Seethe Ramudi Katnam Today Episode కొంతమంది ఆడవాళ్లు వచ్చి మహాలక్ష్మి వాళ్లకు గృహప్రవేశానికి పిలుస్తారు. మధుమితను మహాలక్ష్మి కోడలు అనుకొని తనని కూడా రమ్మని పిలుస్తారు. ఇంతలో రామ్ వచ్చి మధుమిత కోడలు కాదు అని చెప్పబోతే మహాలక్ష్మ రామ్‌ను అడ్డుకొని తప్పకుండా గృహాప్రవేశానికి వస్తాం అని చెప్తుంది.
రేవతి: ఏంటి వదిన ఇది రామ్ భార్య సీత అని వాళ్లకి చెప్పాలి కదా..
చలపతి: కనీసం మధుమిత నీ కోడలు కాదు అని అయినా చెప్పాలి కదా.
మహాలక్ష్మి: పెళ్లికి ముందు మధుమిత నా కోడలు అని పేపర్‌లో వేయించాం. రిసెప్షన్‌కు రాని ఎంతో మంది మధుమిత నా కోడలు అనుకున్నారు వీళ్లు కూడా అలాగే అనుకున్నారు.
రేవతి: అలా అనుకున్నవారికి రామ్ అసలు భార్య ఎవరో చెప్పాలి కదా వదిన.
అర్చన: ఎంతమందికి అని చెప్పమని అంటావు రేవతి. ఇంటింటికి వెళ్లి రామ్ భార్య సీత అని బొట్టు పెట్టి చెప్పమంటావా.
గిరిధర్: అనుకోని మనకు వచ్చిన నష్టం ఏంటి..
చలపతి: నష్టం మనకు కాదు బావ. మధుమితకు. తను సూర్య భార్య రామ్ భార్య కాదు.
మహాలక్ష్మి: రామ్ భార్య కావాల్సింది సూర్య భార్య ఎందుకు అయింది అంటే ఏం చెప్పాలి అన్నయ్య. మధుమిత ప్రేమ గురించి చెప్పాలా. లేక నువ్వు చేసిన రామ్ పెళ్లి గురించి చెప్పాలా.. జరిగింది చెప్తే మధుమిత ఇక్కడ ఎందుకు ఉంది సూర్య ఎక్కడ అని అడుగుతారు. అవన్నీ చెప్పి మధుమితను ఇంకా బాధ పెట్టాలా..
రామ్: కరెక్టే అనవసరమైన గొడవలు ఎందుకు.
రేవతి: ఏంటి కరెక్ట్ రామ్. నువ్వు వీళ్లని సమర్ధిస్తున్నావా. అసలు మధుమిత కూడా ఏం మాట్లాడటం లేదు.
మహాలక్ష్మి: మధ్యలో మధుమితని ఎందుకు లాగుతున్నావు. తనేం చేసింది.
రేవతి: సీత ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది. ఉండి ఉంటే అందరికీ అర్థమయ్యేలా తనే చెప్పేది. మీరు మధుకి న్యాయం చేయండి కాదు అనను కానీ సీతకు మాత్రం అన్యాయం చేయకండి.
రామ్: ఇప్పుడు సీతకు అన్యాయం ఏం జరిగింది అత్త.
చలపతి: ఇప్పుడు తెలీదు రామ్ ముందు ముందు మీకే తెలుస్తుంది.
మరోవైపు సీత బయట నుంచి వస్తుండగా గృహప్రవేశానికి పిలిచిన వాళ్లు ఎదురవుతారు. ఎందుకు ఈ ఇంటికి వచ్చారు అని సీత అడగడంతో జరిగిందంతా చెప్తారు. మధుమితని రామ్ భార్య అనుకున్నారు అని తెలుసి సీత షాక్ అవుతుంది. ఇక సీత వాళ్లని పట్టుపట్టుకొని మహాలక్ష్మి దగ్గరకు తీసుకెళ్తుంది. వాళ్లు వచ్చి సీత ఎవరు అని మహాలక్ష్మిని ప్రశ్నిస్తారు. రామ్ చెప్పబోతే సీత ఆపి మహాలక్ష్మినే చెప్పాలి అంటుంది. మహాలక్ష్మి చెప్పకపోవడంతో సీత మహాలక్ష్మిని మాట్లాడాలి అని పక్కకు తీసుకెళ్తుంది. ఇక సీత వాళ్లతో తనకు బొట్టు పెట్టించకపోతే ఆల్బమ్ చూపిస్తాను అని బెదిరిస్తుంది. ఇక మహాలక్ష్మి వాళ్లతో సీత తనకు మేనకోడలు అవుతుంది అని తనకు కూడా బొట్టు పెట్టమని చెప్తుంది. ఇక రేవతి, చలపతిలు మేనకోడలు అని భలే కవర్ చేశావని మహాలక్ష్మిని అంటారు.
మహాలక్ష్మి: మనసులో.. రామ్ నీకు నిజంగానే బావనే. ఈ నిజం నీకు ఎప్పటికీ తెలీనివ్వను.
రామ్: ఇంకెప్పుడు మా పిన్నిని ఇలా ఇబ్బంది పెట్టకు సీత.
సీత: ఈ రోజు మేనకోడలు అన్నారు. ఏదో ఒక రోజు కోడలు అని మీరే చెప్తారు.
మహాలక్ష్మి: సీత నా సంతోషాన్ని అంతా పాడు చేస్తుంది. ఇక నుంచి ఈ ఇంటికి ఎవరు వచ్చినా మనం ఇలాగే టెన్షన్ పడాలి.
మహాలక్ష్మి ఇంటికి వచ్చిన శివకృష్ణ, లలిత
శివకృష్ణ: మధుమితతో మేం మాట్లాడాలి..
గరిధర్: మొన్నే కదా మాట్లాడారు. మళ్లీ ఏంటి.
సీత: అక్కా.. అక్కా.. కిందకి రా అమ్మానాన్న వచ్చారు.
లలిత: ఎలా ఉన్నావ్ మధు. మా దిగులు అంతా నీ గురించే..
శివకృష్ణ: నేను మా పై అధికారులతో మాట్లాడాను. సూర్య విషయంలో వాళ్లు హెల్ప్ చేస్తాం అని ప్రామిస్ చేశారు. త్వరలో సూర్య బయటకు వస్తాడు.
సీత: ఎంత మంచి వార్త చెప్పారు నాన్న ఇక అక్క కష్టాలు అన్నీ తీరినట్లే.
లలిత: అవును సీత. మధు ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మన ఇంటికి వచ్చేయ్. మీ బావగారి ఇంట్లో కూడా వద్దు. సూర్య వచ్చేవరకు మన ఇంట్లోనే ఉందువుగాని.
సీత: ఇంత త్వరగా నీ సమస్య తీరినందుకు సంతోషంగా ఉంది అక్క.
శివకృష్ణ: ఇంకా ఏం ఆలోచిస్తున్నావు. నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా.. ఇక ఇంటికి పద. నీ బ్యాగ్ తెచ్చుకో మధు వెళ్లిపోదాం.
లలిత: సీత వెళ్లి అక్క బ్యాగ్ తీసుకొని రా.
సీత: సరే అమ్మ..
మధు: ఆగు.. ఎవరు మీరు.. ఎందుకు వచ్చారు. నేను మీ వెంట ఎందుకు రావాలి. మీరు నాకు ఏమవుతారు.
సీత: ఏంటి అక్క ఇలా మాట్లాడుతున్నావు. వీళ్లు మన అమ్మానాన్నలు.
మధు: వీళ్లు నీకు మాత్రమే అమ్మానాన్నలు నాకు కాదు. వీళ్లు వచ్చింది కూడా నీకోసమే నా కోసం కాదు. నేను ఇక్కడ ఉంటే నువ్వు ఇబ్బంది పడతావు అని నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. వీళ్లకు నువ్వు మాత్రమే కూతురువి నేను కాదు. కాదు.. నేను మీ కూతుర్ని కాదు. మీకు ఉన్నది ఒకర్తే కూతురు అని అది కూడా సీత అని మీ ఆయన నాతో వంద సార్లు అన్నారు. ఒకప్పుడు మీకు పెద్ద కూతురు ఉండేదని ఇప్పుడు అది లేదు అని నీ భర్త మైలు స్నానం చేసేశాడు. లేని కూతురు కోసం మీరు ఎలా వచ్చారు. అప్పుడు చచ్చిపోయిన కూతురు ఇప్పుడు బతికి వచ్చింది. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకు వచ్చిందా. అప్పుడు నా మీద ఉన్న కోపం ద్వేషం ఇప్పుడు పోయాయా.
సీత: అప్పుడు ఇప్పుడు అమ్మానాన్నలకు నీ మీద కోపం లేదు అక్క నీ గురించే ఆలోచించారు.
మధు: ఎప్పుడే ఆలోచించారే.. నా భర్త అరెస్ట్ అయ్యాడు అని కాళ్లు వేళ్లు పట్టుకున్నానా అప్పుడు ఆలోచించారా.. నా కాపురం నిలబెట్టండి నాన్న అని పోలీస్ స్టేషన్ ఎదుట మొరపెట్టుకున్నా అయినా ఆలోచించారా.. నా భర్తని కోర్టుకు తీసుకెళ్తుంటే ఈయన గారు ఇంట్లో కూర్చొన్నారు. నా గురించి ఎప్పుడు ఆలోచించారు. ఇప్పుడు వచ్చి పై అధికారులతో మాట్లాడాను సూర్య వచ్చేస్తాడు. అంటే నేను నమ్మాలి. నమ్మి వెళ్తే నా బతుకు ఏమవుతుందో తెలుసా కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. వీళ్లకు నీ మీద ఉన్న ప్రేమ నా మీద లేదు సీత. నీ కోసం ఏమైనా చేస్తారు కానీ నా కోసం ఏం చేయరు. మీరు చూపించాల్సిన ప్రేమ ఇంకా ఎవరైనా చూపిస్తే మీకు కోపం అనుమానం వస్తాయి కదా. నా వల్ల మీ చిన్న కూతురుకి ఆపద వస్తుంది అని మీ భయం కదా. మీ లాంటి వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. మీకు నా గురించి పదే పదే రావాల్సిన అవసరం లేదు. నేను ఎప్పటికి మీతో రాను మీరు ఇంకెప్పటికీ ఇక్కడికి రాకండి.
మహాలక్ష్మి: ఇంకా మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా శివకృష్ణ గారు. ఏమీ లేకపోతే మీ అల్లుడు ఆఫర్ చేసినట్లు కాఫీ, టీ తాగి వెళ్లొచ్చు. లేదా వెంటనే బయల్దేరొచ్చు. మీ ఇష్టం.
రామ్: నేను మీకే ముందే చెప్పాను కదా అంకుల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మధు వచ్చేస్తుంది అని మళ్లీ మీరు రావడం ఎందుకు.
శివకృష్ణ: ప్రాబ్లమ్ స్వాల్వ్ అయితే మధుమిత అక్కడికి రావడం కాదు బాబు. మధు ఇక్కడికి రావడమే ప్రాబ్లమ్..
రామ్: మధుమిత ఇక్కడుంటే ఏంటి ప్రాబ్లమ్. ఇలాంటప్పుడు ఈగోకి పోతే ఎలా మధ్యలో మధు ఇబ్బంది పడుతుంది కదా..
మహాలక్ష్మి: అందుకే రామ్ మనం అందరం మధుకి సపోర్ట్‌గా ఉండాలి. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.