Lakshmi Nivasam Serial Today Episode: ఖుషీ రాకతో తులసి జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోందో అని లక్ష్మీ, శ్రీనివాస్‌లు ఆందోళన చెందుతూ పెళ్లి కోసం ఆలోచించాలని ఆమెను అడుగుతారు. ఇదే సమయంలో శ్రీ కారుకి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి డబ్బుల కోసం భార్గవ్ దగ్గరికి వస్తాడు. అతన్ని చూసిన భార్గవ్ షాక్‌కు గురై అతనితో మాట్లాడుతుండగా.. సుపర్ణిక అక్కడికి వస్తుంది. ఆమెకు కారు ఇన్సూరెన్స్ కోసం అంటూ నచ్చచెప్పి పంపేస్తాడు. అటు.. తులసి జీవితం బాగుపడాలని లక్ష్మి ఆలయంలో అభిషేకం చేస్తుండగా స్పృహ కోల్పోబోతుండగా సిద్ధు అక్కడికి వచ్చి ఆమెను పట్టుకుంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..

Continues below advertisement


సిద్ధుకి నిజం తెలిసిందా..


ఇంత ప్రయాసపడుతూ శివయ్యకు మొక్కు చెల్లించడం అవసరమా.? అంటూ సిద్ధు లక్ష్మిని అడుగుతాడు. తన కూతురు పెళ్లి ఆగిపోయిందని.. అందుకే ఇలా చేస్తున్నానని సిద్ధుతో చెప్తుంది లక్ష్మి. ఇంత కన్నా మంచి సంబంధం ఆమెకు వస్తుందని సిద్ధు లక్ష్మికి ధైర్యం చెప్తాడు. తాను కూడా చేసిన ఓ పొరపాటు వల్ల ఓ కుటుంబానికి అన్యాయం జరిగిందని చాలా బాధ పడ్డానని సిద్ధు లక్ష్మికి చెప్తాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదని అంటాడు. 


తులసి ఉద్యోగం ఊస్ట్


మరోవైపు.. తులసి ఆఫీస్‌కు వెళ్లగా స్టాఫ్ అంతా సానుభూతి చూపిస్తారు. ఇంతలో సుపర్ణిక అక్కడకు వచ్చి ఆమె ముందు ఓ ఫైల్ పెడుతుంది. తనకు ఎలాంటి పదవులు వద్దని ఎండీ పోస్టును నిరాకరిస్తుంది తులసి. అయితే, జాబ్‌కు రిజైన్ చేయాలని సుపర్ణిక చెబుతుంది. ఈ జాబ్ తనకు చాలా అవసరమని.. జాబ్‌లోంచి తీయొద్దని తులసి ప్రాధేయపడుతుంది. 2 నెలల శాలరీతో పాటు మరో రూ.10 వేలు ముందుగానే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సుపర్ణిక అంటుంది. దీంతో విధి లేక తులసి తన జాబ్‌కు రిజైన్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.


ఒంటరిగా ఖుషీ..


అటు, ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఖుషీ ఆలోచిస్తుంది. కాలినొప్పితో బాధపడుతూ టాయిలెట్‌కు వెళ్తుండగా.. పట్టు తప్పి కింద పడిపోతుంది. దీంతో ఏడుస్తూ ఉండగా.. శ్రీనివాస్ ఆమెను ఎత్తుకుని విషయం ఏంటని అడగ్గా.. తాను టాయిలెట్‌కు వెళ్లాలని అడుగుతుంది. దీంతో అక్కడకు వచ్చిన లక్ష్మి పాపను తీసుకెళ్తుంది. పాపకు సాయం చేయనందుకు శ్రీనివాస్, బామ్మ, వాణి అంతా సంతోష్‌పై కోప్పడతారు. 


జై ఎంట్రీ అదుర్స్


కాలేజీలో ఈవెంట్ కోసం జాను సిద్ధం అవుతుంటుంది. ఇదే సమయంలో చీఫ్ గెస్ట్‌గా ఉన్న ఓ వ్యక్తి కటౌట్‌ను చూస్తుంది. అప్పుడే సరిగ్గా కారు దిగి వస్తాడు ఓ యువకుడు. అతను ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వస్తున్నాడని తెలుసుకుని చిన్న వయసులోనే ఇంత క్రెడిట్ సంపాదించడం గ్రేట్ అంటూ అతన్ని పక్కనే పెట్టుకుని చూడకుండా పొగిడేస్తుంది.


వెంటనే పక్కకు తిరిగి ఒక్కసారిగా జాను షాక్ అవుతుంది. ఆ వెంటనే తన పేరు జయ్ అంటూ జానుకి పరిచయం చేసుకుంటాడు. సారీ సర్ అంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది జాను. దీంతో జై.. జానును ఆశ్చర్యంగా చూస్తుండిపోతాడు. 


సిద్ధు తులసిని చూస్తాడా..


అటు.. ఎమ్మెల్యే మునుస్వామి మనుషులు ఓ పేద వృద్ధురాలి ఇంటిని ఖాళీ చేసేందుకు యత్నిస్తుండగా సిద్ధు అక్కడికి వస్తాడు. అధికారం అండతో ఏమైనా చేయాలనుకుంటే తాను ఊరుకోనని.. వారిని అక్కడి నుంచి వెళ్లాలని సిద్ధు వార్నింగ్ ఇస్తాడు. ఇదే టైంలో జాబ్ పోగొట్టుకుని దీనంగా అటు వైపుగా వస్తుంది తులసి. మరి సిద్ధు తులసిని చూస్తాడా.? జై ఎంట్రీతో విశ్వకు ఇబ్బంది కలుగుతుందా.? అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.