Gruhalakshmi Serial Today Episode: రాజ్యలక్ష్మీ వరండాలో అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచిస్తుంది.  ఇంతలో బసవయ్య వచ్చి ఏంటి అక్కాయ్‌ అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావు. ఏదైనా షాకింగ్‌ న్యూసా? అవును కానీ నాకు కాదు తులసికి అని రాజ్యలక్ష్మీ చెప్పగానే అంతే మరి మా అక్కయ్‌ తో పెట్టుకుంటే ఫ్లగ్‌లో వేలు పెట్టినట్లే షాక్‌ కొట్టపోతే అదృష్టం వచ్చి చుట్టుకుంటుందా ఏంటి? ఇంతకీ విషయం ఏంటి అక్కాయ్‌ అని అడగ్గానే


రాజ్యలక్ష్మీ: తులసి, చందన ఇంటికి వెళ్లిందంట


బసవయ్య: చావు వార్త చల్లగా చెప్పినట్లు అంత ప్రశాంతంగా చెప్తావేంటి? అక్కాయ్‌. కాళ్లు వణకట్లా?  


రాజ్యలక్ష్మీ: ఊహించని సంఘటన అయితే కాళ్లు వణుకుతాయి. తులసి స్టామినా నాకు తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇప్పుడు షాక్‌ అవ్వాల్సింది తులసే.


అనగానే బసవయ్య ఇంతకీ ఏం చేశావు అక్కయ్యా అంటూ అడగ్గానే చందన ఫోటోకు దండ వేయించాను. ఇప్పుడు దివ్యను జైల్ల వేయిస్తే విక్రమ్‌కు దివ్య దూరం అవుతుంది. మన పని మరింత సులువవుతుంది. అని ఎస్సైకి ఫోన్‌ చేసి యాక్సిడెంట్‌ అయిన అమ్మాయి దొరికిందని విక్రమ్‌కు ఫోన్‌ చేసి చెప్పు అని మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని రాజ్యలక్ష్మీ అనగానే... సరే మేడం అంటాడు ఎస్సై.


మరోవైపు చందన కోసం వెతుకుతున్న తులసి, నంద, రాములమ్మ కారులో వెళ్తుంటారు. ఇప్పుడేం చేద్దాం అని నంద అడుగుతాడు. నాకు అదే అర్థం కావడం లేదని తులసి చెప్పడంతో.. అర్థం కాకపోవడానికి ఏముంది ఒక ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయినట్టేగా యాక్సిడెంట్‌ భ్రమ కాదు అని క్లారిటీ వచ్చిందిగా దివ్య ఎలాంటి భ్రమలోను లేదు. పోలీసులు చెప్పింది అంతా అబద్దం అనేగా అంటాడు నంద.


ఈ విషయం దివ్యకు చెబితే చాలా రిలీఫ్‌గా ఫీలవుతుంది అంటాడు.  వెంటనే తులసి అవును కానీ దివ్య నిజంగానే యాక్సిడెంట్‌ చేసినట్లు అవుతుంది. అప్పుడు పోలీసులు దివ్యను అరెస్ట్‌ చేస్తారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది. మరోవైపు విక్రమ్‌, దివ్  హ్యాపీగా గార్డెన్‌లో కూర్చుని ఉంటారు. జరిగిన విషయాల గురించి, జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకుంటుంటారు.


త్వరలో ఈ కష్టాలకు పులిస్టాప్‌ పడుతుందని విక్రమ్‌ అంటాడు. ఇంతలో బసవయ్య, సంజయ్‌ ఏవో ఫైల్స్‌ తీసుకుని వస్తారు. వారిని చూసిన విక్రమ్‌ కోపంగా రాజ్యలక్ష్మీని పిలుస్తాడు. తనను వీళ్లు ఇరిటేట్‌ చేస్తున్నారు. అంటాడు రాజ్యలక్ష్మీ వాళ్లను తిట్టినట్లు నటిస్తుంది. వాళ్లేమో బిజినెస్‌ ల కోసం ఇలా చేయాల్సి వస్తుందంటారు. ఏ నిర్ణయమైనా మీరే తీసుకోండని చెప్తాడు. ఇంతలో ఎస్పై ఫోన్‌ చేసి చందన గురించి వివరాలు తెలిశాయని.. వెంటనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానని చెప్పడంతో విక్రమ్‌, దివ్య హ్యాపీగా ఫీలవుతారు.


విక్రమ్, సంజయ్‌, బసవయ్య హ్యపీగా ఫీలయినట్లు నటిస్తారు. మరోవైపు తులసి, నంద, రాములమ్మ తిరిగి చందన ఇంటికెళ్లి వాళ్ల అమ్మానాన్నలకు డబ్బులిచ్చి తమ తప్పుకు ఇది పెనాల్టీ కట్టడమని తులసి చెప్తుంది. డబ్బులు ఇస్తున్న టైంలో చందన ఫోటో చూసిన తులసి ఫోటో మీద తులసి చనిపోయిన డేట్‌ తప్పుగా ఉందని కనిపెడుతుంది. దీంతో చందన చనిపోయినట్లు నాటకం ఆడుతున్నారని తులసికి క్లారిటీ వస్తుంది. ఇక చందనను పట్టుకోవడానికి ప్లాన్‌ వేస్తుంది తులసి. మరోవైపు దివ్య, విక్రమ్ మాట్లాడుకుంటుంటారు.


దివ్య: నాదొక డౌట్‌ విక్రమ్‌. అసలు జనాభా లెక్కల్లో లేని ఒక మనిషి ఫోటో పట్టుకొచ్చి వెతకమంటారేంటి? అంటూ ఆ ఎస్సై మనల్ని ఎగతాళి చేశాడు కదా


విక్రమ్‌: అందుకు సారీ చెప్పాడు కదా?


దివ్య: సారీ చెప్పడం సరే.. వెంటబడి బతిమాలితే కానీ పోలీసులతో పని కాదు. అలాంటిది ఇలా పనిగట్టుకుని, గుర్తు పెట్టుకుని ఆ యాక్సిడెంట్‌ అమ్మాయిని వెతికి పట్టుకోవడం ఏంటి?


విక్రమ్‌: ఇదే మీ ఆడాళ్లతో వచ్చిన చిక్కు. పని చేయకపోయినా అనుమానిస్తారు. పని చేసినా అనుమానిస్తారు.


అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే.. దూరం నుంచి వాళ్లను గమనిస్తున్న రాజ్యలక్ష్మీ, సంజయ్‌, బసవయ్య తిట్టుకుంటారు. విక్రమ్‌ గాన్ని చంపేయాలనుంది అంటుంది రాజ్యలక్ష్మీ. మరోవైపు లాస్య కోటలో పాగా వేశానని భాగ్యతో ఫోన్‌లో మాట్లాడటాన్ని అనసూయ వింటుంది.. కోపంతో లాస్యను కొట్టబోతుంటే మీరంతా కలిసి నన్ను మోసం చేయడం తప్పు కాదా? అంటుంది లాస్య. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: గుంటూరు కారం రివ్యూ: సినిమాకు విపరీతమైన నెగిటివ్ టాక్... మహేష్ మాస్ రోల్, ఎనర్జీ సూపరైనా తేడా ఎక్కడ కొట్టిందంటే?