Prema Entha Madhuram August 31th: ఎపిసోడ్ ప్రారంభంలో అభయ్ తన షూ పాలిష్ చేసుకుంటూ ఉండగా అక్కడికి అను వచ్చి నువ్వెందుకు చేసుకుంటున్నావు అనటంతో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అని కొన్ని మాటలు చెబుతూ ఉంటాడు. ఇక అక్షర కూడా వచ్చి తన తల్లితో తన షూ పాలిష్ చేయమని అనటంతో వెంటనే అభయ్ సీరియస్ గా అరవటంతో సైలెంట్ అయ్యి తనే పాలిష్ చేసుకుంటాను అని అంటుంది.


ఇక అక్షర మాటల్లో తన తండ్రి గురించి అడుగుతూ ఉంటుంది. డాడీ ఎక్కడ.. అసలు మన దగ్గర ఎందుకు లేడు.. ఎక్కడ ఉన్నాడు అంటూ తన తండ్రి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. దాంతో అను బాధపడుతూ ఉండటంతో వెంటనే అభయ్ అక్షర పై ఫైరవుతాడు. ఎందుకు డాడీ గురించి అడిగి అమ్మని ఎందుకు బాధ పెడుతున్నావు అని ఎదిరిస్తాడు. మరోసారి అమ్మను అలా అడగకూడదు అని అనడంతో అక్షర సైలెంట్ అవుతుంది.


ఇక అభయ్ తన తల్లితో డాడీ గురించి అడిగిన ప్రతిసారి నువ్వు ఇలా బాధపడుతున్నావు.. నువ్వు బాధపడకు అమ్మ అని ధైర్యం చెబుతాడు. ఇక పిల్లలు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అను ఆర్యను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు శారదమ్మ అంజలి దంపతులను భోజనానికి పిలవగా అదే సమయంలో అక్కడికి వాచ్మెన్ వచ్చి మాన్సీ, ఛాయాదేవి వచ్చారని చెప్పటంతో వాళ్లను ఎందుకు రానించావు అంటూ కోపంగా అడుగుతాడు నీరజ్.


అప్పుడే మాన్సీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి నా ఇంట్లోకి నేను రావడానికి నాకేంటి పర్మిషన్ అంటూ లోపలికి వచ్చి పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. ఛాయదేవి కూడా రావటంతో ఇంట్లో వాళ్ళు బాగా కోపంగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఇద్దరు బాగా పొగరుగా మాట్లాడటంతో అప్పుడే ఆర్య వచ్చి సీరియస్ గా అరుస్తాడు. ఇక అంజలి షేర్స్ అని తనవని.. ఆ షేర్స్ అన్ని తను దక్కించుకుంటాను అని అనటంతో అంజలి షాక్ అవుతుంది.


ఆ షేర్స్ తనవి అని అంజలి ఎంత చెప్పినా కూడా వినిపించుకోరు. అది మదన్ ద్వారా దక్కించుకున్నాను అని ఛాయాదేవి అంటుంది. అంతేకాకుండా డాక్యుమెంట్లు కూడా చూపించడంతో అవి ఫేక్ డాక్యుమెంట్లో ఏమో అని అనుమానం పడతారు అంజలి దంపతులు. మాన్సీ కూడా పొగరుగా మాట్లాడుతూ తను ఆ ఇంటి కోడలు అన్నట్లుగా రెచ్చిపోయి మాట్లాడటంతో వెంటనే ఆర్య తనపై అరుస్తూ తనకు ఈ ఇంటి కోడలుగా హక్కు లేదు అని చెప్పడమే కాకుండా.. అంజలి, నీరజ్ చేతులను కలిపి వీరిద్దరూ ఎప్పటికీ భార్య భర్తలే.. ఎవరు ఏమి అన్నా అనుకున్న వీరిద్దరి ఎప్పుడు కలిసే ఉంటారు అని గట్టిగా చెప్పేస్తాడు. దాంతో మాన్సీ షాక్ అవుతుంది. ఇక ఛాయాదేవి మాత్రం తను అన్ని దక్కించుకుంటాను అన్నట్లుగా సవాల్ చేస్తూ ఉంటుంది. ఆర్య గట్టిగా గెటవుట్ అనడంతో దెబ్బకు వెళ్ళిపోతారు. ఇక అంజలి బాధపడుతూ ఉండటంతో శారదమ్మ ఓదారుస్తూ ఉంటుంది.


also read it : Trinayani August 30th: 'త్రినయని' సీరియల్: బిడ్డను వదిలేసి ఆస్తి గురించి రచ్చ చేస్తున్న సుమన



 



Join Us on Telegram: https://t.me/abpdesamofficial