Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ ఇంట్లో హోళీ వేడుకలు మొదలవుతాయి. మిధున వస్తేనే మొదలు పెడదాం అని సీతకి కాల్ చేస్తుంది. సీత తనలో తాను మహాలక్ష్మీ అత్తయ్య డబ్బు పిచ్చితో నేను మిధున అనుకొని నన్ను బాగా ఫాలో అవుతున్నావ్ నిజం తెలిసిన రోజు అయిపోతావ్ అనుకుంటుంది. ఇక రామ్ హోళీ వేడుకలు మొదలు పెడతారు. 

రామ్, గౌతమ్, మహాలక్ష్మీ, అర్చన, జనా, గిరి అందూ చాలా సంతోషంగా హోళీ ఆట ఆడుతారు. మిధునగా సీత కారులో మహాలక్ష్మీ ఇంటికి వస్తూ గతంలో తనని కిడ్నాప్ చేసిన రౌడీని రోడ్డు మీద ఓ షాప్ దగ్గర చూస్తుంది. ఆ నాగు అంతు చూడాలి అంటే సీత గెటప్‌లోనే  వెళ్లాలి అనుకొని కారులోనే చీర కట్టేసి నాగు దగ్గరకు వెళ్తుంది. దారిలో దొరికిన ఓ కర్ర పట్టుకొని నాగు దగ్గరకు వెళ్తుంది. నాగు అని పిలుస్తుంది నాగు షాక్ అయిపోతాడు. నేను ఎవరో గుర్తున్నానా అని అడుగుతుంది. నాగు బిత్తర చూపులు చూసి తెలీదు అంటాడు. నన్నే చంపాలి అని చూస్తావా అని నాగుని కొట్టి వెంటపడుతుంది. వెళ్తూ వెళ్తూ అక్కడే ఉన్న త్రిలోక్ దగ్గర సీత ఆగుతుంది. చీరలో ఉన్న సీతే కదా అనుకొని ఏమైందని అడుగుతాడు. దాంతో సీత తనని కిడ్నాప్ చేసిన నాగు కనిపించాడని అంటుంది. ఎక్కడున్నాడో చెప్పు అని త్రిలోక్ అడిగితే మీ లాంటి వాళ్లని నేను చచ్చినా నమ్మను అని పరుగులు తీస్తుంది. 

సీఐ త్రిలోక్ మహాలక్ష్మీకి విషయం చెప్పాలి అని కాల్ చేస్తే మహాలక్ష్మీ కాల్ లిఫ్ట్ చేయదు. రామ్ అంతు చూడాలని గౌతమ్ కాచుకు కూర్చొంటాడు. నాగు పరుగులు పెడుతూ మహాలక్ష్మీ వాళ్ల ఇంటి వైపే వస్తుంటాడు. రామ్‌ని పొడవడానికి గౌతమ్ ప్రయత్నిస్తే చలపతి అడ్డుగా వస్తాడు. రామ్ హోళీ ఆడుతూ ఆడుతూ సీత గుర్తొచ్చి ఆగిపోతాడు. నాగు పరుగులు పెడుతూ మహాలక్ష్మీ వాళ్లు హోళీ ఆడుతున్న దగ్గరకే వస్తాడు. సీత కూడా లోపలికి వస్తుంది. నాగు అందరిలో కలిసిపోయి డ్యాన్స్‌లు చేస్తుంటాడు. సీత నాగుని చూసి రాయి విసరడానికి రెడీ అవుతుంది. మరోవైపు గౌతమ్ కూడా రామ్‌ని పొడవడానికి రెడీ అవుతాడు. ఆ రాయి సరిగ్గా గౌతమ్ చేయి మీద పడి కత్తి కింద పడిపోతుంది. నాగు ఇంట్లోకి వెళ్లిపోతాడు. రామ్‌ ఆడుతూ ఉండగా చేయి తగిలి సీతకి రంగులు పూస్తాడు. తర్వాత చూసి అలా చూస్తూ ఉండిపోతాడు.

సీత ఇది కలా నిజమా అని అంటాడు. నిజమే మామ అని సీత అంటుంది. నువ్వు నిజంగా వచ్చావా అంటే అనుమానమా మామ అని సీత రంగులు పూస్తుంది. అందరూ సీతకి హోళీ శుభాకాంక్షలు చెప్తుంది. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అని అడుగుతారు. తాను నాగుని ఫాలో  అయి వచ్చానని పట్టుకోబోతే పారి పోయి ఇంట్లోకి వచ్చాడని చెప్తుంది. సీత ఈ వంకతో వచ్చిందని గౌతమ్ అంటే సీత అబద్ధం చెప్పదని రామ్ అంటాడు. అందరూ నాగుని వెతకాలని అనుకుంటారు. నాగు అది విని ఇంటి లోపలికి పారిపోతాడు. అందరూ తలో వైపు వెళ్లి వెతుకుతారు. నాగుని అర్చన చూస్తుంది. అర్చన నాగుని దొంగ చాటుగా పంపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!