Prema Entha Madhuram Serial Today Episode: ఇంట్లో అజయ్, నీరజ్ గొడవ పడుతుంటారు. ఒకరినొకరు కాలర్ పట్టుకుని కొట్టుకుంటుంటే ఆర్య వచ్చి విడిపిస్తాడు. అయినా వినకుండా ఇద్దరూ గొడవపడుతుంటే శారదాదేవి వచ్చి నీరజ్‌ను కొడుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అమ్మ కోపంతో ఏదో అంటూ ఆర్య, నీరజ్‌ను ఓదారుస్తాడు. నీరజ్ బాధపడుతూ మన ఇంట్లో ఏం జరుగుతుందో నాకర్థం కావడం లేదని మనకు చెడు చేయాలని చూసిన వాళ్లకు నువ్వు సపోర్టు చేయడం ఏంటమ్మా అని అడుగుతాడు.
కేశవ: నువ్వేం మాట్లాడవేంటి ఆర్య. ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. పోనీ జరుగుతున్న విషయాల్లో నీకైనా క్లారిటీ ఉందా?
ఆర్య: ఏం జరిగినా సరే అంతా అమ్మ ఇష్టప్రకారమే జరుతుంది. ఎందుకు ఏమిటి అని మీరు అమ్మను ప్రశ్నించి ఇబ్బంది పెట్టొద్దు.
నీరజ్: మళ్లీ అదే మాట అమ్మ చేస్తుంది తప్పు అంటుంటే మీరు తనకి సపోర్టు చేస్తారేంటి దాదా
అజయ్: చాలు ఆపండి మీరంతా మమ్మల్ని గెంటేయాలని డిసైడ్ అయ్యారు. మళ్లీ ఈ డ్రామాలెందుకు?
అంటూ అజయ్ వెళ్లబోతుంటే మళ్లీ శారదాదేవి వెళ్లి ఆపుతుంది. దీంతో నేను ఈ ఇంట్లో ఉండాలంటే నాకు పూర్తి అధికారం ఇవ్వండి. అనగానే నీరజ్, కేశవ అడ్డుపడతారు. ఇది దారుణం అంటూ నిలదీస్తారు. దీంతో అజయ్ నేను ఈ ఇంట్లో ఉండాలా? లేదా? అనేది వెంటనే డిసైడ్ చేయండి అంటూ ఆల్టిమేటం జారీ చేయడంతో ఆర్య బ్లాంక్ బాండ్ పేపర్స్ తీసుకురా అంటూ కేశవకు చెప్తాడు.
నీరజ్: దాదా మీరు చేసేది కరెక్టు కాదు దాదా
ఆర్య: నీరజ్ నా డిసీజన్ మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా నువ్వింకేం మట్లాడకు.
కేశవ: అది కాదు ఆర్య
ఆర్య: జెండే నీకు కూడా చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పాలా ఏంటి?
అనగానే కేశవ వెళ్లి బాండ్ పేపర్స్ తీసుకొస్తాడు. వాటి మీద ఆర్య సంతకం చేస్తాడు. తర్వాత అనుతో సంతకం చేయించి ఆ పేపర్స్ అజయ్‌కు ఇస్తాడు.
ఆర్య: బ్లాంక్ బాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి ఇస్తున్నాను. దీన్ని అధికారంలా కాకుండా రెస్పాన్సబులిటీలా ఫీలవ్వు.
అజయ్: థాంక్యూ.. అడగ్గానే ఒప్పుకోవడానికి నీకు మనసు రాదనుకున్నా బట్ నీకు ఆస్థికన్నా అమ్మ మాటే ముఖ్యం అని ప్రూవ్ చేశావు. టచ్ చేశావు బ్రో.. ఇప్పుడు నా ఇంట్లో నేను ఉంటున్నాను అనే ఫీల్‌తో బిందాస్‌గా ఉంటా..
అంటూ బాండ్ పేపర్స్ మీరాకు ఇచ్చి జాగ్రత్తగా దాయమంటాడు. మీరా లగేజీ తీసుకుని వెళ్లబోతుంటే అజయ్ వద్దని ఇప్పుడు ఇంట్లో అందరూ మన పనివాళ్లేనని ఎవరో ఒకరు తీసుకొస్తారని పైకి వెళ్లిపోతారు.
కేశవ: ఆర్య ఒక్కమాటైన అమ్మను అడక్కుండా ఆస్థి మొత్తం అజయ్‌కి రాసిచ్చేశావు.
ఆర్య: అమ్మ రామాయణాన్ని ఆచరిస్తుంది జెండే. రాజ్యం వదిలి వనవాసానికి వెళ్లమని కేకేయి రాముణ్ని ఆజ్ఞాపిస్తే.. రాముడు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించాడా?
అనగానే అందరూ బాధపడుతుంటారు. తర్వాత రూంలో బట్టలు సర్ధుకుంటూ ఆర్య, అను బాధపడుతుంటారు. ఇంతలో శారదాదేవి, కేశవ, నీరజ్ లోపలికి వస్తారు.
శారద: ఏంటి ఆర్య ఇది ఏం చేస్తున్నావు.
నీరజ్: ఇల్లు వదిలి వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోయారా దాదా?
కేశవ: మీతో పాటు పిలల్ని కూడా ఇబ్బంది పెడతారా? ఇన్నేళ్లు వాళ్లు ఈ ఇంటికి దూరంగా బతికారు. మళ్లీ వాళ్లను ఇంటికి దూరం చేస్తారా?
అని అడగడంతో ఇప్పుడు ఈ ఇంటి మీద హక్కులు అజయ్‌కు ఉన్నాయి. మేము ఇక్కడే ఉంటే అను, పిల్లలు చాలా అవమానాలు పడాల్సి వస్తుంది అని చెప్పగానే శారదాదేవి ఏడుస్తుంది. అజయ్ ఆస్థి అడిగినప్పుడు నువ్వెందుకు ప్రశ్నించలేదు అంటూ ఈ ఇంట్లోంచి దాదానే కాదు మేము కూడా వెళ్లిపోతాం అంటాడు నీరజ్. దీంతో శారదాదేవి ఏడుస్తూ అజయ్ ఈ ఇంట్లో ఉంటేనే మనందరికీ మంచిది. నాకు కావాల్సింది మీరు ఎక్కడికి వెళ్లకూడదు అంటూ నువ్వు ఇల్లు వదిలి వెళ్లిపోతే ఈ అమ్మ మీద ఒట్టే అంటూ మీరు దూరమైతే నేను ప్రాణాలతో ఉండలేను అంటుంది శారదాదేవి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోలు.. డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోజులిచ్చిన హీరోయిన్