వేద కారుకి యాక్సిడెంట్ జరగడంతో కడుపులో బిడ్డకి ప్రమాదం జరిగిందని డాక్టర్ చెప్తుంది. దీంతో వేద గుండె పగిలిపోతుంది. యష్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. హాస్పిటల్ నుంచి బాధగా బయటకి వెళ్ళి తాగుతూ ఉంటాడు. వేద వచ్చి ఏం చేస్తున్నారని అంటుంది. యష్ దేవుడి మీద కోపంగా ఏంటి ఇదంతా అని నిలదీస్తాడు.


యష్: అందరూ నువ్వు ఉన్నావని అంటారు. నువ్వు గొప్ప అంటారు. మరి ఏంటి నీ గొప్ప.. నాకిష్టమైనవి అన్నీ తీసుకుని వెళ్ళడానికి నీకేం హక్కు ఉంది. సమాధానం చెప్పు తను ఎంత మంచిదో తెలుసా? తన కడుపున పుట్టకపోయినా నా ఇద్దరి బిడ్డల కోసం కన్నతల్లి కంటే ఎక్కువగా తపించింది. నాకు జీవితాన్ని ఇచ్చిన దేవత తను. నిన్ను తలుచుకోవాలంటేనే అసహ్యంగా అనిపిస్తుంది. తప్పులు చేసే అభిమన్యు లాంటి వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. బ్రేక్ ఫెయిల్ కాదు అభి గాడు చేసిన దుర్మార్గం


వేద: వాడి పాపాన వాడే పోతాడు. చంపాలనుకున్న వాడే చస్తాడు


యష్: చస్తే చస్తాడు. కానీ ఇంకా ప్రాణం కూడా పోసుకొని పసిప్రాణం ఎలా తీసుకుపోతాడు


Also Read: లాస్యకి అదిరే ఝలక్ ఇచ్చిన లక్కీ- నందు ఆవేదన, తులసి ఆక్రోశం


వేద: మనకి ఇద్దరు పిల్లలని ఇచ్చాడు. నేను వాళ్ళకి అమ్మని కానా? ఆ అదృష్టం నాకు ఉందని నేను నమ్ముతున్నా. మీరు కోరుకున్నట్టు దేవుడు ఇస్తాడు నా మాట నమ్మండి


అభిమన్యు మత్తులో నుంచి లేచి తనకేదో అవుతుందని హాస్పిటల్ కి తీసుకెళ్లమని నీలాంబరిని అడుగుతాడు. కానీ తను మాత్రం కూల్ గా మాట్లాడుతుంది. అలా మాట్లాడుతూ ఉండగా అభి నోట్లో నుంచి రక్తం వస్తుంది.


నీలాంబరి: నువ్వు తిన్న అన్నింటినీలోనూ విషం కలిపాను. నువ్వు లేవలేవు నీ బాడీ మొత్తం చచ్చుబడిపోతుంది. ఆ తర్వాత నోరు పడిపోయి ప్రాణం పోతుంది


అభి: ఎందుకు చేశావు ఈ పని. అసలు ఎవరు నువ్వు?


నీలాంబరి: ఒక ఫోటో తీసుకొచ్చి చూపించి ఈయన గుర్తున్నారా? అని అడుగుతుంది


అభి: పాండురంగారావు


నీలాంబరి: ఆయన కూతుర్ని నేను. నిన్ను మట్టు పెట్టి సర్వనాశనం చేయాలంటే తప్పదని అనుకున్నా అనేసి మెడలో తాళి తీసి వాడి మొహాన విసిరికొడుతుంది


అభి: ఎంత మోసం


నీలాంబరి: మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మా నాన్నని ఎంత మోసం చేశావ్. చిత్ర జీవితంతో ఆడుకోవాలని అనుకున్నావ్. మాళవిక జీవితాన్ని సర్వనాశనం చేశావు. వేద వాళ్ళని ముప్పుతిప్పలు పెట్టి ఇప్పుడు మట్టు పెట్టాలని అనుకున్నావ్. అసలు నువ్వు మనిషివేనా?


అభి: నన్ను చంపుతాననే ఆనందం కాదు ఉరి కంభం ఎక్కుతావ్


Also Read: కృష్ణకి సర్‌ప్రైజ్, ముకుందకి షాక్ - రేవతినా మజాకా!


నీలాంబరి: నీ చావు చూడాలని వచ్చిన దాన్ని నేను అంత ఈజీగా ఎలా ఇరుక్కుపోతాను. జైలుకి వెళ్ళి అవమానం తట్టుకోలేక అన్నంలో విషం కలుపుకుని తిన్న అభిమన్యు. ఆ ప్లాన్ నేను రెడీ చేశాను. నువ్వు తిన్న విషానికి విరుగుడు బాటిల్ ఇది తీసుకో


అభి: ఆ బాటిల్ ఇవ్వు నాకు.. నా ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తాను


నీలాంబరి: ఆ ఆస్తి నాదే కదా


అభిమన్యు గిలాగిలా కొట్టుకుని చచ్చిపోతాడు. ఒక పీడా విరగడ అయ్యిందని నీలాంబరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యష్ ఇంట్లో అందరూ వేద గురించి బాధపడుతూ డల్ గా ఉంటారు. అప్పుడే డాక్టర్ ఎంట్రీ ఇస్తుంది.


డాక్టర్: నీకోక విషయం చెప్పాలి. ఇదొక స్పెషల్ ఇష్యూ అందుకే నేను విషయం చెప్పడానికి వచ్చాను. మీరందరూ మమ్మల్ని క్షమించాలి. మీ రిపోర్ట్స్ వచ్చాయి. మీరు ఇప్పటికీ ప్రెగ్నెంట్ అనేసరికి ఇంట్లో అందరి మొహాల్లో నవ్వు వచ్చేస్తుంది. సీన్ కట్ చేస్తే వేదకి కుటుంబం అంతా సంతోషంగా సీమంతం చేస్తారు. అలా సీరియల్ కి మళ్ళీ కలుద్దాం.. అంటూ ఎండ్ కార్డ్ వేసేశారు.