Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మను చంపడానికి ఫాలో అయిన బాబ్జి నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లగానే మిస్సమ్మకు ఎదురుగా వెళ్లి కత్తి బయటకు తీస్తాడు. దీంతో మిస్సమ్మ భయపడుతుంది. ఇంతలో కారులో వస్తున్న అమర్ బాబ్జి కత్తితో మిస్సమ్మను పొడవబోతుంటే రాయి తీసుకుని విసురుతాడు. రాయి తగలడంతో బాబ్జి కింద పడిపోతాడు. తర్వాత ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. అమర్ చేతికి గాయం అవుతుంది. దీంతో మిస్సమ్మ గట్టిగా అరుస్తుంది. ఇంతలో రాథోడ్ వస్తాడు. బాబ్జి పారిపోతాడు. అమర్, మిస్సమ్మ, రాథోడ్ ఇంటికి వెళ్తారు. మరోవైపు పిల్లలందరూ మీటింగ్ పెట్టుకుంటారు.
అమ్ము: మళ్లీ ఎమైంది నన్ను ఎందుకు అందరూ అలా చూస్తున్నారు.
అంజు: అమ్ము నీకు ఇవాళ ఏమైంది. ఎందుకు ఉదయం నుంచి మనోహరి ఆంటీతో అంత రూడ్‌గా బిహేవ్ చేస్తున్నావు.
అమ్ము: ఇందాక మనోహరి ఆంటీతో మాట్లాడ్డం నువ్వు విన్నావా? అంజు
అంజు: నువ్వు అరిచే వరకు విన్నా అరవగానే భయపడి వీళ్లను తీసుకురావడానికి వచ్చా. తీరా వచ్చేసరికి నువ్వు వెళ్లిపోయావు.
అంటూ నిన్ను చూస్తుంటే అమ్మలా కనిపిస్తున్నావు. ఆ మిస్సమ్మతో కలిసి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అనగానే మిస్సమ్మ ఏం చేసినా మీ మంచి కోసమేగా అనగానే అదేంటి మళ్లీ మీ మంచి కోసం అంటూ వేరుగా మాట్లాడుతున్నావు అంటారు. ఇంతలో రాథోడ్, అమర్, మిస్సమ్మ కంగారుగా ఇంటికి వస్తారు. రాథోడ్ కేకలు విని మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది మిస్సమ్మను చంపేసి ఉంటాడనుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ వాయిస్ విని డిసప్పాయింట్ అవుతుంది. కిందకు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఎవరో వచ్చి నన్ను చంపబోయారు. ఇంతలో ఆయన వచ్చి కాపాడారు అని చెప్తుంది.
నిర్మల: ఆ దేవుడి దయ ఉంది కాబట్టి సమయానికి అమర్ అక్కడికి వచ్చి నిన్ను కాపాడాడు.
శివరాం: అసలు వచ్చింది ఎవరు? నిన్ను చంపాలని ఎందుకు చూశాడు.
రాథోడ్: ఎవడో దొంగ వెధవ. మెడలో బంగారం కోసం వచ్చి ఉంటాడు.
అమర్: వాడు బంగారం కోసం రాలేదు. మిస్సమ్మ ప్రాణం తీయడానికే వచ్చాడు. ముసుగులో మిస్సమ్మను చంపడానికి వచ్చింది. బాబ్జీ.. ఆరును లారీతో గుద్ది చంపినవాడు.
అని అమర్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అమ్ము, మిస్సమ్మ కోపంగా మనోహరి వైపు చూస్తుంటారు. నన్ను దేవుడి దగ్గరకు పంపడానికి నన్ను పూజకు పంపిచావా మనోహరి అని మనసులో అనుకుంటుంది మిస్సమ్మ. అమర్, మిస్సమ్మకు థ్రెట్ ఉందని నువ్వు బయటకు వెళ్లొద్దని చెప్తాడు. తర్వాత మనోహరి లోపలికి వెళ్లి భయపడుతుంది. అమ్మును కూడా చంపేయాలని డిసైడ్ అవుతుంది. మరోవైపు అమర్ నుంచి తప్పించుకుని పారిపోయిన బాబ్జీ, మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి, బాబ్జీని తిడుతుంది. ప్రస్తుతం అండర్‌గ్రౌండ్ కు వెళ్లమని చెప్తుంది. మరోవైపు మిస్సమ్మ అమర్‌కు జాగ్రత్తలు చెప్తుంది.
అమర్: నాకు దెబ్బ తగిలింది కాలుకు కాదు చేతికి..
మిస్సమ్మ: ఏంటి అలా చూస్తున్నారు మీరు చూస్తే వణికిపోయే రోజులు పోయాయి. ఈ దెబ్బ తగ్గేవరకు చెప్పినట్లు వినండి.
అమర్: నిన్ను ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశాను.
మిస్సమ్మ: హలో మాస్టారూ మీరు రానిస్తే రాలేదు. నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను గుర్తు పెట్టుకోండి.
అనగానే నిన్ను కాపాడబోయి నాకు దెబ్బ తగిలిందని నువ్వు నాకు సేవలేం చేయొద్దని అమర్ అనగానే నేను కూడా అలా ఏం చేయలేదని ఒకే రూంలో ఉన్నందుకు చేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది మిస్సమ్మ. తర్వాత ఈ అటాక్ ఆ మనోహరి చేయించింది అని రాథోడ్ తో చెప్తుంది మిస్సమ్మ. అవునని రాథోడ్ అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ అరెస్ట్, రేపు కోర్టులో హాజరు పర్చనున్న పోలీసులు