Krishna Mukunda Murari August 28th: ఈరోజు ఎపిసోడ్ లో రేవతి మీది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా నిజమైన మ్యారేజ్ కాదు కదా అనడంతో అమ్మ నువ్వేంటి అమ్మ ఇలా మారిపోయావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు మురారి. మరి ఇంకేం మాట్లాడాలి మీకు ఒకరంటే ఒకరి ఇష్టం లేనప్పుడు ఎన్నాళ్ళని మీరు కలుస్తారని ఎదురు చూడాలి. ఎన్ని రోజులని మీకు కాపలా కాయాలి అని అంటుంది రేవతి. మేము బాగుండాలని మాతో ఎన్నో పూజలు వ్రతాలు కూడా చేయించావు కదా అమ్మ మరి అలాంటప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అనగా అవును రా మీరు బాగుండాలని పూజలు చేయించాను.


 మీకు తెలిసి కొన్ని పూజలు మాత్రమే చేయించాను మీకు తెలియకుండా ఎంతో మంది దేవుళ్లకు మొక్కాను ఎన్నో పూజలు చేయించాను కానీ మీరు ఒకరంటే ఒకరికి ఇష్టం లేనప్పుడు నేను ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు అని అంటుంది రేవతి. అయినా మీరిద్దరూ ఎవరికి వారు బతకాలని అనుకున్నారు కదా వెళ్ళిపోండి అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది రేవతి. అప్పుడు మురారి అమ్మ నేను నిజం చెబుతున్నాను నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం అని చెప్పడంతో రేవతి సంతోషపడుతూ ఉంటుంది. కృష్ణ అంటే నాకు ప్రాణం ఇప్పుడు తను నాకు ఎక్కడ నాకు దూరం అవుతుందని భయపడుతున్నా అని తెలుసా అనడంతో ఆ మాటలు విన్న రేవతి సంతోష పడుతూ ఉంటుంది.


ఇప్పుడు కూడా నాకు ఇక్కడ డ్యూటీ వెయ్యలేదు మా కమిషనర్ కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడి మరి ఇక్కడ వేయించుకున్నాను అని అంటాడు మరి. వాళ్లు అంతలా చెపుతున్న కూడా నేను వినిపించుకోకుండా కేవలం కృష్ణ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో ఆ మాటలు విన్నా రేవతి సంతోష పడుతూ ఉంటుంది. నాకు కృష్ణ కావాలి కృష్ణ లేకుండా బ్రతకలేనమ్మ అని ఎమోషనల్ అవుతూ తల్లిని హత్తుకుంటాడు మురారి. ఎలా అయినా నేను కలిపి తీరతాను అని రేవతి మాట ఇస్తున్నాను.


నీ మనసులో ఉన్న ప్రేమ బయటకు రావాలని ఆ మాటలు బయటకు చెప్పాలని నేను ఇంతసేపు అలా మాట్లాడాను అని అంటుంది రేవతి. అయినా దాన్ని నేను ఎలా వెళ్ళనిస్తాను అనుకున్నావు నా ఇంటి గడప దాటిస్తానా అనడంతో మురారి సంతోష పడుతూ ఉంటాడు. మరొకవైపు కృష్ణ ఏడ్చుకుంటూ బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు మురారి గురించి రేవతి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మురారి రేవతి ఇద్దరు కృష్ణ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణ అందరి లాంటి అమ్మాయి కాదు తన ప్రేమ ఆకాశం. అది ఒక పిచ్చిది అంటూ కృష్ణ గురించి తెగ పొగిడేస్తూ ఉంటుంది రేవతి. కృష్ణకు మనం తప్ప ఎవరూ లేరు తనకు తండ్రి తల్లి అన్ని నువ్వే అని అంటుంది రేవతి.


ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మీరు ఇద్దరు కలిసే ఉండాలి అని అంటుంది రేవతి. మేము ఎప్పటికీ కలిసే ఉంటాం కానీ కృష్ణ మనతో పాటు రావాలి కదా అమ్మ అనగా నా మీద నమ్మకం లేదా అని అంటుంది రేవతి. అప్పుడు రేవతి తన మనసులో కృష్ణ రాకపోతే నా కొడుకు ఏమైపోతాడో అని ఆలోచించుకుంటూ భయపడుతూ ఉంటుంది.. మరోవైపు కృష్ణ ఒక చోట నిలబడి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రేవతి కృష్ణని వెతుక్కుంటూ అక్కడికి వెళుతుంది. అప్పుడు కృష్ణ రేవతి అక్కడికి రాగానే మురారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అప్పుడు కృష్ణ మురారి గురించి తప్పు తప్పుగా మనసులో అనుకుంటూ ఉంటుంది.


ఇందులో కృష్ణకు ఫోన్ చేసి క్యాంపుకు రమ్మని చెప్పగా వెంటనే రేవతి ఆ మొబైల్ తీసుకొని కృష్ణ ఇక్కడికి రాదు మా ఇంటికి వస్తుంది అని చెప్పడంతో కృష్ణ షాక్ అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు అత్తయ్య నేను మీతో పాటు రాలేను నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది కృష్ణ. సరే నువ్వు మాతో పాటు రావద్దు మేమే మీ ఇంటికి వస్తాము అని అనడంతో కృష్ణ ఆశ్చర్యపోతుంది. అప్పుడు కృష్ణ మీకు అర్థం కావడం లేదు నేను ఏసీపీ సార్ మనసులో లేను అనడంతో ఒసేయ్ పిచ్చిదానా వాడు మనసులో ఉన్నది నువ్వే ఎవరో కాదు అని అంటుంది రేవతి. అప్పుడు మీరు అబద్ధం చెబుతున్నారు అని అంటుంది కృష్ణ.


నన్ను నమ్ము కృష్ణ ఈ విషయంలో ఎవరైనా అర్ధ అబద్దం చెబుతారా కృష్ణ ఏమి అర్థం కాక అయోమయంలో ఉంటుంది. ఏసీపీ సార్ వేరే అమ్మాయిని ప్రేమించారు అనగా అవన్నీ నాకు తెలియదు నాకు ఇప్పుడే వాడు చెప్పాడు వారి మనసులో నువ్వే ఉన్నావు నువ్వంటే వాడికి ప్రాణం అనడంతో కృష్ణ సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు సంతోషంతో రేవతిని హత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటుంది కృష్ణ. అప్పుడు కృష్ణ అయినా ఏసీపీ సార్ నాతో ఆ ప్రేమ విషయం ఏదో చెప్పొచ్చు కదా అని వాదిస్తూ ఉంటుంది.


also read it  : Prema Entha Madhuram August 25th: భర్త కంట పడకుండా పేరు మార్చుకున్న అను.. ఆర్యను మించి ఉన్న అభయ్ ఆలోచనలు?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial