Krishna Mukunda Murari Today Episode: శకుంతల భోగి మంటలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. భవాని కూడా వచ్చేస్తుంది. ఇక ముకుంద మాత్రం వాళ్ల దగ్గరకు రాకుండా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. భోగి మంట వెలిగించమని అందరూ భవానికి చెప్తారు. అప్పుడే ముకుందని కృష్ణ చూస్తుంది. తనని కూడా పిలుద్దామని భవానికి రిక్వెస్ట్ చేస్తుంది. ఇక కృష్ణ వెళ్లి ముకుందని తీసుకొస్తుంది.
భవాని: మా అమ్మ తెగ హడావుడి చేసేది. మా నాన్నకి ఇవేం ఇష్టం ఉండేవి కాదు అస్తమానం క్రమశిక్షణ అంటూ ఉండేవారు.
కృష్ణ: హో అంటే మీది అచ్చం మీ నాన్న పోలిక అన్నమాట.
భవాని: అఫ్ కోర్స్ నువ్వు అన్నది కరెక్ట్ ఏలే.
భవాని భోగిమంట వెలిగిస్తే అందరూ చూట్టూ తిరిగి కోలాటం ఆడుతారు. ఇక మధు పాటలు పెడతాను అని భవానిని అడితితే భవాని పర్మిషన్ ఇస్తుంది. భవాని లోపలికి వెళ్లిపోతాను అంటే ఫస్ట్ పాటకు కృష్ణ, మురారి డ్యాన్స్ వేస్తారు చూడమని అందరూ రిక్వెస్ట్ చేస్తారు. ఇక కృష్ణ, మురారిలు మాస్టారూ మాస్టారూ పాటకు డ్యాన్స్ చేస్తారు. తర్వాత నందూ, గౌతమ్ డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత శకుంతల తీన్ మార్ డ్యాన్స్ అదరగడుతుంది. అందరూ స్టెప్పులేస్తారు. ఇక ఉదయం కృష్ణ భవాని ఇంటి ఎదురుగా ముగ్గు వేస్తుంది. మురారి అక్కడికి వస్తే కృష్ణ గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఇక మురారి కృష్ణని పొగిడేపనిలో పడతాడ.
మధు: పెద్దమ్మ ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ అందం ఈ చీరతోనో పండగ వల్లో వచ్చింది కాదు పెద్దమ్మ నీ కొడుకు కోడలు కలిసి పోవడం వల్ల ఇక నీకు ఏ టెన్షన్ లేకపోవడం వల్ల వచ్చింది. ప్రతీ రోజూ నువ్వు ఇలాగే ఉండాలి పెద్దమ్మ. నిజం పెద్దమ్మ నేను నీ దగ్గరే పెరిగిను. నేను అంటే నేనే కాదు ఇక్కడున్న మేమంతా నిన్నే అమ్మా అనుకునే వాళ్లం.
కృష్ణ: అవును అత్తయ్య.. అత్తయ్యవి అయినా సరే నువ్వు నాకు అమ్మవే.
మురారి: హలో అందరూ మా అమ్మని పట్టుకొని అమ్మా అంటారు ఏంటి. నాకు మాత్రమే అమ్మ.
నందూ: అంతలేదులే మురారి.
గౌతమ్: అరే నీకు ఎందుకు అంత జలసీ నందూ.
ప్రసాద్: (భవానితో కలిసి సుమలత రావడంతో) ఏంటి మా వదినను కాకా పడుగున్నావా.. వదిన గదిలోంచి వస్తున్నావ్.
భవాని: ఏం ప్రసాద్ నాతో రాకూడదా..
ప్రసాద్: అది కాదు వదిన ఏవో సోది కబుర్లు చెప్పి విసిగిస్తుంది ఏమో అని.
సుమలత: అక్కా నేను మీకు బోర్ కొట్టించానా.. నోటికి ఎంతోస్తే అంత మాట్లాడకండి.
మధు: అమ్మ ఏదో పండగ పూట అని నోరుజారారులే. వదిలేయోచ్చు కదా. మిగతా రోజుల్లో ఎలానూ నోరు జారనివ్వువు కదా.
సుమలత: నువ్వు నోరు ముయ్యురా. నేను అక్క రూమ్‌లోకి ఎందుకు వెళ్లానో తెలుసా.. అక్క చీర సూపర్‌గా కట్టుకుంది కదా నేను కూడా అలా కట్టుకుందామని వెళ్లా..
ప్రసాద్: ఎంత మీలా చీర కట్టుకున్నా మీ అంత హుందాతనం వస్తుందా చెప్పండి వదిన.
మధు: అది మాత్రం అక్షరాల నిజం.
ఇక భవాని కింద కూర్చొని అరిటాకులో భోజనం చేద్దామని చెప్తే మధు, మురారి అరిటాకులు తీసుకురావడానికి వెళ్తామంటారు. గౌతమ్ కూడా వస్తా అంటే అల్లుడు పండగ పూట ఏం చేయకూడదు అని అందరూ అంటారు. దీంతో తమని అతిథుల్లా చూస్తున్నారని నందూ ఏడుస్తుంది. ఇక అందరూ ఆమెను ఓదార్చుతారు. ఇక అందరికీ భవాని వడ్డిస్తుంది.
మధు: బ్రో పెద్ద పెద్దమ్మ కింద కూర్చొకుండా వడ్డిస్తాను అని భలే ఎస్కేప్ అయింది కదా..
మురారి: రేయ్ వినిపిస్తుంది రా.
భవాని: ఏం వినిపిస్తుంది మురారి.
మురారి: ఏం లేదు పెద్దమ్మ.. కృష్ణ ఏం లేదు కదా..
కృష్ణ: నాకు ఏం వినిపించలేదు.
భవాని: లేదు మీరిద్దరూ నా మీద ఏదో సెటైర్ వేసుకున్నారు.
కృష్ణ: వాళ్ల మొఖం పెద్దత్తయ్య వాళ్లకు అంత సీన్ ఎక్కడ ఉంది.
రేవతి: వీళ్ల ముఖం వీళ్లకు అంత లేదు. వీళ్లకు అంత ధైర్యం ఎక్కడుంటుంది.
మురారి: హలో మేడమ్ మాకు ఉన్నదే టన్నుల టన్నుల కొద్ది ధైర్యం.
ముకుంద: అహా మరి అంత ధైర్యం ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా చెప్పు.
మధు: చెప్తాం ఎందుకు చెప్పం. మురారి నువ్వు చెప్పు.
మురారి: స్టార్ట్ చేసింది నువ్వే కదా నువ్వే చెప్పు. పెద్దమ్మ మీరు కింద కూర్చోకుండా ఉండటానికి వడ్డిస్తాను అని షాకు చెప్పి భలే ఎస్కేప్ అయ్యారు అని అంటున్నాడు.
మధు: పెద్దమ్మ ఏదో పండగ కదా.. క్షమించి వదిలేయరా ప్లీజ్.
భవాని: కృష్ణ నువ్వు లే.. లే నువ్వు వడ్డించు. కింద కూర్చొని ఏంట్రా నేను కింద కూర్చోలేనా నాతో పాటు మీరు సూర్యనమస్కారాలు చేయండి చూద్దాం. ఇక కృష్ణ అందరికి వడ్డిస్తుంది. అందరూ హ్యాపీగా తింటారు. ఇక వంటలు అన్నీ సూపర్ అని కృష్ణే చేసింది అని అందరూ మెచ్చుకుంటారు. అయితే ఆ వంటలు అన్నీ ముకుంద చేసింది అని కృష్ణ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.