Krishna Mukunda Murari September 1st: కృష్ణ మురారీకి ఇంజెక్షన్ చేయడం కోసం తన వెనుక పరుగులు పెడుతుంది. ఇద్దరూ కాసేపు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. మురారీ తనకి ఇంజెక్షన్ అంటే భయమని కృష్ణకి దొరక్కుండా పారిపోతూ ఉంటాడు. అలా అలా కృష్ణ జారిపడిపోతుంటే మురారీ తనని పట్టుకుంటాడు. కాసేపు కళ్ళు కళ్ళూ కలుస్తాయి. ఇలా నా కళ్ళలోకి చూసి అయినా నా ప్రేమని అర్థం చేసుకోమనీ కృష్ణ మనసులో అనుకుంటుంది. అలా మురారీ తన కళ్ళలోకి చూస్తూ ఉండగానే ఇంజెక్షన్ చేసేస్తుంది. ఇన్నాళ్ళూ మీ మనసులో నాకు చోటు లేదని అనుకున్నా కానీ మీకు నేనంటే ప్రాణమని తెలిసిన తర్వాత మిమ్మల్ని వదిలి ఎలా ఉంటానని అనుకుంటుంది. గదిలోకి వెళ్ళిన ముకుంద తను ఏర్పాటు చేసిన లవ్ లైట్స్ ఏమైపోయాయని ఆలోచిస్తుంది.


కృష్ణ ఎందుకు తిరిగి వచ్చింది? మురారీ తనని ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయిందా? ఇదంతా రేవతి అత్తయ్య వేసిన ప్లాన్ అనుకుంటా. మా ప్రేమని బతికించుకోవడానికి ఈ ఇంట్లో అందరితో యుద్దం చేయాల్సి వస్తుంది. నేను ప్రేమించిన వాడు కూడ ప్రత్యర్థి వైపు ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా చావనైనా చస్తాను కానీ నా ప్రేమని నేను చంపుకోను. ఈ విషయంలో నాకు హెల్ప్ చేసేది మా నాన్న ఒక్కరే. అత్తయ్యతో మా ప్రేమ విషయం చెప్పమని నాన్నకి చెప్పాలని అనుకుంటుంది.


Also Read: 'హ్యాపీ' ఎండింగ్.. వేద కడుపు పండింది- అభిమన్యు మీద పగ తీర్చుకున్న నీలాంబరి


కృష్ణ మురారీకి జ్యూస్ తీసుకొచ్చి తాగమని అంటుంది. తాగుతూ షర్ట్ మీద పోసుకుంటాడు. తను క్లీన్ చేస్తానని కృష్ణ అంటే వద్దని తనని ఆపేందుకు ట్రై చేస్తుంటే మళ్ళీ పడిపోతుంది పట్టేసుకుంటాడు. కృష్ణ నాతో జీవితం పంచుకోవడానికి వచ్చిందా? లేదంటే అమ్మ బలవంతం చేస్తే వచ్చిందా అని అనుకుంటాడు.


మురారీ: నాకు బాగోలేదని నేను పూర్తిగా కోలుకునేదాకా నన్ను చూసుకోవడం కోసం తిరిగి వచ్చావా?


కృష్ణ: నా స్వార్థం కోసం నేను వచ్చాను.. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు


కృష్ణ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని అనుకుంటుండగా ముకుంద వచ్చి పలకరిస్తుంది.


మురారీ: ఇందాక కృష్ణ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటి ఇంత స్వీట్ గా ఉందని అడిగాను


ముకుంద: బెల్లం ఎక్కువ వేసిందా?


మురారీ: కాదు కొంచెం తాగి ఇచ్చాను అన్నది


ముకుంద: మురారీ నువ్వు తనతో చనువుగా ఉండటం నాకు నచ్చదు


మురారీ: చూడండి ముకుంద గారు. మేంఇద్దరం భార్యాభర్తలం. మా మధ్య సరసాలు లేకపోతే తప్పు కానీ ఉంటే తప్పు ఎలా అవుతుంది. కృష్ణ నా షర్ట్ మీద పడిన జ్యూస్ తుడిచింది. అప్పుడు తన బుగ్గలు చూడాలి ఎంత అందంగా ఉన్నాయో


Also Read: లాస్యకి అదిరే ఝలక్ ఇచ్చిన లక్కీ- నందు ఆవేదన, తులసి ఆక్రోశం


ముకుంద: మీ ఇద్దరినీ అసలు మనశ్శాంతిగా ఉండనివ్వను


మురారీ: చాలులే ఆపు. మన ఇద్దరి ఫోటోస్ చూపించి భూమి బద్ధలవుతుందని బిల్డప్ ఇచ్చావ్ ఏమైంది. ఇక మీదట కూడా అంతే మీ లైఫ్ మీరు చూసుకోండి. ఎందుకు మీది కాని దాని కోసం ఆరాటం


అలేఖ్య వచ్చి ముకుంద డల్ గా ఉంటే ఏమైందని అడుగుతుంది. తను ఒంటరిదాన్ని అయ్యానని అనిపిస్తుందని, తన ప్రేమకి ఎవరూ సపోర్ట్ చేయడం లేదని బాధపడుతుంది.


అలేఖ్య: నీ ప్రేమని నువ్వే గెలిపించుకో. నిజమైన ప్రేమకి మరణం లేదు


ముకుంద విషయం తేల్చేయాలని, తన కారణంగానే ఆదర్శ్ రావడం లేదేమోనని గుండె తరుక్కుపోతుంది. వీలైనంత త్వరగా ముకుంద ఎవరిని ప్రేమించిందో కనుక్కుని చెప్పమని చెప్తుంది. మధుకర్ రీల్స్ కోసం ప్రసాద్ భార్యతో కలిసి డాన్స్ చేస్తాడు. ఇంట్లో ఒక ఆకేషన్ ఉందని ఎవరికైనా అది గుర్తుందా అని భవానీ అడుగుతుంది. తనకి గుర్తుందని రేవతి చెప్తుంది. వరలక్ష్మీ వ్రతం ఉంది కదాని కృష్ణ అంటుంది. వరలక్ష్మీ వ్రత విశిష్టత గురించి చక్కగా చెప్తుంది.