Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జున్నుని తన తండ్రి తిట్టాడని లక్కీ ఓదార్చుతుంది. సర్ది చెప్తుంది. ఇక జున్ను ఇంటికి వెళ్లిపోతా అని అంటాడు. అలిగి వెళ్లిపోతాడు కూడా. లక్కీ ఫీలవుతుంది. మరోవైపు జాను కోసం వివేక్ వస్తాడు. వివేక్ దగ్గర జాను ఎమోషనల్ అయిపోతుంది.
జాను విక్రమ్‌తో ఎమోషనల్‌గా మన చుట్టూ ఒక సమస్య ఉంది. దానికి పరిష్కారం వెతకడం మనకు చేత కావడం లేదు. నాకు సంతోషంగా ఉన్నట్లు నటించడం చేతకాదు అని వెళ్లిపోతుంది. దీంతో విక్రమ్ జాను చేయి పట్టుకొని దగ్గరకు తీసుకుంటాడు. మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా నవ్వే నా భార్యవి.. నేనే నీ భర్తని అని చెప్తాడు. మన ఫ్యూచర్ గురించి మన పిల్లల గురించి ఆలోచించాలి కానీ ఇలా సమస్యల గురించి కాదు అని అంటాడు. ఇక జానుకి ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకు వస్తాడు. ఇక జానుకి తన అత్తయ్య పిలవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
జాను కిందకి రావడంతో మెహందీ డిజైన్స్ చూడమని చెప్తుంది. జాను వద్దు అనేస్తుంది. లక్ష్మీ ఇంట్లో ఉండి ఉంటే ఈ పాటికే నీ పెళ్లి చేసి నీ బాధ్యత తీర్చుదని అందుకే ఇప్పుడు ఆ బాధ్యత తాను తీసుకున్నాను అని పెళ్లి చేస్తానని మిత్ర తల్లి చెప్తుంది. లక్ష్మీ కూడా మనసులో తన అత్తయ్య తన చెల్లికి బాగా సపోర్ట్ చేస్తుందని అనుకుంటంది. ఇక దేవయాని జానుని వెటకారం చేస్తుంది. ఇన్నేళ్లు అయినా మిత్రని పెళ్లి చేసుకోలేకపోతున్నావ్ అని మనీషాని అంటుంది. దీంతో లక్ష్మీ ఊపిరి పీల్చుకుంటుంది. మనీషా మనసులో కొంగు పట్టుకొని తిరిగే మిత్ర ఇప్పుడు పట్టించుకోవడం లేదు అని అంటుంది.
ఇక లక్ష్మీ ఎందుకు మిత్ర, మనీషాలు ఇంకా పెళ్లి చేసుకోలేదా అని ఆలోచిస్తుంది. ఇక దేవయాని జాహ్నవికి ఈ జన్మలో పెళ్లి రాత ఉందా. అసలు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా అని అంటుంది. జాను గురించి తనకు బాగా తెలుసు అని తన కొడుకుని వలలో వేసుకోవాలి అని చూస్తుంది అని అంటుంది. జానుకి ఆ అర్హత లేదు అని విక్రమ్ ఎదురుగానే అంటుంది. జాను విక్రమ్‌ని చూసి ఏడుస్తుంది. తన చెల్లి విక్రమ్ పెళ్లికి దేవయాని అత్తయ్య కారణం అని అనుకుంటుంది లక్ష్మీ. ఇక దేవయాని మాటలకు జాను హర్ట్ అయి తన ఇంటికి వెళ్లిపోబోతుంది. ఇంతలో లక్ష్మీ జాను అని పిలుస్తుంది. జాహ్నవి ఆగుతుంది. జానుని బాధ పెడతున్నారు అని అంటుంది. జాను వెనకే విక్రమ్ పరుగులు పెడతాడు.
మరోవైపు అర్జున్ వంట చేస్తాడు. జున్ను, లక్ష్మీ కోసం స్పెషల్‌గా చేశాను అని అర్జున్ అంటాడు. లక్ష్మీ ఇంటి నుంచి బయల్దేరుతుంది. ఇక అటుగా మిత్ర కూడా వస్తాడు. లక్ష్మీ పడిపోబోతే పట్టుకుంటాడు. జాగ్రత్త అని చెప్తాడు. ఇక లక్ష్మీని మిత్ర ఆగమని చెప్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.