Naga Panchami Today Episode కరాళి నీలుకి కంటి చూపు తెప్పించడానికి తన అన్న నంబూద్రి ఇచ్చిన సంజీవినికి ఇంట్లో పూజ చేస్తుంది. కరాళి పూజలు చూసి నీలు తల్లిదండ్రలు భయపడతారు. కరాళి వాళ్ల దగ్గరకు వెళ్లి తన పూజలు చూసి భయపడొద్దు అని తనో మహా యజ్ఞం చేస్తున్నాను అని తనని నమ్మమని చెప్తుంది. ఇక నీలు తల్లి తన కూతురుకి కంటి చూపు తీసుకొచ్చే బాధ్యత కరాళి మీద పెడుతున్నా అని అంటుంది. ఇక కరాళి రాత్రి అంతా పూజ చేయాల్సి ఉంటుందని చెప్పి కరాళి నీలుని ముగ్గులో కూర్చొపెట్టి పూజ చేస్తుంది.  నీలుని నిద్ర పోవద్దని చెప్తుంది. నీలు సరే అంటుంది. కరాళి పూజలకు ముగ్గులో ఉన్న దీపాల నుంచి శక్తి వస్తుంది. అది సంజీవినికి తాకుతుంది. 


జ్వాల తన గదిలో ఉంటూ మోక్ష పిల్లల్ని చదివించను అన్న విషయాన్ని తలచుకుంటూ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తుంది. ఇంతలో చిత్ర అక్కడికి వస్తుంది. పంచమి పాము అని నిరూపించలేకపోతున్నాం అని జ్వాల చిత్రతో చెప్తుంది. పంచమి పిల్లల మీద తనకు చాలా అనుమానాలు ఉన్నాయని అంటుంది. డాక్టర్ పంచమి కడుపులో పిండం వింతగా ఉందని చెప్పారని కానీ ఇలాంటి మంచి పిల్లలు ఎలా పుట్టారా అని అంటుంది.


చిత్ర: నాకు అదే అనుమానం అక్క. అప్పుడు గొడవ పెట్టుకొని మరీ డెలివరీకి వెళ్లింది. అసలు ఈ పిల్లలు పంచమి పిల్లలేనా. 
జ్వాల: దాని పిల్లలు అయితే మాత్రం వాళ్లు మామూలు పిల్లలు అవ్వరు చిత్ర. కచ్చితంగా పాము పిల్లలే అయింటారు. లేకపోతే స్కూల్‌లో చేర్చకుండా ఇంట్లో చదివించుకుంటాం అని ఎందుకు అంటారు. ఈ రోజుల్లో కూడా పిల్లల్ని చదివించకుండా ఎవరైనా ఉంటారా.. మనం పిల్లలకు కట్టిన రక్షలు తీసి దాచిపెడదాం. అప్పుడు ఆ పిల్లల సంగతి తేలిపోతుంది. 
చిత్ర: నిజంగా ఆ పిల్లలు పాములుగా మారే వారు అయితే నేను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను అక్క.
జ్వాల: ఓసేయ్ పిచ్చి ముఖం దానా. మనం ఎందుకు పోవడమే వాళ్లనే పంపేద్దాం. వాళ్లని వెళ్లగొడితే వాళ్ల ఆస్తి కూడా మనదే. పద పిల్లలకు కట్టిన రక్ష తీసేస్దాం. పద. 


వైశాలి నాగాంశ అని తెలుసుకున్న మోక్ష కుమిలిపోతాడు. వైశాలి నన్ను వదిలి వెళ్లిపోతావా అమ్మా అని ఏడుస్తాడు. మోక్ష ఏడ్వటం చూసి పంచమి కూడా ఏడుస్తుంది. మోక్ష పంచమిని పట్టుకొని ఏడుస్తాడు. తాను ఎవరికీ చిన్న ద్రోహం కూడా చూసి ఉండడని తనకు ఇన్ని కష్టాలు ఏంటి అని ఏడుస్తాడు. బంగారం లాంటి ఇద్దరి పిల్లల్ని ఇచ్చి ఒక బిడ్డని తిరిగి తీసుకెళ్లిపోతాను అంటే ఎలా తట్టుకోగలను అని కొట్టుకొని ఏడుస్తాడు. 


మోక్ష: నా ప్రాణం అడిగినా సంతోషంగా ఇస్తాను కానీ వైశాలిని మాత్రం వదులుకోలేను. వదులుకోలేను. నా బిడ్డను పంపించను పంచమి. నా ఇద్దరు నాకు కావాలి. ఆ నాగదేవతకు చెప్పు పంచమి. కావాలి అంటే నా ప్రాణం తీసుకెళ్లమని చెప్పు పంచమి. చెప్పు పంచమి. 
పంచమి: వద్దు మోక్షాబాబు అవసరం అయితే నేను ప్రాణ త్యాగం చేస్తాను. ఆ రోజు నేనే నాగలోకం వెళ్లిఉంటే మీకు ఈ కష్టాలు ఉండేవి కాదు. నేను మిమల్ని వదిలి పోలేక ఇక్కడే ఉండిపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. నేను నాగదేవత కాలు మీద పడి మళ్లీ నాకు నాగలోకం వెళ్లే అవకాశం ఇవ్వమని కోరుకుంటాను. నా బిడ్డను వదిలేయమని కోరుకుంటాను. మీరు మన పిల్లల్ని బాగా చూసుకుంటారు మోక్షాబాబు అప్పుడు నేను ఉన్నా లేకున్న ఒక్కటే.
మోక్ష: అలా అనకు పంచమి. నిన్ను వదులుకోవడం అంటే నన్ను నేను ఆత్మార్ఫణం చేసుకోవడమే.
పంచమి: మనకు మరో అవకాశం లేదు మోక్షాబాబు. వైశాలికి నాగలక్షణాలు వస్తే మనల్ని మర్చిపోతుంది. నాగేశ్వరి కచ్చితంగా మన వైశాలిని తీసుకుపోతుంది. మన పాపకు నాగలక్షణాలు రాకుండా చూసుకోవాలి. 
మోక్ష: అవును పంచమి. ఇప్పటికే ఇంట్లో అనుమానాలు మొదలయ్యాయి. వైశాలిని ఎవరైనా వేలెత్తి చూపితే నేను తట్టుకోలేను. 
పంచమి: మోక్షాబాబు మనం ఆ రహస్యాన్ని ఎక్కువ రోజులు దాచలేం. 
మోక్ష: పంచమి ఓ పని చేద్దాం నాగ సాధువుని కలుద్దాం. నేను వెళ్లి ఆయనకు మన కష్టం చెప్తాను. నేను ఇప్పుడే వెళ్తాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.


వైశాలి, ఫాల్గుణి పడుకొని ఉంటే జ్వాల, చిత్రలు అక్కడికి వస్తారు. జ్వాలని లోపలికి వెళ్లమని చిత్ర బయటే ఉంటుంది. ఇంతలో పంచమి వస్తుంది. చిత్ర పంచమిని చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్యీ సౌభాగ్యవతి సీరియల్: తన కొడుకుని వలలో వేసుకుంటుందని జానుని తిట్టిన దేవయాని!