Brahmamudi Serial Today Episode: యామినిని పెళ్లి చేసుకోమని వాళ్ల డాడీ రాజ్‌ను అడుగుతాడు. నీ పెళ్లి చూసే అదృష్టం ఎలాగూ మీ అమ్మానాన్నకు లేకుండా పోయింది. కనీసం ఆ అదృష్టం నాకైన ఉండేలా చూడమని ప్రాధేయపడతాడు.  

Continues below advertisement

వైదేహి: ఎందుకండి అల్లుడి గారిని అంతలా బతిమాలుతున్నారు. యామినిని పెళ్లి చేసుకోవాలని తనకి మాత్రం లేదా ఏంటి..? చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారని ఎన్నిసార్లు అనుకోలేదు మనం.

యామిని: డాడ్‌ మీరు ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి.. మేమిద్దరం మీ కోరిక నెరవేరుస్తాము. ఏంటి బావా డాడీ కన్నా మనకు ఏం ఎక్కువ చెప్పు. డాడ్‌ మీరు కోరడం బావ కాదనడం ఉంటుందా…? మీరు ఎప్పుడంటే అప్పుడు బావ నా మెడలో తాళి కడతాడు

Continues below advertisement

యామిని ఫాథర్‌: లేదమ్మా.. మీ పెళ్లి చాలా గ్రాండ్‌గా చేయాలి. అదే నా కోరిక.. రామ్‌ వీలైనంత త్వరగా నా కూతురుని పెళ్లి చేసుకుంటానని నాకు మాటివ్వు..

అంటూ అడగ్గానే.. రాజ్‌ ఆలోచిస్తుంటాడు. మరోవైపు అప్పుతో కలిసి కావ్య హాస్పిటల్‌కు వస్తుంది. ఇద్దరూ కలిసి డాక్టర్‌ చాంబర్‌లోకి వెళ్తారు. అప్పటికే ఆ డాక్టర్‌ నర్సుతో రొమాన్స్‌ లో ఉంటాడు. కావ్య వాళ్లను చూసి తిడతాడు. పర్మిషన్‌ లేకుండా ఎందుకు వచ్చారంటూ సెక్యూరిటీకి ఫోన్‌ చేయబోతుంటే అప్పు ఆపుతుంది.

కావ్య:  మీరు రాజ్‌ అనే పేషెంట్‌కు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు కదా..?

డాక్టర్‌:  రాజ్‌ ఎవరు..?

 కావ్య:  యామిని వాళ్ల  బావ అని చెప్పుకునే రామ్‌కు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు..

డాక్టర్‌: యామిని ఎవరు..? రామ్‌ ఎవరు..?

అప్పు: చూడండి డాక్టర్‌ మీరు మర్యాదగా నిజం చెప్పండి లేకపోతే.. మీ బాగోతం మొత్తం విత్‌ ఆడియో సహా మీ భార్యకు వెళ్తుంది.

డాక్టర్‌: మేడం నా బాగోతాన్ని బయట పెట్టి నా జీవితాన్ని నాశనం చేయకండి ఫ్లీజ్‌..

అంటూ డాక్టర్‌ రాజ్‌ విషయంలో జరిగిన విషయాలు మొత్తం చెప్తాడు. డాక్టర్‌ మాటలు విన్న తర్వాత కావ్య ఏడుస్తూ నా నమ్మకమే నిజం అయింది అనుకుంటూ బయటకు వెళ్లిపోతుంది.  మరోవైపు ఏంటి ఆలోచిస్తున్నావు అంటూ రాజ్‌ను  ప్రశ్నిస్తాడు యామిని పాథర్‌.

రాజ్‌: అదేం లేదు అంకుల్‌ మీ ఇష్ట ప్రకారం యామినిని పెళ్లి చేసుకుంటాను.

నర్స్‌: సార్‌ మిమ్మల్ని డాక్టర్‌ పిలుస్తున్నారు.

రాజ్‌ బయటకు వెళ్తాడు.

యామిని: వాట్‌ ఏ పర్మామెన్స్‌ డాడ్‌.. రాజ్‌ అయితే ఫుల్లుగా నమ్మేశాడు. అసలు డౌటే రాలేదు.

వైదేహి: అవును బేబీ మీ డాడీ పర్మామెన్స్‌ చూసి నేనే షాక్‌ అయ్యాను.

యామిని:  డాడ్‌ మీ డెడికేషన్‌కు పర్మామెన్స్‌కు థాంక్యూ డాడ్‌..

వైదేహి: ఏంటండి రామ్‌ పెళ్లికి ఒప్పుకున్నాక కూడా మీ ముఖం ఇంకా వాడిపోయే ఉంది. నిజంగానే మీకు హార్ట్‌ స్ర్టోక్‌ వచ్చిందనుకుంటున్నారా ఏంటి..? మీరు జస్ట్‌ యాక్ట్‌ చేస్తున్నారు అంతే.

యామిని పాథర్‌: యామిని ఆనందం కోసం ఒక జీవితంతో ఆడుకుంటున్నాము అనిపిస్తుంది. అమ్మా యామిని నువ్వు అడిగావని.. నీ మాట కాదనలేక.. నువ్వు ఏమైపోతావో అన్న భయంతో రామ్‌ను మోసం చేసి ఇలా నటించాను. కానీ ఇది కరెక్టు కాదేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు

యామిని:  డాడ్‌ తను ఒప్పుకున్నాడు కదా..? ఇప్పుడు సెలబ్రేట్‌ చేసుకోవాలి కానీ మీరు..

పాథర్‌: కాదమ్మా.. ఇలా మోసం చేసి పెళ్లి చేసినా కూడా రేపు నీతో ఉండాల్సింది రామ్‌. తనకు పొరపాటున ఇదంతా నాటకం అని తెలిసినా ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సింది నువ్వే అదే నా భయం.

యామిని:  డాడ్‌ మీరేం భయపడకండి రామ్‌తో పెళ్లి అయితే చాలు మిగతాది నేను చూసుకుంటాను.

అంటూ హ్యాపీగా ఫీలవుతుంటే.. మరోవైపు కావ్య దేవుడి ముందు నిలబడి మొక్కుతుంది. ఆ పక్కనే రాజ్‌ వచ్చి నిలబడతాడు. ఇంతలో కావ్య దగ్గరకు అప్పు రాగానే.. అప్పుకు రాజ్‌ను చూపిస్తుంది కావ్య. రాజ్‌ను చూసిన అప్పు షాకింగ్‌ గా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో యామిని వచ్చి రాజ్‌ను హగ్‌ చేసుకుని బావ ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకుంటావని అనుకోలేదు అంటుంది. యామిని మాటలు విన్న అప్పు, కావ్య షాక్‌ అవుతారు. బావకు పెళ్లేంటి అక్కా అని అప్పు అడుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!