Krishna Mukunda Murari Serial Today June 3rd: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ప్లేట్ తిప్పేసిన డాక్టర్.. ఇంటి నుంచి వెళ్లిపోతానన్న ముకుంద, గొంతు పట్టుకున్న కృష్ణ!

Krishna Mukunda Murari Serial Today Episode : సరోగసీ గురించి కృష్ణ డాక్టర్‌ని నిలదీయడంతో అసలు తాను సరోగసీ చేయలేదు అని డాక్టర్ అందరి ముందు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Krishna Mukunda Murari Today Episode : మీరా కడుపులో ఉన్నది కృష్ణ, మురారిల బిడ్డ అని మధు ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు. మీరా నాటకం ఆడిందని సరోగసీ మదర్‌గా మీరానే కృష్ణ, మురారిలకు తెలీకుండా ఉందని చెప్తాడు. మీరా మధు చెప్పేది అంతా అబద్ధం అని పెళ్లి కాకుండా సరోగసీ మదర్‌గా ఉండటానికి తానెందుకు ఇష్టపడతాను అని ప్రశ్నిస్తూ తన నాటకం మొదలు పెడుతుంది. 

Continues below advertisement

మధు: ఎందుకంటే ముందు మురారి బిడ్డకు తల్లి అయి తర్వాత మురారికి భార్య కావాలి అనుకున్నావ్ కాబట్టి. పెద్దమ్మ జరిగింది ఇదే పెద్దమ్మ. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డ ద్వారా తనకు మురారికి సంబంధం ఉందని నాటకం ఆడి మనల్ని నమ్మించాలి అనుకుంది. మురారినే తండ్రి కాబట్టి డీఎన్‌ఏ టెస్ట్‌కి కూడా సిద్ధమైంది.

కృష్ణ: అసలు డీఎన్‌ఏ టెస్ట్ చేయాల్సింది ఏసీపీ సార్‌కి కాదు మధు నాకు. అప్పుడే ఆ బిడ్డకు తల్లిని నేను అని రిజల్ట్ వస్తుంది.

మధు: సూపర్ కృష్ణ. ఇప్పుడు చెప్పు డీఎన్ఏ టెస్ట్‌కి రెడీఏనా. 

ముకుంద: ఎందుకు మధు నేను మీకు ఏ అన్యాయం చేశా అని ఇలా నాతో ఆడుకుంటున్నారు. అయినా ఈ కృష్ణకు నేను సాటి ఆడదాన్ని అన్న జాలి కూడా లేదు. నీ భర్త నీకు ఎక్కడ దూరం అయిపోతాడు అని నాకు అన్యాయం చేయాలి అని చూస్తున్నావా. మేడం మీరు అనాథ అయిన నాకు ఇంటికి తెచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరూ నాకు అన్యాయం చేస్తే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. 

సరోగసీ ప్రాసెస్ చాలా కష్టమని రిపోర్ట్ చూపించమని ముకుంద అంటే కృష్ణ డాక్టర్ దగ్గరకే వెళ్దామని అంటుంది. దాంతో ముకుంద ఎంతకు తెగించావే.. నీ బిడ్డ నా కడుపులో పెరగాలి అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావ్ అని మనసులో అనుకుంటుంది. ఇక ఇప్పుడే హాస్పిటల్‌కి వెళ్దామని భవాని మధుతో చెప్తుంది. అందరూ డాక్టర్ దగ్గరకు బయల్దేరుతారు. హాస్పిటల్ దగ్గర ముకుంద ఏడుస్తుంటే కృష్ణ దొంగ ఏడుపులు ఆపమని డాక్టర్ నీ అసలు రంగు తేల్చుతుంది అని  అంటుంది. ఏ డాక్టర్ అలా చెప్తుందో నేను చూస్తాను అని ముకుంద అంటుంది. ఇక డాక్టర్ దగ్గరకు కృష్ణ వెళ్తుంది. వైదేహి డాక్టర్‌కి మీరా సైగ చేయడంతో డాక్టర్ ప్లేట్ తిప్పేస్తుంది. కృష్ణదే తప్పు అన్నట్లు డాక్టర్ అనేస్తుంది. సాటి డాక్టర్‌కి ఇంత అన్యాయం చేయడం మంచిది కాదు అని కృష్ణ అంటుంది. సరోగసీ ఏం చేయలేదు అని డాక్టర్ ప్లేట్ తిప్పేస్తుంది.   

మరోవైపు రజిని ఇదో నీచమైన కుటుంబం అని అందరూ తప్పుడు మనషులు అని తన కూతుర్ని బయటకు తీసుకెళ్లిపోతాను అని బయల్దేరమని చెప్తుంది. ఇంతలో రజిని మాటలు భవాని, రేవతి ఇద్దరూ వింటారు. ఊరిలో పని పడింది అని వెళ్తామని అంటే భవానీ అంతా విన్నాను అని అంటుంది. ఇంత దారుణమైన కుటుంబాన్ని నేను ఎక్కడ చూడలేదు అంటుంది. ఇక కృష్ణ వచ్చి రజిని మీద కోపమవుతుంది. రజిని మాటలు పట్టించుకోవద్దు అని నిజం తాను నిరూపిస్తాను అని కృష్ణ అంటుంది. భవాని కృష్ణతో ఇంటి పరువు తీసేశావు అని అంటుంది. భవానితో కృష్ణ మాట్లాడాలి అని ప్రయత్నిస్తే భవాని మాట్లాడను అని అంటుంది. నిజం నిరూపిస్తాను అని కొంచెం ఓపిక పట్టమని ఇద్దరు అత్తలను కృష్ణ వేడుకుంటుంది. 

మరోవైపు ముకుంద బ్యాగ్ పట్టుకొని వస్తుంది. తన బిడ్డను తాను తీసుకొని వెళ్లిపోతాను అని బయల్దేరుతుంది. ఒక్కరు కూడా తన గురించి ఆలోచించడం లేదు అని ముకుంద భవాని దగ్గర మొసలి కన్నీళ్లు కార్చుతుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది. కృష్ణ ముకుందని అడ్డుకొని ఎవరి బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నావ్.. చంపేస్తా అని అంటుంది. ముకుంద గొంతు పట్టుకొని నువ్వు చేసిన పనులకు ఎప్పుడో చంపేసేదాన్ని అని కడుపులో ఉన్న నా బిడ్డ కోసం నిన్ను వదిలేస్తున్నా అని అంటుంది. మధు కలుగజేసుకొని న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉండి పోరాడమని అంటాడు. మురారి వచ్చే వరకు ఇక్కడే ఉండమని ఏసీపీ సార్ వచ్చాక లాంఛనాలతో నిన్ను బయటకు పంపిస్తాను అని కృష్ణ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్‌కి గుండెపోటు.. పోటీల్లో విజయం సాధించిన సీత.. మధు పీడ పోయినట్లేనా!

Continues below advertisement