్డ విషంతో పుడితే కష్టం కదా సార్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
సైంటిస్ట్: అది కన్ఫమ్ చేసుకునే ముందు మరోసారి పంచమి బ్లడ్, లోపలి పిండం పొజిషన్ టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడే టెస్ట్ చేద్దాం. బయట ల్యాబ్‌లో చేస్తే మళ్లీ న్యూస్ మొత్తం వ్యాప్తి చెంది అల్లరవుతుంది.
మోక్ష పంచమిని ఆ ల్యాబ్‌కి తీసుకెళ్లడం కోసం ఇంటికి ఫోన్ చేస్తాడు. ఇక శబరి ఫోన్ ఎత్తి రఘురాం, వైదేహి పంచమిని ఎక్కడికో తీసుకు వెళ్లారని చెప్తుంది. రఘురాం పంచమిని తీసుకొని హాస్పిటల్‌కి తీసుకొస్తాడు. నాగసాధువుల మీద నాకు నమ్మకం ఉంది అని పంచమి అనడంతో రఘురాం వాళ్లకంటే ఎక్కువ నమ్మకం నాకు నీ మీద ఉంది పంచమి కానీ ఇంట్లో అందరూ నిన్ను నానా మాటలు అనడం నాకు ఇష్టం లేదు వాళ్ల నోళ్లు మూతలు పడాలి అంటే నువ్వు పరీక్ష చేయించుకోక తప్పదు పంచమి.
పంచమి: మామయ్య ఈ విషయంలో నా భర్త నిర్ణయమే నా నిర్ణయం. మోక్షాబాబుకి చెప్పకుండా నేను ఈ పరీక్షలు చేయించుకోను మామయ్య. నన్ను క్షమించండి.
వైదేహి: ఏంటి వాడిని నిన్ను అడిగేది. మా అనుమానం తీరాలి అంటే నువ్వు పరీక్షలు చేయించుకోక తప్పదు. నువ్వు గర్భవతివి కాదు అని తెలిస్తే మాత్రం నా ఇంట్లో నీకు స్థానం ఉండదు.
పంచమి: మనసులో.. భగవంతుడా ఈ పరీక్షల్లో నా ఒంట్లో విషం ఉంది అని తెలిస్తే మోక్షాబాబుని నాకు దూరం చేసేస్తారు. అందరికీ నా ఉనికి గురించి తెలిసి పోతుంది. మోక్షాబాబు పరువు పోవడమే కాకుండా తనను అందరూ నిందిస్తారు.
రఘురాం: పంచమి నామీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ పరీక్ష చేయించుకోమ్మా. నీ మీద నీకు నమ్మకం ఉంది కదా ఇక భయం ఎందుకు పంచమి. పంచమి.. మా మోక్ష జీవితం నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది.
నువ్వు వద్దు అంటే నేను నీ మీద అనుమానపడాల్సి వస్తుంది.
ఇక రఘురాం పంచమిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాడు. ఇక మోక్ష తండ్రికి కాల్ చేస్తే రఘురాం పంచమిని తీసుకొని హాస్పిటల్‌కి వచ్చామని బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నామని అంటాడు. మోక్ష షాక్ అవుతాడు. ఇక మోక్ష కూడా హాస్పిటల్ దగ్గరకు బయల్దేరుతాడు.
ఇక నాగేశ్వరి కూడా బ్లడ్ టెస్ట్ చేస్తే పంచమి విషకన్య అని తెలిసిపోతుంది. ఈ విషయం బయట పడితే కడుపులో పిండాన్ని తొలగిస్తారు అని మహారాణి కోరిక నెరవేరదు అని నాగలోకానికి రాణి లోటు తీరదని బాధపడుతుంది.
మోక్ష హాస్పిటల్ దగ్గరకు వస్తాడు. పంచమి టెన్షన్ పడుతుంది. తనకు ధైర్యం సరిపోవడం లేదు అని రక్తంలో విషం ఉంది అని తెలిస్తే అత్త గొడవ చేస్తుంది అని మళ్లీ కష్టాలు మొదటికి వస్తాయని పంచమి బాధపడుతుంది. ఏం చేయాలా అని మోక్ష ఆలోచిస్తుంటాడు. మరోవైపు తనేం చేయలేను అని మహారాణి ఆత్మను ఆవాహనం చేసుకొని సలహా అడుగుతాను అంటుంది.
ఇంతలో డాక్టర్ వచ్చి పంచమి ప్రెగ్నెంట్ అని చెప్తుంది. పంచమి, మోక్ష షాక్ అవుతూనే హ్యాపీగా ఫీలవుతారు. రఘురాం చాలా సంతోషిస్తాడు. వైదేహి షాక్ అవుతుంది. మోక్ష డాక్టర్‌కి అన్ని టెస్ట్‌లు చేశారా అని అడుగుతాడు. చేశాం అని ఏ ప్రాబ్లమ్ లేదు అని డాక్టర్ చెప్తుంది. మోక్ష షాక్ అవుతాడు. ఇక నాగేశ్వరి పంచమి తల్లి మహారాణి ఆత్మను ఆవాహనం చేసుకొని మాట్లాడుతుంది. దీంతో మహారాణి తన కూతురు భర్తతో సంతోషంగా ఉండాలి అని అందుకు పంచమి శరీరంలోని విషాన్ని తానే స్వీకరించాను అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మి అండతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించిన మధుమిత..!