Meghasandesam Serial Today Episode :  అపూర్వ మనుషులు భూమిని చంపబోతుంటే..గగన్‌ అడ్డుపడతాడు. రౌడీలను కొట్టి భూమిని కాపాడతాడు. ఇదే విషయం రౌడీలు అపూర్వకు ఫోన్‌ చేసి చెప్తారు. దీంతో అపూర్వ పిచ్చి పట్టిన దానిలా ఇరిటేటింగ్ గా ఎగురుతుంటే.. సుజాత వస్తుంది.

సుజాత: అమ్మాయి ఏదో కొత్త స్టెప్‌ నేర్చుకుంటున్నట్టు ఉన్నావు. ఈ వయసులో నీకు అవసరమా..?

అపూర్వ: పిన్ని...

సుజాత: అమ్మాయి ఆగు కోపంలో ఉన్నావా..? నీ మీద ఒట్టు అమ్మాయి. నాకు డాన్స్‌ లాగే అనిపించింది. ఇంతకీ ఎవరి మీద కోపం..

అపూర్వ: ఆ భూమిని చంపడానికి రౌడీలను పెట్టాము కదా..?

సుజాత: అవును కొంపదీసి వాళ్లు భూమిని చంపేసి పోలీసులకు దొరికిపోయి నీ పేరు చెప్పేశారా ఏంటి..?

అపూర్వ: లేదు దొరికిపోతే నీ పేరు చెప్పమన్నాను. చెప్పేశారట. ఇప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. నిన్ను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉండు.

సుజాత: ఇది అన్యాయం అమ్మాయి..

అపూర్వ: కదా అయితే నోరు మూసుకుని నేను చెప్పేది విను. భూమిని వాళ్లు చంపడానికి వెళ్లిన టైంలో ఆ గగన్‌ గాడు వచ్చి కాపాడేసిండట.

సుజాత: వాడు భూమిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడని చెప్పావు కదా అమ్మాయి.

అపూర్వ: పోయాడు. మళ్లీ వాడికి ఏం పోయే కాలం వచ్చిందో తిరిగి వచ్చి కాపాడేశాడు.

సుజాత: సరేలే అమ్మాయి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆ భూమిని చాలా మాటలు అన్నావు. అవన్నీ అది గుర్తు పెట్టుకుంటుంది.

అపూర్వ: ఏం మాట్లాడుతున్నావు పిన్ని..

సుజాత: రేపు కోర్టులో డీఎన్‌ఏ టెస్టులో ఆ భూమి ఇంటి వారసురాలు అని తేలింది అనుకో జరగబోయేది ఇదే కదా..?

అపూర్వ: పిచ్చి పిన్ని అసలు ఆ డీఎన్ఏ టెస్టులో అది మా బావ కూతురు అని తేలితే కదా..?

సుజాత: అదేంటి అమ్మాయి..నిజంగా భూమి అల్లుడి గారి కూతురే కదా..?

అపూర్వ: కూతురే కానీ ఆ డీఎన్‌ఏ టెస్ట్‌ నేను మార్చేస్తాను. రేపు అనేది లేకుండా చేస్తాను. కోర్టు దానికి జైలు శిక్ష వేస్తుంది. భూమి బయట ఉంది కాబట్టి ఆ గగన్‌ గాడు కాపాడుతున్నాడు. కానీ రేపు జైలులో దాన్ని ఎవరు కాపాడతారు.

సుజాత: అయినా నాకు ఒక డౌటు.. అల్లుడు ఆ భూమికి సొంత నాన్న కదా..? సొంత నాన్ననే భూమి ఎందుకు చంపాలనుకుంటుంది. అల్లుడిగారిని ఇంకెవరో చంపాలనుకుంటున్నారు అమ్మాయి.

అపూర్వ: సరే నీ డౌటు ప్రకారం ఇంకెవరో ఉంటే వాళ్లను కూడా నేను వదలను. ఆ భూమిని కూడా వదలను

అని అపూర్వ చెప్పగానే..సుజాత భయంగా చూస్తుంది. మరోవైపు భూమిని తీసుకుని కారు దగ్గరకు వెళ్తాడు గగన్‌.

గగన్‌: కారెక్కు..

భూమి: నేను ఎక్కను.. అయినా నన్ను ఎందుకు కాపాడారు సార్‌. నేను మీ శత్రువు శరత్‌ చంద్ర కూతురును కదా..? ఇక నేను ఎవరి కోసం బతకాలి. వదిలేసి ఉండాల్సింది. నా చావేదో నేను చచ్చేదాన్ని. ఏదేమైనా శత్రువు కూతురుని అని మర్చిపోయి కాపాడినందుకు చాలా థాంక్స్‌. వస్తాను.

గగన్‌: ఆగు ఎక్కడికి వెళ్తున్నావు..

భూమి: ఎక్కడికి అంటే ఏట్లోకి అని చెప్పనా..? ఎవరికీ లేనోడికి దేవుడే దిక్కు అంటారు కదా..? అందుకే ఆయన దగ్గరకే వెళ్తున్నాను.

గగన్‌: చూశావా వాడు ఈరోజు కాకపోతే రేపైనా చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు. నీకెప్పటికైనా డేంజర్‌ ఉంది.

భూమి: ఉంటే మీకేంటి సార్‌.

గగన్: నాకేంటి అని లాగకు.. నాతో రా..?

భూమి: ఎక్కడికి సార్‌..

గగన్: నువ్వే చెప్పావు కదా..? ఎవ్వరికీ లేని వారికి దేవుడే దిక్కు అని ఆ దేవుడే నన్ను పంపించాడు అనుకో.

భూమి: నేను రాను..

అంటూ భూమి వెళ్లిపోతుంటే.. గగన్‌ చేయి పట్టుకుని లాక్కుని వెళ్తాడు. కార్లో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్తాడు. తర్వాత చెర్రి, కృష్ణ ప్రసాద్‌లను కలిసిన భూమి తాను ఆ ఇంటి వారసురాలిని అని ఇష్టం లేని అపూర్వ డీఎన్‌ఏ రిపోర్ట్‌ మార్చడానికి ప్రయత్నిస్తుందని చెప్తుంది. అలా జరగకుండా మీరు అడ్డుకోవాలని చెప్తుంది. మరోవైపు రిపోర్ట్‌ ఇచ్చే డాక్టర్‌ ఇంటికి అపూర్వ మనుషులు వెళ్లి బెదిరిస్తారు. రిపోర్ట్స్‌ మార్చకపోతే డాక్టర్‌ పిల్లలను చంపేస్తామని బెదిరిస్తారు. దీంతో రిపోర్ట్స్‌ మార్చడానికి డాక్టర్‌ ఒప్పుకుంటాడు. ఇక భూమి జైలుకు వెళ్లితే జైళ్లోనే భూమిని చంపేందుకు అపూర్వ ప్లాన్‌ చేస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!