Trinayani Today Episode గాయత్రీ పాపను గాయత్రీ దేవితో పోల్చి చూద్దామని తిలోత్తమ, సుమన, వల్లభలు పాపను ఫొటో దగ్గరకు తీసుకెళ్తారు. వెటకారంగా నవ్వతూ గాయత్రీ పాపను హేళన చేస్తారు. ఇంతలో సుమన, తిలోత్తమలను ఫొటో కింద పెట్టిన గాయత్రీ దేవి చీర ఎగిరి ఇద్దర్ని కప్పి దానిపై పాము ఇద్దర్ని నొక్కి పట్టేస్తుంది. ఇంట్లో అందర్ని వల్లభ పిలుస్తాడు. అందరూ చూసి షాక్ అవుతారు.
పావనా: వాళ్లని చుట్టుముట్టింది పాము బాబోయ్..
సుమన: అంటే మెడకు బిగుసుకున్నది చీర కాదా..
తిలోత్తమ: మెడకు పాము చుట్టింది అంటే ఇంకా కొంచెం గట్టిగా చుట్టింది అంటే ప్రాణం పోతుంది. అని ఇద్దరూ ఉక్కిరిబిక్కిరి అవుతారు.
డమ్మక్క: నయని గాయత్రీ పాప కూడా వాళ్ల దగ్గరే ఉంది.
విశాల్: గాయత్రీ.. గాయత్రీ...
వల్లభ: ఇప్పుడు తప్పకుండా కాపాడుతావు అన్నమాట.
విక్రాంత్: పాప ఎక్కడుంది.
డమ్మక్క: సుమన దగ్గర..
హాసిని: పలకడం లేదు ఏంటి.
దురంధర: ఇంకేం మాట్లాడుతుందే చూసిన మనలకే వణుకు వస్తుంది. మరి చీర లోపల ఉన్న వాళ్ల సంగతి ఏంటో..
విశాల్: మా అమ్మ చీరని మీరు ఎందుకు తీశారు.
నయని: ఏదో పిచ్చి పని చేసే ఉంటారు.
విక్రాంత్: మీరే నాగయ్యకు చెప్పి వాళ్లని వదలమని చెప్పండి వదిన.
డమ్మక్క: ఇప్పుడు నాగయ్య ఎవరు చెప్పినా వినడు.
విశాల్: ఎవరి మాటా వినకపోతే ఇప్పుడు నిజంగానే వీళ్ల ప్రాణం పోయేలా ఉంది.
విక్రాంత్: వేరు మార్గం లేదా..
డమ్మక్క: సుమన ఎత్తుకున్న గాయత్రీ దేవిని కిందకి దించమని చెప్పండి.
విశాల్: నాకు అర్థమైంది. పాపను వాళ్లు ఏం చేస్తారో అని నాగయ్య వాళ్లని అలా మెడలు చుట్టాడు. సో.. సుమన గాయత్రీని కిందకు దించు..
నయని: గాయత్రీ... నాగయ్య అత్తయ్య, సుమనను విడిచిపెట్టేయ్.. గాయత్రీ క్షేమంగానే ఉంది వదిలేయ్. అంటే పాము వదిలి వెళ్లిపోతుంది. ఇక దురంధర వాళ్ల మీద చీరని తీసేస్తుంది. ఇక విక్రాంత్ సుమనను లాగి పెట్టి ఒకటి కొడతాడు..
విశాల్: రేయ్ విక్రాంత్ ఎందుకు కొట్టావ్ రా.
విక్రాంత్: తనతో పాటు అమ్మ కాకుండా ఇంకా ఎవరైనా ఉండి ఉంటే ఇద్దరికీ దెబ్బలు పడేవి బ్రో.
తిలోత్తమ: ఏంట్రా ఆ మాటలు.
విక్రాంత్: ముందు మీరు ఎందుకు పాపని ఎత్తుకొని ఫొటో దగ్గరకు వెళ్లారో అది చెప్పండి.
వల్లభ: పాపం డమ్మక్క వద్దు అని ఎంత చెప్పినా వినకుండా పెద్దమ్మ కళగా ఉందా గాయత్రీ కళగా ఉందా అని గాయత్రీ పెద్దమ్మ ఫొటో దగ్గరకు వెళ్లారు.
విశాల్: అమ్మ చిన్న పిల్లకు అమ్మకు పోలిక ఏంటి.
నయని: పక్కనే గాయత్రీ అమ్మగారి చీరలు పెట్టుకొని పరాచికాలు ఆడినట్లు ఉన్నారు. లేదంటే..
డమ్మక్క: లేదంటే సుమంగళిగా ఇద్దరూ సెలవు తీసుకునే వాళ్లు.
వల్లభ: మమ్మీ ఇక రిస్క్ తీసుకోకుండా ఉంటే బాగేమో..
తిలోత్తమ: నేను చావను రా.. నన్ను గాయత్రీ అక్కయ్యే చంపాలి.
వల్లభ: ఇది నిజమో కోరికో తెలీదు కానీ ఇంకోసారి ఇలా అనకు మమ్మీ. వందేళ్లు బతుకుతాను అని అనుకోకపోతే యాక్సిడెంట్ చనిపోతారు. నీకు అదే చెప్తున్నాను పెద్దమ్మ వస్తుంది చంపేస్తుంది అంటే ముందే పోతుంది.
తిలోత్తమ: రేయ్ ఆ విషయం వదిలేయ్.. గాయత్రీ అక్కయ్య ఎక్కడో లేదురా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉందిరా. ఒక్కసారి ఏం జరిగిందో గుర్తుచేసుకోరా. గాయత్రీ పాపను మేం తీసుకొని ఫొటో దగ్గరకు వెళ్లగానే ఆమె పక్కనే ఉండి మాపై దాడి చేసింది. పునర్జన్మలో పుట్టి ఏడాదిన్నర అయి కూడా పసి బిడ్డలా రాలేదు అంటే ఈ పాటికే నెలల వయసులోనే కనుమూసి ఉండాలి. ఈ ఇంటి దగ్గరకు వచ్చి చిన్న పిల్ల అయిన గాయత్రీ పాప దగ్గరకు వచ్చి పగ తీర్చుకుంటూ ఉండాలి.
వల్లభ: ఏంటో మమ్మీ అఖండ స్వామి ఏమో గాయత్రీ పెద్దమ్మ పునర్జన్మలో పుట్టి ప్రాణాలతోనే ఉంది అంటాడు. నువ్వేమో పసి వయసులోనే చనిపోయి ఆత్మగా తిరుగుతుంది అంటున్నావు. ఏది నిజమో తేల్చుకోలేకపోతున్నాను.
తిలోత్తమ: గాయత్రీ పాప పేరు చివరన దేవి చేర్చడం వల్ల ఆత్మగా తన చుట్టూ తిరుగుతుంది అని నా అనుమానం. అది నిజమో కాదో ఇప్పుడు మనం తేల్చాలి.
వల్లభ: మరేం పరీక్షలు వద్దు అమ్మ నీ వల్ల నేను బలైపోయేలా ఉన్నాను.
మరోవైపు నయని సుమనకు క్లాస్ తీసుకుంటుంది. తనని అవమానిస్తున్నావు అని సుమన అంటే నయని చంపేయడం లేదు అని అంటుంది. ఇక విక్రాంత్ వచ్చి కోటీశ్వరురాలు అయినా గాయత్రీ పాపకి ఉలూచికి సంబంధం లేదు అని అంటాడు. గాయత్రీ పాపను ఎత్తుకొని ఏం చేయాలనుకున్నావో ఏంటని నయని ప్రశ్నిస్తుంది. సుమన తన మాటలతో నయని వాళ్లని చిరాకు పెడుతుంది. ఇక సుమన గాయత్రీ పాపని ఎత్తుకుపోవాలి అని అనుకుంటుంది.
మరోవైపు పెద్ద బొట్టమ్మ నెత్తిన బుట్ట అందులో మునగ కాయలు వేసి పట్టుకొని వస్తుంది. ఇక డమ్మక్కను చూసి షాక్ అవుతుంది. ఇక సుమన గాయత్రీ పాప దగ్గరకు వచ్చి గాయత్రీ పాప నువ్వు నా బుజ్జి బంగారు బాతువి అని అంటుంది. సుమన పాపను ఎత్తుకొని తీసుకెళ్తూ నీకు బయటకు తీసుకొని వెళ్లి నీ విలువ ఎంతో తెలుసుకుందా అని అంటుంది. మరోవైపు మునగ నోము అంటూ ఉలూచిని ఎత్తుకుపోవడానికి వచ్చావు కదా అని పెద్దబొట్టమ్మని డమ్మక్క అడుతుంది. దీంతో పెద్ద బొట్టమ్మ నీళ్లు నములుతుంది. మరోవైపు సుమన తన కొంగు చాటున గాయత్రీ పాపకి తీసుకెళ్తుంది. అది చూసిన పావనా, దురంధరలు సుమన ఉలూచిని తీసుకెళ్తుంది అనుకొని జాగ్రత్తలు చెప్తారు. ఇక సుమన బయట పెద్దబొట్టమ్మ, డమ్మక్కలను చూసి ఆగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: అనసూయ భరద్వాజ్: ట్రెడిషనల్ లుక్ లో అనసూయ-నెట్టింట్లో ఫోటోలు వైరల్