Trinayani August 30th: బిడ్డకు జన్మనిచ్చి 24 గంటలు కూడా కాకముందుకే సుమన బిడ్డను వదిలేసి ఆస్తికోసం డాక్యుమెంట్లు పట్టుకొని హాల్లోకి వచ్చి తన అక్క బావ గురించి అడుగుతూ బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక తను ఆస్తి పేపర్లు పట్టుకొని రావటంతో ఇంట్లో వాళ్లంతా తనపై చిరాకు పడుతూ ఉంటారు. ఇక సుమన మాత్రం ఆస్తి గురించి విశాల్, నయని లను అడుగుతూ ఉంటుంది. వాళ్లు లేరని చెప్పటంతో.. కనీసం తన బిడ్డను కూడా చూడటానికి రాలేదు అని కోప్పడుతుంది. ఇంతకు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అనుమానం పడుతుంది.
అప్పుడే పావనమూర్తి నీకు ఆస్తి ఇవ్వడానికి కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారేమో అనటంతో.. వెంటనే సుమన వారిద్దరి సైన్ ఉంటే మిగతాదంతా నేను చూసుకుంటాను అని పొగరుగా మాట్లాడుతుంది. ఇక విక్రాంత్ కు సుమన చేష్టలపై బాగా కోపం వస్తూ ఉంటుంది. తనపై చిరాకు పడ్డ కూడా సుమన మాత్రం వాటిని అస్సలు లెక్క చేయదు. ఇక హాసిని కూడా బిడ్డ పుట్టింది కదా నీ ఆస్తి నీకు వస్తుంది కదా.. ఎలాగైనా చెల్లి వాళ్ళు నీకు ఆస్తి ఇస్తారు.. బిడ్డను ఒంటరిగా వదిలేసి రావద్దు అని చెబుతూ ఉంటుంది.
కానీ సుమన మాత్రం బాగా మొండికేస్తూ ఉంటుంది. కనీసం నా కంటికి కూడా కనిపించడం లేదు ఏంటి అనటంతో తిలోత్తమా, వల్లభ వాళ్ళు కూడా లేరు అని అందరూ వచ్చాకే అందరు ముందు నయని ఆస్తి ఇస్తుంది అని ఇంట్లో వాళ్ళు అంటారు. అంతేకాకుండా ఆస్తి కోసం 9 నెలలు ఆగావు ఇప్పుడు ఆగలేవా అని అనడంతో కాస్త సైలెంట్ అవుతుంది. ఆ తర్వాత హాసిని బిడ్డకు పాలు పట్టావా అనటంతో చిరాకు పడుతూ మాట్లాడుతుంది సుమన.
ఆవు పాలు పట్టిస్తానులే అని అనటంతో వెంటనే విక్రాంత్.. నీకు, నాకు కలిసి పుట్టిన బిడ్డ అయితే ప్రేమ ఉంటుంది అని అనటంతో దానితో సుమన నువ్వు ఏమన్నా.. నేను 9 నెలలు మోసిన నా బిడ్డ అని అంటుంది. దాంతో మళ్ళీ ఇంట్లో వాళ్ళు కసి గర్భం గురించి టాపిక్ తీస్తారు. అలా కాసేపు సుమన ఆస్తి గురించి రచ్చ జరగగా ఇక సుమనను నచ్చజెప్పి లోపలికి పంపించేస్తారు.
మరోవైపు విశాల్ ను నీళ్లలో పడేసి చేతులు దులుపుకుంటారు తల్లి, కొడుకు. ఇక వల్లభ విశాల్ పైకి తేలడా అనటంతో రాయి కట్టాము కాబట్టి తేలడు అని అంటుంది. అప్పుడే నయని చెరువు దగ్గరికి వచ్చి విశాల్ ను గట్టిగా పిలవడంతో వెంటనే తిలోత్తమా, వల్లభ షాక్ అవుతారు. ఇక నయని చెరువు దగ్గరికి వెళ్లి బాగా ఏడుస్తూ తన భర్తను పిలుస్తూ ఉంటుంది. ఇక తిలోత్తమా వాళ్ళు తను అక్కడికెందుకు వచ్చిందా అన్నట్లు చూస్తూ ఉంటారు.
ఇక నయని ఏడుస్తూ మీరు ఈ నీళ్లలోనే ఉన్నారని నాకు తెలుసు అని అనటంతో వెంటనే ఆ తల్లి కొడుకు ఇద్దరు షాక్ అవుతారు. నయని నీటి వైపు చూస్తూ ఆ నీళ్లలో ఉన్న తన భర్తను ఎలా బయటకు తీసుకొని రావాలా అని ఏడుస్తూ ఉంటుంది. దారిలో ఎద్దులయ్యను వదిలేసి వచ్చానే అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక విశాలాక్షి అమ్మవారిని తలుచుకొని పాట కూడా పాడుతుంది.
మరోవైపు ఏం జరుగుతుందా అని ఆ తల్లి కొడుకు ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇక పాట పూర్తయిన తర్వాత ఎద్దులయ్య ఎద్దు వేషంలో వచ్చి తనకు సహాయం చేస్తాడు. తన కొమ్ములకు తాడు వేయించి ఒక ఇనుప కడ్డీని తాడుకు కట్టివేసి నయని నీళ్లలో వదిలేయగా అక్కడి విశాల్ ను చుట్టి పడేసిన చాపకు తగలటంతో వెంటనే ఎద్దులయ్య సహాయంతో బయటికి లాగుతుంది నయని.
ఇక చాపను తీసి ఒడ్డున పెట్టగా.. ఎద్దులయ్య నయని కంటికి కనిపించకుండా మారువేషం నుండి అసలు రూపానికి వస్తాడు. అక్కడికి వచ్చి నయనికి సహాయం చేస్తాడు. ఇక చాప తెరిచి చూడడంతో అందులో విశాల్ కాకుండా కాస్త వయసు మీద పడిన వ్యక్తి ఉండటంతో నయని షాక్ అవుతుంది. తిలోత్తమా వాళ్లు కూడా ఆ వ్యక్తిని చూసి షాక్ అవుతారు. ఈయన ఎవరు అని నయని ఆశ్చర్యంగా చూడటంతో.. పక్కనే ఉన్న ఎద్దులయ్య ఆయననే విశాల్ బాబు అని చెప్పటంతో మరింత షాక్ అవుతుంది నయని.
దాంతో గతంలో.. గురువు చాటలో సుమనతో చదివించిన విషయాన్ని గుర్తుకు చేస్తాడు ఎద్దులయ్య. అంటే కొన్ని కారణాల వల్ల విశాల్ మరో రూపం దాలుస్తాడు అని అర్థం. ఆ తర్వాత ఎద్దులయ్య ఆయనకు స్పృహ వచ్చేలాగా చేయటంతో ఆయన నయనిని చూసి నయని అనటంతో ఆయననే విశాల్ అని నయని కూడా తెలుసుకుంటుంది.
also read it : Krishna Mukunda Murari August 29th: మురారి గదిలో తమ ప్రేమ గుర్తులను అతికించిన ముకుంద.. కొడుకుని చూసి కంగారుపడ్డ భవాని?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial