Krishna Mukunda Murari Promo Today: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. మీరా కడుపులో ఉన్నది తమ బిడ్డే అని కృష్ణ మధుకి చెప్పడం.. మధు ఇంట్లో అందరికీ సరోగసీ గురించి చెప్తాడు. దీంతో భవాని కృష్ణ, మీరాని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. కృష్ణ డాక్టర్ వైదేహిని సరోగసీ గురించి అడగటంలో డాక్టర్ మీరా మనిషి కావడంతో డాక్టర్ ప్లేట్ తిప్పేస్తుంది. డాక్టర్ మాటలకు కంగుతున్న కృష్ణ ఇంటికి వచ్చి తన అత్తలకు ఒక్క అవకాశం అడగటంతో నిన్నటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో లేటెస్ట్ ప్రోమో ఇవాళ్టి ఎపిసోడ్ మీద మరింత ఆసక్తి పెంచేస్తుంది. ఇంతకీ ప్రోమోలో ఏముంది అంటే..
"హాల్‌లో మధు, భవాని కాఫీ తాగుతూ ఉంటారు. రేవతి శకుంతల కూడా అప్పుడే అక్కడికి వస్తారు. ఇక కృష్ణ ముకుందకు పాలు తీసుకొని వచ్చి ఇస్తుంది. పాలు తీసుకో అని చెప్తుంది. తనని చూడకుండా ఏసీపీ సార్ ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు అని ఉన్నారు అంటే నువ్వు చెప్పేది అందరూ నమ్మడంలో తప్పు లేదు అని ముకుందతో అంటుంది. నేను నీ మీద కోపంతో ద్వేషంతో ఉండటం కరెక్ట్ కాదు అని పాలు తీసుకో అని అంటుంది. ముకుంద పాలు తీసుకుంటుంది. ఇంతలో రేవతి కృష్ణతో అంటే మురారి ఎక్కడున్నాడో తెలిసి కూడా నీకు చెప్పడం లేదు అని అపోహ పడుతున్నావా అని అడుగుతుంది. దానికి కృష్ణ ఏసీపీ సార్ అంటే పెద్దత్తయ్యకు ప్రాణం కదా. మరి పెద్దత్తయ్య ఎందుకు ఊరుకున్నారు అని అంటుంది. దానికి భవాని కృష్ణ అంటూ అరుస్తూ కృష్ణ మీదకు చేయి ఎత్తి కొట్టాను అంటే పళ్లు రాలతాయ్ అని అంటుంది. దీంతో ప్రోమో పూర్తి అవుతుంది"
తానే ముకుంద అని మీరా కృష్ణకు చెప్తుంది. కానీ ఆ విషయం ఇంట్లో వాళ్లకి చెప్తే తన కడుపులో ఉన్న కృష్ణ బిడ్డను చంపేస్తాను అని బెదిరిస్తుంది. ఇక కృష్ణ ఇంట్లో లేని టైంలో మీరా ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసేలా చేసి మురారినే తన బిడ్డకు తండ్రి అని చెప్తుంది. అయితే మురారిని అడిగి నిజం తెలుసుకోవాలి అని కుటుంబం మొత్తం అనుకుంటారు. కానీ మురారి కనిపించకుండా పోతాడు. ఆ తరుణంలో కృష్ణ భవానికి తెలిసే నిజం దాస్తుందని అనుకుంటుంది.
నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..
మధు ఇంట్లో వాళ్లకి నిజం చెప్పడంతో ముకుంద తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. భవాని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. డాక్టర్ అసలు తాను సరోగసీనే చేయలేదు అనేస్తుంది. దీంతో కృష్ణ చాలా ఫీలవుతుంది. ఇక ఇంటికి రాగానే రజిని భవాని కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతుంది. అది విన్న కృష్ణ తన వల్ల పోయిన పరువు తానే నిలబెడతాను అని టైం ఇవ్వమని భవానిని అడుగుతుంది.
మరోవైపు ముకుంద బయటకు వెళ్లిపోతాను అని బ్యాగ్ పట్టుకొని వస్తుంది. తన బిడ్డను తాను తీసుకొని వెళ్లిపోతాను అని బయల్దేరుతుంది. ఒక్కరు కూడా తన గురించి ఆలోచించడం లేదు అని ముకుంద భవాని దగ్గర మొసలి కన్నీళ్లు కార్చుతుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది. కృష్ణ ముకుందని అడ్డుకొని ఎవరి బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నావ్.. చంపేస్తా అని అంటుంది. ముకుంద గొంతు పట్టుకొని నువ్వు చేసిన పనులకు ఎప్పుడో చంపేసేదాన్ని అని కడుపులో ఉన్న నా బిడ్డ కోసం నిన్ను వదిలేస్తున్నా అని అంటుంది. మధు కలుగజేసుకొని న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉండి పోరాడమని అంటాడు. మురారి వచ్చే వరకు ఇక్కడే ఉండమని ఏసీపీ సార్ వచ్చాక లాంఛనాలతో నిన్ను బయటకు పంపిస్తాను అని కృష్ణ అంటుంది.