లాస్యకి ఎలా ఉందో ఏంటోనని అనసూయ వాళ్ళు అనుకుంటూ ఉండగా తులసి వాళ్ళు వస్తారు. లక్కీ సంతోషంగా మమ్మీకి ఏం కాలేదని చెప్తాడు.


లక్కీ: మా మమ్మీ ఈ ఇంటికి వచ్చేస్తుంది నాతో పాటు ఇక్కడే ఉంటుంది. ఇక ఎప్పటికీ డాడీతో ఉండొచ్చు


అనసూయ: ఏంటి ఇది వాడు చెప్పేది నిజమేనా? అది ఎలా వస్తుంది. మీరు ఎలా ఒప్పుకున్నారు మమ్మల్ని అడగాల్సిన పని లేదా?


పరంధామయ్య: తనని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఎంత కష్టపడ్డాము. మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు


తులసి: అసలు ఈ గొడవ అంతా లక్కీని తీసుకురావడం వల్లే జరిగింది ఏమైనా అడగాలని అనుకుంటే నందుని అడగండి


నందు: సూసైడ్ చేసుకుని లాస్య ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో తులసి ఒప్పుకుంది. తను మాట ఇచ్చింది కాబట్టి ఏం చేయలేము. తనని వ్యతిరేకిస్తే తనకి కోపం వస్తుంది


Also Read: కృష్ణకి సర్‌ప్రైజ్, ముకుందకి షాక్ - రేవతినా మజాకా!


అనసూయ: ఆ బ్రహ్మరాక్షసి రాకుండా ఉండాలంటే ఈ పిల్లోడిని ఇక్కడి నుంచి పంపించేయాలి


లాస్య సరదాగా పాటలు పాడుకుంటూ ఉండగా తులసి వస్తుంది. తనని చూసి షాక్ అవుతుంది.


తులసి: చాలా హుషారుగా ఉన్నావ్ కూని రాగాలు తీస్తున్నావ్


లాస్య: కొడుకుతో ఉండటానికి బయల్దేరుతున్నా కదా నీ పుణ్యం వల్ల


తులసి: లక్కీ మనసు మారి వెనక్కి తెచ్చుకునే వరకు కదా అక్కడ నువ్వు ఉండేది


లాస్య: వాడికి డాడీ పిచ్చి పట్టుకుంది. నందుని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇంతకముందులా కాదు నేను మారిపోయాను


తులసి: మళ్ళీ నమ్మి మోసపోలేను. ఐసీయూలో నువ్వు నీ తోడు దొంగలు మాట్లాడుకోవడం నేను విన్నాను చూశాను


లాస్య: నేను స్లీపింగ్ పిల్స్ వేసుకుని సూసైడ్ చేసుకున్నానని నమ్మేసింది. మళ్ళీ ఆ ఇంట్లో కాలు పెట్టి చక్రం తిప్పుతా. లక్కీని అడ్డం పెట్టుకుని నందుని సొంతం చేసుకుంటాను. తులసిని ఆ ఇంటికి దూరం చేస్తాను. నిజంగా సూసైడ్ చేసుకున్నట్టు మీరు బాగా నమ్మించారు అని రాజ్యలక్ష్మి వాళ్ళతో మాట్లాడే సీన్ చూపిస్తారు


తులసి: ఇప్పుడు చెప్పు సుందరవదన


లాస్య: నా నాటకం తెలిసిపోయింది కదా ఇంకెందుకు దాచడం


తులసి: కొడుకు మీద ప్రేమతో దిగులు పెట్టుకున్నట్టు నాటకం ఆడావు. ఈ విషయం తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు


లాస్య: వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. వాడు వాడి స్వార్థం చూసుకున్నాడు నేను నా స్వార్థం చేసుకున్నా


తులసి: అనవసరంగా మిమ్మల్ని నమ్మి తప్పు చేశాను


Also Read: ఇంద్రాదేవి ఆన్ ఫైర్, తలవంచిన కోడలు - కావ్య వ్రతం చేసుకోవడానికి అపర్ణ ఒప్పుకుంటుందా?


లాస్య: నువ్వు నాగురించి వాడికి చెప్దామని అనుకుంటే వాడిని బలవంతంగా లాక్కుని వెళ్లిపోతాను. నేను మరోసారి నందుకి భార్యని కాబోతున్నా దీన్ని ఎవరూ ఆపలేరు. రేపు మరోసారి అత్తారింట్లో అడుగుపెట్టబోతున్నా. నన్ను వదిలించుకున్నానని నీకు లైన్ వేస్తున్నట్టు ఉన్నాడు కుదిరితే పెళ్లి కూడా చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. కానీ ఆ నిత్య పెళ్లి కొడుక్కి చెప్పు రెండో భార్య మరోసారి జీవితంలోకి వస్తుందని చెప్పు


దివ్య విక్రమ్ మీద సీరియస్ అవుతుంది. తప్పు చేశావని అంటుంది.


దివ్య: లాస్య ఆంటీ మా నాన్నని ఎంత టార్చర్ చేసిందో తెలుసు. ఆవిడని వదిలించుకోవడానికి నానా కష్టాలు పడ్డారు జైలుకి కూడ వెళ్లారు. వదిలించుకున్న దాన్ని మళ్ళీ ఎందుకు మా నాన్న మీదకి తోలావు


విక్రమ్: తల్లీకొడుకులని విడదీయడం తప్పని అనిపించింది అందుకే వెళ్ళమని చెప్పాను


దివ్య: కొడుకే కావాలని అనుకుంటే వాడిని తీసుకుని వెళ్ళమని చెప్పొచ్చు కదా. మా ఇంట్లో సెటిల్ అవడం ఏంటి


విక్రమ్: ఈ మొండివాదన నాకు నచ్చదు. డాడీ అని అతుక్కుపోయాడని వాడిని ఉంచుకున్నారు తల్లిని రానివ్వరా


దివ్య: వాడు మొండిగా ఉండిపోయాడు. అందుకే బాధపెట్టడం ఇష్టం లేక ఉంచారు. లాస్య ఇంట్లో చేరేది మా ఇంట్లో గొడవలు పెట్టడానికి. అయినా విడాకులు తీసుకున్నాక మా నాన్నతో ఎలా కలిసి ఉంటుంది.


విక్రమ్: పెళ్లి కాకముందు లాస్య మీ ఇంట్లో ఉందని నువ్వే చెప్పావు అప్పుడు ఎలా ఉంది. లాస్య, లక్కీని విడదీయొద్దని మీ వాళ్ళకి చెప్పు


నందు దిగులుగా వచ్చి లక్కీ ముందు కూలబడిపోతాడు. తన బాధని పాము, నిచ్చెన ఆట ద్వారా చెప్పుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. పాము నన్ను మింగడానికి మళ్ళీ వస్తుందని అంటాడు.


లక్కీ: మళ్ళీ వస్తున్న పాము మమ్మీనే కదా. నాకు అర్థం అయ్యింది


నందు: ఇప్పుడిప్పుడే వేసిన తప్పటడుగులు సరి చేసుకుంటున్నా. ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలని అనుకుంటున్నా. ఆ పాము కారణంగా మళ్ళీ సంతోషం దూరం కాబోతుంది. ఆ రాక్షసి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి నరకం చూపించడానికి రెడీ అయిపోతుంది.


తోడుదొంగలు తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు తెగ నవ్వుకుంటారు. లక్కీ డాడీని వెతుక్కోవడమే కాదు తెగిపోయిన మా బంధాన్ని ముడిపడేలా చేస్తున్నాడని లాస్య సంతోషపడుతుంది. తులసికి మనశ్శాంతి లేకుండా చేయాలని అంటుంది. అక్కడ తులసి డిస్ట్రబ్ అయితే ఇక్కడ దివ్య కూడా డిస్ట్రబ్ అవుతుందని రాజ్యలక్ష్మి సంతోషపడుతుంది.


తరువాయి భాగంలో..


లాస్య తులసి ఇంట్లో అడుగుపెడుతుంది. ఏం జరుగుతుందో ఏమోనని నందు కుటుంబం మొత్తం దిగులుగా కూర్చుంటారు. లక్కీ బ్యాగ్ తగిలించుకుని కిందకి వస్తాడు. ఏంటి గది ఖాళీ చేస్తున్నావా నాకోసమని అంటుంది. కాదు ఇల్లు ఖాళీ చేస్తున్నామని షాకిస్తాడు.