గుప్పెడంతమనసు సెప్టెంబరు 1st ఎపిసోడ్ (Guppedanta Manasu September 1st Written Update)


కాలేజీలో జగతి-మహేంద్ర ఫైల్స్ చెక్ చేస్తారు...ఈ నెల జీతం ఇంకా రాలేదని కాలేజీలో పనిచేసే వ్యక్తి చెబుతాడు. షాక్ అవుతారు జగతి మహేంద్ర ( అకౌంట్స్ బ్లాక్ చేయాలన్న శైలేంద్ర ప్లాన్ వర్కౌట్ అయింది)..ఓసారి మేనేజర్ ని రమ్మని చెప్పండని పంపించేస్తుంది జగతి. మీరు కాన్సన్ ట్రేషన్ తోనే వర్క్ చేస్తున్నారా, ఈనెల జీతాలు ట్రాన్ఫర్ అయ్యాయా అని అడిగితే పడలేదని రిప్లై ఇస్తాడు మేనేజర్. అకౌంట్స్ లో ఏదో సమస్య వచ్చి ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాని చెప్పడంతో జగతి ఫైర్ అవుతుంది. వర్క్ లో పడి మర్చిపోయానని మేనేజర్ చెబుతాడు
జగతి: వర్క్ లో పడి మర్చిపోయారా, శైలేంద్రతో స్నేహం చేసి మర్చిపోయారా..మీ పని మీరు చేసినప్పుడే అందరం బావుంటాం అంటూ.. బ్యాంక్ మేనేజర్ కి కాల్ చేసి కనుక్కో 
ఇంతలో ఫణీంద్ర, శైలేంద్ర అక్కడకు వచ్చి..ఏమైందని అడుగుతాడు..
మహేంద్ర: ఏం లేదు అన్నయ్య..చిన్న ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకుని వచ్చేస్తాం
ఫణీంద్ర: నువ్వెందుకు మేనేజర్ తో శైలేంద్రని పంపిద్దాం..పని నేర్చుకోవాలంటే ఇబ్బందిపెట్టాలి..పని విషయంలో శైలేంద్రని మీరు ఇంటి మనిషిలా చూడకండి వర్కర్ లా చూడండి..
శైలేంద్ర: నేనుకూడా అదే చెబుతున్నాను కానీ పిన్ని, బాబాయ్ వినడం లేదు
ఫణీంద్ర: మహేంద్ర ఏం పర్వాలేదు శైలేంద్రను పంపించు..ప్రాబ్లెమ్ లేకుండా పూర్తిచేసుకుని వస్తాడనే నమ్మకం ఉందని చెప్పి... శైలేంద్ర వెళ్లినట్టు కాదు ప్రాబ్లెమ్ క్లియర్ చేసుకుని రావాలని పంపించేసి వెళ్లిపోతాడు..
బ్యాంకుకి వాడెళ్లాడని మహేంద్ర, జగతి టెన్షన్ పడతారు..


Also Read: ఉప్పెనంత ప్రేమతో గుప్పెడంత గుండెలో రిషిధార యుద్ధం, పెళ్లి విషయంలో అస్సలు తగ్గని ఏంజెల్!
అటు రిషి..ఏంజెల్ మాటలు గుర్తుచేసుకుని బాధపడతాడు. ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తాడు. వసుధారా నా మనసులో ఎవరున్నారో తెలియదా అని బాధపడతాడు. అవే ఆలోచనతో ఎదురుగా ఉన్న ఆటోని ఢీకొట్టబోతాడు. ఆ ఆటోలోంచి వసుధార కిందకు దిగుతుంది. ఆటో డ్రైవర్ రిషి పై ఫైర్ అవుతాడు. వసుధార రిషిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఆటో డ్రైవర్ ని పంపించేసి రిషి కారు దగ్గరకు వెళుతుంది. ఇంకా ఏమైనా ఉపన్యాసాలు ఉన్నాయా అని రిషి అంటే..మీ సేఫ్టీ నాకు ముఖ్యం నేను డ్రైవ్ చేస్తానని అంటుంది
రిషి: నన్ను ఈ సిట్యుయేషన్ లోకి తోసింది మీరే. మళ్లీ నా సేప్ఠీ గురించి ఆలోచిస్తున్నది మీరే..ఏమైనా అర్థం ఉందా
వసు: ముందు మీరు దిగండి అనేసి రిషిని చేయి పట్టుకుని డ్రైవింగ్ సీట్లోంచి దించేస్తుంది. సీట్ బెల్ట్ పెట్టేందుకు ట్రై చేస్తుంది కానీ రిషి విసుక్కుని సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు


DBST కాలేజీలో జగతి-మహేంద్ర టెన్షన్లో ఉంటారు. ఇంతలో మేనేజర్ వచ్చి అకౌంట్స్ సీజ్ అయ్యాని చెబుతాడు. ఎందుకో తెలియదు సార్ అకౌంట్స్ సీజ్ అయ్యాని చెప్పారనడంతో జగతి ఫైర్ అవుతుంది. లావా దేవీల్లో ఏవో అనుమానాలు ఉన్నాయట మేడం..చెక్ చేసే టైమ్ కూడా ఇవ్వలేదు మేడం..మూడు రోజుల తర్వాత రమ్మన్నారు అప్పటి వరకూబ్యాంకులు సెలవని చెప్పారంటాడు. మీరిక వెళ్లండి అని మేనేజర్ ని పంపించేస్తారు. అన్నయ్యకి తెలియకముందే మనమే ఏదో ఒకటి చేసి శాలరీస్ ఇచ్చేయాలని అనుకుంటారు జగతి-మహేంద్ర. అందరకీ ఇవ్వాలంటే మన అకౌంట్స్ ఉన్న అమౌంట్ సరిపోదని మహేంద్ర అంటే.. నా గోల్డ్ తాకట్టు పెట్టి శాలరీస్ ఇచ్చేద్దాం అనుకుంటారు.


కాలేజీలోకి వెళ్లిన వసుధారని ప్రిన్సిపాల్ పిలుస్తున్నారని చెప్పడంతో వెళ్లి కలుస్తుంది. రిషి ఏదో ఆలోచనలో ఉంటాడు..పాండ్యన్ పిలిచినా వినిపించుకోడు.. ఏంటి సార్ ఏమైంది అని పాండ్యన్ అడుగుతాడు. మీరేం టెన్షన్ పడకండి అదేం లేదని చెప్పేసి వెళ్లిపోతాడు. మ్యాథ్స్ సిలబస్ కంప్లీట్ అయిందో లేదో కనుక్కుందామని రమ్మన్నానంటాడు. సరే అంటుంది వసుధార. ఈ విషయంపై రిషి సార్ తోకలసి డిస్కస్ చేయండి అంటాడు. సరే అని బయటకు వెళ్లిన వసుధార..క్లాస్ రూమ్ లో రిషి కనిపించకపోవడంతో పాండ్యన్ ను పిలిచి అడుగుతుంది.
పాండ్యన్: సార్ క్లాస్ కి రాలేదు, తన క్యాబిన్లో ఉన్నారు, తలనొప్పిగా ఉందని చెప్పారు మేడం అంటాడు. ఎందుకో తెలియదు రిషి సార్ డల్ గా, పరధ్యానంగా ఉంటున్నారు, ఇంతకుముందు స్పెషల్ క్లాసులు తీసుకునేవారు..సార్ దేనిగురించో బాధపడుతున్నట్టున్నారు, సార్ కి ఏమైనా సమస్యలున్నాయా 
వసు: అవన్నీ అలోచించవద్దు..ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి కదా వాటిపై దృష్టి పెట్టండి అనేసి పాండ్యన్ ను పంపించేసి.. రిషికి ఏమైంది అనుకుంటుంది. 
ఏంజెల్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదని బాధపడుతుంటాడు రిషి..ఈ సిట్యుయేషన్లో వేరే అమ్మాయి ఉంటే నా రియాక్షన్ సీరియస్ గా ఉండేది కానీ ఇప్పుడు తనపై కోపం పెంచుకోవడం సరికాదనుకుంటాడు. వీళ్లని బాధపెట్టకూడదని గట్టిగా చెప్పలేకపోతున్నాను అనుకుంటాడు. ఇంతలో వసుధార వస్తుంది. రిషి సార్ చాలా డిస్ట్రబ్ అయి ఉన్నారు ఇప్పుడు పిలిచి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని వెళ్లిపోతుంది... ఇంతలో రిషికి కాల్ వస్తుంది. మీ దగ్గరకువసుధార మేడం వచ్చారా అని ప్రిన్సిపాల్ అడిగి సిలబస్ గురించి కలవమన్నట్టు చెప్పానంటాడు. ఏమో సార్ నన్ను కలవలేదని రిషి అనడంతో..ఏమై ఉంటుందని ప్రిన్సిపాల్ అనుకుంటాడు.


Also Read: ఏంజెల్ ని పెళ్లిచేసుకోమని చెప్పేసిన వసు - రిషి సమాధానం ఇదే!


రిషి-వసు
రిషినే వసుధార దగ్గరకు వెళ్లి కలుస్తాడు. సిలబస్ గురించి మనిద్దర్నీ కలసి పనిచేయమన్నారా మరి నన్నెందుకు కలవలేదని నిలదీస్తాడు... కలుద్దామనే అనుకున్నాను కానీ...ఈగో అడ్డొచ్చిందా నేను ఆయన్ను కలిసేదేముందని ఆగిపోయారా అని రివర్స్ అవుతాడు రిషి. మీ క్యాబిన్ దగ్గరకు వచ్చేసరికి మీరు డిస్ట్రబెన్స్ మూడ్ లో ఉన్నారు అందుకే ఆగిపోయానంటుంది. క్లాస్ తీసుకోవాల్సిన టైమ్ లో క్యాబిన్లో ఉన్నారు కదా అందుకే తర్వాత కలుద్దామని వచ్చేశాను అంటుంది. నేను డిస్ట్రబెన్స్ లో ఉంటే వర్క్ మానేస్తారా..పని చేస్తుంటే నాకు ఏ డిస్ట్రబెన్స్ ఉండదంటూ మాట్లాడుతాడు. ఇది చాలా చిన్న విషయం కానీ మీరెందుకు సాగదీస్తున్నారంటుంది..ఎవరిమీదో కోపం నాపై చూపిస్తున్నట్టుంది, ఎక్కడో జరుగిన సమస్యకి నాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు, మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారని వసుధార అంటుంది. నా మనసులో ఏముందో తెలిసే వాళ్లతో ఇలానే మాట్లాడాలి అంటాడు. రిషిని చూస్తూ ఉండిపోతుంది..
ఎపిసోడ్ ముగిసింది..