Krishna Mukunda Murari Serial November 14th Episode : రేవతి: రా నందిని.. ఏదైనా విశేషమా..
నందిని: నా విశేషం గురించి తర్వాత పిన్ని ముందు నీకో విషయం అడగాలి నిజం చెప్తావా. కృష్ణ గురించి కృష్ణ మురారిల యాక్సిడెంట్ గురించి అమ్మ చెప్పింది కదా అది నిజమేనా..కృష్ణ అంత పని ఎందుకు చేస్తుంది అనిపిస్తోంది నాకు. ఇదంతా కృష్ణ మీద మనకు ఉన్న ప్రేమ అలా అనిపించేలా చేస్తుంది పిన్ని.
రేవతి: ఏమో నందిని అక్క చూసింది మాత్రమే చెప్పింది. అక్కతో పాటు నేను ఉన్నాను. విన్నాను కూడా. కొన్ని సార్లు కళ్లతో చూసిన నిజాలు కూడా నిజాలు కావు అంటారు కదా ఇది కూడా అలాంటిదే. మురారి గతం మర్చిపోయినా కృష్ణను మర్చిపోలేదని నాకు అనిపిస్తోంది. అవును నందిని హాస్పిటల్ నుంచి మురారిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను అమ్మను అని, అక్క పెద్దమ్మ అని ఇలా అందరం పరిచయం చేసుకున్నప్పుడు పిలవడం స్టార్ట్ చేశాడు. కానీ మేము అసలు కృష్ణను పరిచయమే చేయలేదు. కృష్ణ చెప్పింది మురారి హాస్పటల్‌లో తనను ఫాలో అయ్యేవాడని. అవును నందిని మేము డాక్టర్‌గా పరిచయం చేశాం కానీ వాడు కృష్ణను డాక్టర్‌గా చూడటం లేదు. ఓ పరిచయస్తురాలిగా, ఓ మంచి ఫ్రెండ్‌గా చూస్తున్నాడు. అంటే కృష్ణ వాడి గుండెల్లో ఎంతగా నాటుకుందో ఆలోచించు. ఇది నీకు న్యాయం అనిపిస్తే చిన్న పిల్లవైనా సరే నిన్ను వేడుకుంటా వాళ్లని కలిపే ప్రయత్నం చేయ్.
నందిని: అయ్యో పిన్ని అవేం మాటలు.. నేను తప్పకుండా చేస్తాను. నేను శకుంతల అత్తయ్యతో మాట్లాడుతాను డిటైల్స్ కనుక్కొంటా.
మరోవైపు షాపింగ్ మాల్‌లో ముకుంద పెద్ద అత్తయ్యతో ఫోన్‌లో మాట్లాడుతుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది.
కృష్ణ: బాగా డిస్టర్బ్ అయినట్లు ఉన్నావ్ కదా. పాపం నేను రాను అనుకున్నావ్ కదా. గతం మర్చిపోయిన నా భర్తను వర్తమానంలో ప్రేమించేసి..
ముకుంద: ఆపుతావా. కొన్నాళ్లు.. ఒక సంవత్సరం పాటు భార్యగా నటించిన గతం నీది. కానీ నా గతంలో మురారి నేను ప్రేమికులం. నీ గతం ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చివరికి ఒక్క సంవత్సరం భార్యగా ఉండి వెళ్లిపోయావ్. ఇది నీ గతం. సిగ్గుగా అనిపించడం లేదా.
కృష్ణ: లేదు. నీగతం మురారితో ముడి పడి ఉంటే కొంత అయినా ప్రేమ ఉండేది. కానీ నీ గతం ఆదర్స్‌తో ముడిపడి ఉంది. మూడు ముళ్లు కూడా పడ్డాయి. ఆ మూడు ముళ్లు వేసిన వాడిని వదిలేసి నాకు మూడు ముళ్లు వేసిన వాడితో జీవితం పంచుకోవాలని తాపత్రయం పడే వర్తమానం నీది. అందుకే ముకుంద ఆదర్స్ కూడా ఎంక్వైరీ చేస్తుంది.
ముకుంద: చెయ్యు కృష్ణ. కొంచెం కూడా ఉపయోగం ఉండదు. పైగా పెద్దత్తయ్య నిన్ను పాతర వేస్తుంది. కొడుక్కి ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఈ విషయం మా అత్తయ్యకు క్లారిటీ ఉంది. ఇక నువ్వు ఏం చేయలేవు. అందర్ని బాధ పెట్టడం తప్ప వేరే ఉపయోగం లేదు. సో మురారితోనే నా బంధం. నువ్వు మురారికి ఎన్ని బాణాలు వేసినా నేను వేసే ఒకే ఒక్క బాణంతో నావైపునకు వచ్చేస్తాడు. నా టాలెంట్ ఏంటో నువ్వు గుర్తించడం లేదు. మురారి కోసం నేను ఎంతకు తెగిస్తానో కూడా నాకు తెలీదు. ఇన్నాళ్లు నువ్వు ముకుందను ఒకవైపే చూశావు.
కృష్ణ: రెచ్చిపోకు ముకుంద. బట్ వన్ థింగ్ మమ్మల్ని విడదీయాలని చూస్తే కుమిలిపోతూ ఓ మూలన కూర్చొంటావు. నా దారికి అడ్డువస్తే ఎవరు ఏంటీ అని కూడాచూడను. అది ఎంత పెద్దవాళ్లు అయినా సరే.
ఇంతలో మురారి వచ్చి వెళ్దాం అని అంటాడు. మరోవైపు కృష్ణ వాళ్ల పిన్ని శకుంతల దగ్గరకు నందిని వస్తుంది. ఇక నందిని ఆ ఇళ్లు చూసి ఇలాంటి ఇంట్లో కృష్ణ ఉండడం ఏంటో అని మనసులో అనుకుంటుంది. మెళ్లగా మాటల్లో పెట్టి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. తాము ఏం తప్పు చేయలేదని కృష్ణని హాస్పిటల్‌లో చేర్పించాం అంటుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది. మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. అయితే నందిని కృష్ణను హగ్ చేసుకుంటుంది. కృష్ణ ఎమోషనల్ అవుతుంది. కృష్ణ నందు సరదాగా గడుపుతారు. షాపింగ్ విషయాలు చెప్తుంది.
మరోవైపు నందు, గౌతమ్, మధు మాట్లాడుకుంటారు. ఇంతలో నందు వాళ్ల అమ్మ భవాని అక్కడికి వస్తుంది. రేవతిని పిలుస్తుంది.
భవాని: ఇప్పుడు నేను అడిగే దానికి అబద్ధం కాకుండా నిజం మాత్రమే చోప్పు. ముకుంద, మురారి షాపింగ్‌కు వెళ్తున్నారని ఆ కృష్ణకు ఎవరు చెప్పారు. అడిగేది నిన్నే రేవతి.
రేవతి: నేను చెప్పలేదు అక్క. ఒకవేళ చెప్తే ఇదే జరుగుతుందని నాకు తెలుసు అందుకే నేను చెప్పలేదు అక్క.
భవాని: కృష్ణ అక్కడ షాపింగ్‌కు వెళ్లి తెగ హడావుడి చేస్తుందట. చూశావా నందిని ఇది వరస. అసలు వీళ్లకి ఎంత చెప్పినా ఆ క్రిమినల్స్‌కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలీదు. ఎందుకు వాళ్లకు అన్నీ చెప్తున్నారు. ఇంతకు ముందు ఇలానే చాలా సార్లు జరిగింది. అసలు ఈ ఇంట్లో నా మాటకు విలువ ఇవ్వడమే అందరూ మర్చిపోయారు. లేదు రేవతి బాగా అర్ధం చేసుకునే మాట్లాడుతున్నాను.
ఇంతలో మురారి వాళ్లు వస్తారు. మురారి షాపింగ్ బాగా జరిగిందా అని భవాని అడుగుతుంది. ఇక మురారి నందిని అని పిలవగానే నందిని ఎమోషనల్ అయి అన్నను హగ్ చేసుకుంటుంది. నందిని వాళ్ల కోసం బట్టలు కొనలేదు అని మురారి అంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడతా అని భవాని అంటుంది. ఇక దీపావళి పూజకు కృష్ణను కూడా పిలిచానని మురారి చెప్తాడు.
మరోవైపు కృష్ణకు వాళ్ల చిన్నమ్మ గోరుముద్దలు తినిపిస్తుంది. ఇక మురారి అక్కడికి వచ్చి కృష్ణను బయటకు పిలుస్తాడు. వాళ్లని ముకుంద ఫాలో అవుతుంది. మురారి కృష్ణ కోసం రింగ్ గిఫ్ట్‌గా తెస్తాడు. నీ కోసమే తీసుకున్నా అని కృష్ణ చేతికి రింగ్ తొడుగుతాడు. కృష్ణ ఎమోషనల్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.