Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, లక్ష్మీ ఇద్దరూ పానీ పూరీ తింటారు. లక్ష్మీ విహారికి తినిపిస్తుంది. ఇద్దరూ చాలా హ్యాపీగా తింటూ ఉంటారు. ఇంతలో అంబిక అటుగా రావడం విహారి చూస్తాడు. కనక మహాలక్ష్మీని దాక్కోమని చెప్తాడు. తాను మాత్రమే పానీ పూరీ తింటాడు. అంబిక విహారి దగ్గరకు వస్తుంది. విహారి నువ్వేంటి ఇక్కడ నువ్వు ఇలాంటి ఫుడ్ తినవు కదా అంటే ఈ మధ్య తింటున్నా అత్తయ్య అని తడబడతాడు. అంబిక చూట్టూ లక్ష్మీ కోసం చూస్తుంది. లక్ష్మీ అంబికకు కనిపించకుండా దాక్కుంటుంది.
అంబిక వెళ్లిపోతుంది. తర్వాత లక్ష్మీ వస్తుంది. తర్వాత ఇద్దరూ బయల్దేరుతుంటే యమున కాల్ లక్ష్మీతో నువ్వే మాట్లాడు.. తన భర్త ఎవరో ఏంటో కనుక్కో అని అంటుంది. విహారి మనసులో నేనే లక్ష్మీ భర్తని కానీ ఎప్పటికీ చెప్పలేనమ్మా అని అనుకుంటాడు. లక్ష్మీతో ఏం కంగారు లక్ష్మీ మన ఇద్దరం కలిసి ఈ సమస్యని ఎదుర్కొందాం అని చెప్తాడు. అంబిక ఓ చోట ఆగి సహస్రకి కాల్ చేస్తుంది. విహారి, లక్ష్మీ ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్లారని మదన్ చెప్పాడు కదా కానీ విహారి దగ్గర లక్ష్మీ లేదని విహారి పానీపూరీ తిన్నాడని చెప్తుంది. సహస్ర షాక్ అవుతుంది. బావ స్ట్రీట్ ఫుడ్ తినడు కదా అంటుంది. లక్ష్మీ ఎక్కడో దాక్కుని ఉంటుందని అంటుంది. ఇంతలో విహారి, లక్ష్మీ ఇద్దరూ ఆఫీస్‌కి వస్తారు.
అంబిక: సహస్ర ఇప్పుడు చెప్తున్నా ఇద్దరూ కారులో వెళ్లారు. నన్ను చూసి పానీపూరి బండి దగ్గర లక్ష్మీ దాక్కుంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వచ్చింది. ఇద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. విహారి పూర్తిగా దాని మాయలో పడిపోయాడు సహస్ర. పూర్తిగా దాని అలవాట్లు వచ్చాయి. జాగ్రత్త పడు లేదంటే ఆ మదన్ పరిస్థితే నీకు కూడా.సహస్ర: ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది ఏం చేయాలో నేను చూసుకుంటా పిన్ని. నైట్ అందరూ డిన్నర్ చేస్తుంటే సహస్ర లక్ష్మీ మీద కోపంతో విహారికి వడ్డిస్తున్నప్పుడు విహారి మీద సాంబారు పడేలా చేస్తుంది. దాంతో లక్ష్మీ తన కొంగుతో తుడుస్తుంది. సహస్ర లక్ష్మీని లాగిపెట్టి కొడుతుంది.విహారి: సహస్ర అసలు నువ్వు లక్ష్మీని ఎందుకు కొట్టావ్.పద్మాక్షి: దానికి ఈ మధ్య కొవ్వు పెరిగింది విహారి.సహస్ర: అది నీ మీద సాంబారు పడేయటమే కాకుండా కొంగు తీసి ఏదో నీ పెళ్లాం అయినట్లు తుడుస్తుంది. ఏమనుకుంటున్నావే నువ్వు.
విహారి అందరి మీద సీరియస్ అవుతాడు. తనని ఎవరు కొట్టినా నేను ఊరుకోను అంటాడు. నీ మీద తనకు అంత చనువు ఏంటి అని పద్మాక్షి అడుగుతుంది. నువ్వు మీ అమ్మ ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో చూసుకోండి. సహస్ర నిన్ను ఇంతలా ప్రేమిస్తుంది కదా అసలు సహస్ర నిన్ను ప్రేమించడానికి కారణం కూడా నువ్వే.. ఆ రోజు నువ్వు నా ఇంటికి వచ్చి ప్రాధేయపడటంతో నేను మీ పెళ్లికి ఒప్పుకున్నాను.. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆలస్యం అయిన కొద్ది మాట మారిపోతుంది. సహస్ర విషయంలో నువ్వు ఇంకో నిర్ణయం చేస్తే నేను ఆ క్షణమే నేను వెళ్లిపోతా అప్పుడు మీరు ఇంకెప్పటికీ నా దగ్గరకు రాలేరు నేను రాను ఆ విషయం గుర్తించుకో అని చెప్తుంది. విహారి తినకుండా చేయి కడిగేసి వెళ్లిపోతాడు.
వసుధ లక్ష్మీకి డబ్బు ఇచ్చి మీ ఇంటికి వెళ్లిపో అమ్మ నీకు నీ పుట్టింటి వాళ్లు నిన్ను గాజు బొమ్మలా చూసుకుంటారు అని చెప్తుంది. దాంతో లక్ష్మీ నా కష్టం తెలిసిన తర్వాత మా నాన్న చనిపోతారని లక్ష్మీ చెప్తుంది. ఇదే నా ఇళ్లు నేను ఎన్ని కష్టాలు అయినా భరిస్తాను అని అంటుంది. రెండు కుటుంబాలని కూడా విడిపోనివ్వను అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!