Krishna Mukunda Murari Today Episode కృష్ణ ఆరుబయట తులసి కోటకు పూజ చేస్తుంది. ముకుంద చాలా దారుణాలు చేస్తుందని తన బిడ్డని తన బిడ్డ అంటుంది. అయితే ముకుంద మెడ వంచి నిజం చెప్పించగలను కానీ తన భర్త మురారి ఎక్కడున్నాడో తెలిస్తే అవన్నీ ఈజీగా సాధించేస్తాను అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. 


మరోవైపు భవాని ఇంతకు ముందు ముకుంద ఉన్న స్ల్మమ్ ఏరియాకు వస్తుంది. అక్కడ మురారి చేతికి తలకి గాయాలతో స్ఫృహ లేకుండా పడుకొని ఉంటాడు. అటుగా భవాని వస్తుంది కానీ మురారిని చూడదు. మీరా కోసం వచ్చాను అంటే అక్కడున్న ఒకావిడ భవానితో అబద్ధం చెప్తుంది.  మీరా ముందే ఇలా చెప్పమని చెప్తుంది. కావాలి అనే మీరాని ఆవిడ భవాని ఎదురుగా పొగుడుతుంది. ఇంతలో మీరా సంతోషంగా అక్కడికి వస్తుంటుంది. 


ముకుంద: మురారి కనిపించడం లేదు అని అందరూ తెగ టెన్షన్ పడుతున్నారు. నిజంగానే మురారి నాకు కడుపు చేసి ముఖం చూపించలేక పారిపోయాడు అనుకుంటున్నారు. యాక్సిడెంట్ అయి నా దగ్గరే ఉన్నాడు అని ఎవరికీ తెలీదు. మురారి కోలుకున్న తర్వాత దూరంగా తీసుకెళ్లిపోతాను. ఇక ఎప్పటికీ మురారి ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. ఇది భవాని అత్తయ్య కారు కదా ఇక్కడ ఉంది ఏంటి. మురారి ఇక్కడ ఉన్నాడు అని తెలిసిపోయిందా ఏంటి. మురారిని ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్లిపోవాలి.


కృష్ణ, మధు ఇంట్లో టెన్షన్‌గా తిరుగుతూ ఉంటారు. సరోగసీ చేశామని అంటుంది. మధు మీరా తెలివిగా ప్లాన్ చేసిందని అనుకుంటారు. డాక్టర్ మీరాతో కలిసి మోసం చేసిందని అసలు మురారి ఉండి ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు అని అనుకుంటారు. మురారి తప్పు చేసినా ఒప్పుకుంటారని తప్పించుకు తిరగరని కృష్ణ అంటుంది. కృష్ణ ముకుంద తండ్రిని కలవాలి అని అనుకుంటుంది. 


ముకుంద మురారికి ఆపిల్ ముక్కలు తినిపిస్తుంది. మురారి తినకుండా ఊసేస్తాడు. మురారి ఎంగిలి మీరా తింటుంది. ఇంకా ఎంత కాలం ఇలా నన్ను హింసిస్తావ్ అని మురారి అడుగుతాడు. మురారి నడవలేని స్థితిలో ఉంటాడు. మురారికి కూడా ముకుంద అని తెలుస్తుంది. ముకుంద మురారితో నీ మనసు చంపుకో లేదంటే కృష్ణనే చంపుతాను అని అంటుంది. మురారి కోపంతో రగిలిపోతాడు. కృష్ణని మర్చిపోవడం కలలో కూడా జరగదు అని మురారి అంటాడు. విధి మనల్ని కలపాలి అని చూస్తుంది కాబట్టి నీకు యాక్సిడెంట్ అయి నా దగ్గరకు వచ్చావని అంటుంది. ఇక మురారి నేను నీ దగ్గర ఉన్నాను అంటే నువ్వే యాక్సిడెంట్ చేసి ఉంటావని అంటాడు. ఇక తనని అర్థం చేసుకోవడం లేదని నువ్వే నా ప్రాణం అని అంటుంది. ఇదే లాస్ట్ ఛాన్స్ అని దీన్ని వదులుకోను అని కృష్ణని ఆ గతాన్ని మర్చిపోతున్నావ్ అని  అంటుంది. కృష్ణకి నిజం తెలిస్తే సరోగసీ జరిగలేదు అని అది నాకు ముకుందకు పుట్టిన బిడ్డ అని చెప్పమని అంటుంది. ఇలా చెప్తే మనం కలిసే ఉండొచ్చని అంటుంది. తాను చెప్పినట్లు చేయకపోతే తన కడుపులో బిడ్డ ఉండదని వార్నింగ్ ఇస్తుంది. 


మరోవైపు భవాని ఇంట్లో తల పట్టుకొని కూర్చొంటుంది. రేవతి, శకుంతల వచ్చి ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. మీరా గురించి ఎంక్వైరీ చేశాను అని అందరూ మీరా మంచిదే అంటున్నారు అని అంటుంది. మధు మీరా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని అలా చేస్తే కృష్ణ మురారిని అనుమానించినట్లు అవుతుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నాగ పంచమి' సీరియల్: కన్నీరు పెట్టించే సీన్.. వైశాలి నన్ను వదిలి వెళ్లిపోతావా? గుండె పగిలేలా ఏడ్చిన మోక్ష!