గుప్పెడంతమనసు ఆగష్టు 30 ఎపిసోడ్ (Guppedanta Manasu August 30th Written Update)
అనుకోకుండా వసుధార ఇంటికి వచ్చిన ఏంజెల్ చూసి దాక్కుంటాడు రిషి.
ఏంజెల్: రిషి ఇంకా ఇంటికి రాలేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు
ఏంజెల్ కంగారు చూసిన రిషి..మెసేజ్ చేస్తారు. పావుగంటలో వస్తాను నువ్వు కంగారుపడకు అని మెసేజ్ చూసి ఏంజెల్ షాక్ అవుతుంది. అదేంటి రిషి ఇక్కడే ఉన్నట్టు నేను మాట్లాడినదంతా విన్నట్టే రిప్లై ఇచ్చాడని డౌట్ తో రిషి ఇక్కడే ఉన్నాడా ఏంటి అంటుంది. అల్లుడు గారు ఇక్కడ ఎందుకు ఉంటారమ్మా అని చక్రపాణి అనేసి మళ్లీ బాబు గారు ఇక్కడెందుకు ఉంటారమ్మా అని మాటమార్చేస్తాడు.
ఏంజెల్: ఇంతలో భోజనం దగ్గర మూడు ప్లేట్లు ఉండడం చూసి మీరు ఉన్నది ఇద్దరే కదా మరి మూడో ప్లేట్ ఉందేంటని అడుగుతుంది. వసు-చక్రపాణి కంగారుపడతారు. నీకోసమే అని ఇద్దరూ కవర్ చేస్తారు కానీ సగం తిన్న ప్లేట్ పెడతారా అని క్వశ్చన్ చేస్తుంది.
వాస్తవానికి ఏంజెల్ ముందు బుక్కైపోయినా బయటపడకుండా కవర్ చేస్తారు. ( లోపలున్న రిషి మాత్రం నేను ఇంటికి వచ్చినప్పుడు వసుధార వాళ్ల అమ్మ కనిపించడం లేదేంటి...ఇప్పుడు అడిగితే మళ్లీ తనపై నాకు ప్రేమ ఉంది అనుకుంటుంది అనేసి ఊరుకుంటాడు)...ఏంజెల్ వెళ్లిపోయిన తర్వాత బయటకు వచ్చిన రిషి..నాకు తెలిసిన వాళ్లు కనిపించడం లేదంటాడు కానీ వసుధార బయటపడదు.
వసు: ఏంజెల్ కంగారుపడుతోంది ఇంటికి వెళ్లండి
రిషి: ఆ ఇంటికి వెళ్లాలని లేదు
వసు: ఇప్పుడు మీ అవసరం ఆ ఇంటికి చాలా ఉంది..ఎప్పటికైనా ఏంజెల్ కి నిజం చెప్పండి. సమస్య ఎదురైనప్పుడు పారిపోవద్దు.. నిజాలు తెలుసుకోండి
రిషి: ఏం మాట్లాడినా అక్కడకే వెళతారెందుకు..నేను ఇంటికి వెళుతున్నా విశ్వనాథం సార్ కోసం అనేసి వెళ్లిపోతాడు...
Also Read: శ్రీవారి సేవలో వసుధార, రిషిని అడిగేద్దామని డిసైడైన ఏంజెల్!
విశ్వనాథం దగ్గరున్న ఏంజెల్.. రిషి రావడం చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మీ ఇద్దరి మధ్యా ఏదైనా గొడవ జరిగిందా, ఏంజెల్ ఏమైనా ఇబ్బందిపెట్టిందా అని విశ్వనాథం అంటాడు. అదేం లేదన్న రిషి...ఏంజెల్ ని పిలిచి..మనం ఫ్రెండ్స్ మాత్రమే మనమధ్య గొడవలు రాకూడదు అంటాడు. ఓకేనా ఏంజెల్ మనమధ్య గొడవలు రాకూడదు అనేసి వెళ్లిపోతాడు. కానీ ఏంజెల్ మాత్రం నువ్వు తప్పించుకుంటున్నావని అర్థమవుతోంది, కానీ నేను నిన్ను వదలను అనుకుంటూ వెనుకే వెళుతుంది..
ఏంజెల్: నువ్వు సరైన కారణం చెబుతావా..విశ్వంకి చెబుతావా, కారణం చెబుతావా, ఒప్పుకుంటావా...
రిషి: నేను చెప్పాల్సింది చెప్పాను..నువ్వు సార్ కి చెప్పాలి అనుకుంటే చెప్పు..కానీ సార్ కి చెప్పినా కూడా నా నిర్ణయం మారదు..ఈ విషయం సార్ కి తెలిస్తే బాధపడతారు..సార్ ని బాధపెట్టాలి అనుకుంటే చెప్పు
ఏంజెల్: అంతేనా..నీ నిర్ణయం మారదా
రిషి: అర్థం చేసుకో...
Also Read: ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు, రాఖీ పండుగ ఎప్పుడు - ఎలా మొదలైంది!
DBST కాలేజీ దక్కించుకునే కుట్రలో భాగంగా మేనేజర్ దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు శైలేంద్ర. మేనేజర్ తన కూతురి పెళ్లికి లోన్ కోసం అప్లికేషన్ నింపుతుంటాడు. మన దగ్గర పనిచేసే స్టాఫ్ కి లోన్ ఇస్తుంటారు..వడ్డీ తీసుకోరు కానీ ఇచ్చిన డబ్బులో జీతంలో కట్ చేసుకుంటారు..
శైలేంద్ర: ఇదే అవకాశంగా తీసుకుని అదేంటి ఫ్రీగా ఇవ్వొచ్చు కదా.. అయినా నాలాంటి వాడు నా పని జరగాలంటే ఏంతైనా ఇస్తాడు..మీరు లోన్ తీసుకుంటే కాలేజీకి తిరిగి ఇవ్వాలి కానీ నేను ఇస్తే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పిన పని చేయాలి
మేనేజర్: డబ్బుకోసమే కదా పని చేయాలి..చెప్పండి మీరు ఏం చెప్పినా చేస్తాను
శైలేంద్ర: బ్యాంక్ అకౌంట్స్ సీజ్ కావాలంటే ఏం ఏం చేయాలి
మేనేజర్: టాక్స్ కట్టకపోయినా , అనుమానంగా ఏవైనా లావాదేవీలు జరిగినా సీజ్ చేసే అవకాసం ఉంటుందంటాడు
శైలేంద్ర: మరి DBST కాలేజీ లెక్కలన్నీ సరిగ్గానే జరుగుతున్నాయా.. ఒకవేళ తేడా రావాలంటే...షాక్ అయి చూస్తున్న మేనేజర్ తో మీరు కంగారుపడకండి మీ లాభం కోసమే అని క్లారిటీ ఇచ్చి..అకౌంట్ సీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు...
భయంగా ఉంది సార్ అంటాడు మేనేజర్.. భయపడుతూనే పని పూర్తిచేయండని ప్లాన్ చెప్పేసి వెళ్లిపోతాడు శైలేంద్ర
మరోవైపు వసుధారని మళ్లీ కలుస్తుంది ఏంజెల్
వసు: ఏదో మాట్లాడాలని పిలిచి మౌనంగా ఉన్నావేంటి
ఏంజెల్: రిషి ముందు ఎంత ఓపెన్ గా ఉద్దేశం చెప్పినా తనుమాత్రం ఫ్రెండ్ అనే లైన్ దాటి రావడం లేదు. ఎంత ఓపెన్ గా మాట్లాడినా తనుమాత్రం మాట దాటేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. దీనికి సొల్యూషన్ ఏంటి
వసు: ఈ డొంక తిరుగుడులన్నీ ఎందుకు ఎస్ ఆర్ నో చెప్పు అని అడగు
ఏంజెల్: అడిగినా కానీ సమాధానం చెప్పకుండా దాటేస్తున్నాడు.. నా తరపున నువ్వే మాట్లాడాలి..నువ్వైతేనే బాగా మాట్లాడగలవు
వసు: లేదు ఏంజెల్ నేను మాట్లాడలేను...అర్థం చేసుకో..ఇబ్బంది పెట్టకు
ఏంజెల్: ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య నువ్వే మాట్లాడు అంటుంది..
ఇంతలో రిషి రావడం చూసి..తనెందుకు వస్తున్నారని వసు అడిగితే.. నేనే రమ్మన్నానని చెబుతుంది ఏంజెల్
ఇద్దరూ ఒకేచోట చేరారేంటని రిషి అనుకుంటే..నా పరిస్థితి ఏంటి ఇలా తయారైందని వసు అనుకుంటుంది..
ఏంజెల్: మన పెళ్లి గురించి ఎంత సీరియస్ గా తీసుకున్నానో వసుధార నీకు చెబుతుంది
వసు: ఇబ్బందిగా మొహం పెట్టిన వసుధార..ఏంజెల్ తన ఇష్టాన్ని చాలాసార్లు తెలియజేసింది కానీ మీరెందుకు మౌనంగా ఉన్నారు.. మీ మనసులో ఏముంది.. మీ మనసులో ఎవరూ లేనప్పుడు తన ఇష్టాన్ని అంగీకరించవచ్చు కదా.. చెప్పండి సార్ ఓ ఆడపిల్ల తనంతట తానే చెబుతోంది.. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటోంది..మీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతోంది..ఒప్పుకోవచ్చు కదా సార్....
రిషి ...వసుధారవైపు చూస్తుండిపోతాడు...
ఎపిసోడ్ ముగిసింది....