Guppedantha Manasu August 28th: ఏంజెల్ రిషి దగ్గరికి వచ్చి నీకు ఒక సర్ప్రైజ్ అంటూ తనను పైకి తీసుకొని వెళుతుంది. అయితే మరోవైపు వసుధార కాస్త కంగారులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఏంజెల్ కు సలహా అయితే ఇచ్చాను కానీ వాళ్ళిద్దరూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నారంటే తట్టుకోలేకపోతున్నాను.. అసలేం జరుగుతుందో అని కంగారు పడితే ఏంజెల్ కి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ ఇంట్లో పనిచేసే ఆవిడ లిఫ్ట్ చేసి.. వారిద్దరూ డాబా మీదికి వెళ్లారని చెప్పటంతో వసు కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తుంది.


ఇక ఏంజెల్ రిషి ని పైకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాట్లు చేసి ఉంటాయి. వెంటనే రిషి ఏంటిది అంటూ కాస్త సీరియస్ గా ప్రశ్నిస్తాడు. వెంటనే నీకోసమే అరేంజ్ చేశాను.. ఇలా డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటే ఒకరి మనసులోని భావాలు ఒకరికి తెలుస్తాయని వసుధార చెప్పిందని చెబుతుంది. దాంతో వసుధార చెప్పిందా అని షాక్ అయ్యి అడుగుతాడు రిషి. ఇక తన అవును అని నీకెలా తెలుసు అని ప్రశ్నిస్తుంది.


ఇటువంటి ఐడియాలు తనకే వస్తాయని అంటాడు రిషి. ఇక తనతో కాసేపు ఇంతకుముందే నీకు చెప్పాను పెళ్లి ప్రస్తావన గురించి తీసుకొని రావద్దని.. నీ హద్దుల్లో నువ్వు ఉంటే బాగుంటుంది అని.. నాకు ఇలా ఒంటరిగా ఉండటమే ఇష్టం అని అక్కడి నుంచి వెళ్తుండగా వెంటనే తను ఆపి భోజనం చేయమని అంటుంది. దానితో రిషి కోపంగా.. నీకు సలహా ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి భోజనం చెయ్యు అంటూ అక్కడి నుంచి వెళ్తాడు.


ఆ తర్వాత వసు రిషి ని కలిసి మాట్లాడుతుంది. ఎందుకు రమ్మన్నారు సార్ అని అడుగుతుంది వసు. దాంతో రిషి కాస్త ఆవేశంగా.. ఎందుకు లేనిపోని ఐడియాలు ఇచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని క్యాండిల్ నైట్ డిన్నర్ గురించి మాట్లాడుతాడు. దాంతో వసు డిన్నర్ చేసి వచ్చాక ఈ విషయం అడుగుతారా అని ప్రశ్నించడంతో వెంటనే రిషి షెటప్.. నేను డిన్నర్ చేయడానికి అక్కడ ఉన్నది మీరు కాదు కదా అని అంటాడు.


దాంతో వసు ఇక రిషికి తనతో డిన్నర్ చేయడం ఇష్టమే అని అర్థం చేసుకొని మీ మనసులో నేను కచ్చితంగా ఉన్నాను సర్ అంటుంది. ఇక రిషి అటువంటిది ఏమీ లేదు నేను ఎప్పుడు ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడతాను అనటంతో మరి ఏంజెల్ తో ఎందుకు డిన్నర్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది. ఇక ఆ ప్రశ్నలకు చిరాకు పడిన రిషి.. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంకెప్పుడు తనకి ఇటువంటి సలహాలు ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు.


ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఏంజెల్ వసు ఇంటికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. తను డిసప్పాయింట్ అవ్వటంతో.. ఏం బాధపడకు మళ్లీ ప్రయత్నించు అంటూ సలహా ఇస్తుంది వసు. ఇక ఏంజెల్ మీరు నాకు మంచి సలహాలు ఇస్తున్నారు కానీ ఒకటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు.. నా పద్ధతి   బాగుండటం లేదేమో అని బాధపడుతుంది. ఇక తర్వాత తనే కూల్ అయ్యి ఇంకొక ప్లాన్ చేసి.. రిషి మనసులో ఏముందో తెలుసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్తుంది.


తను వెళ్ళిన తర్వాత వసు తన మనసులో.. ఏంజెల్ కి సారీ చెప్పుకుంటూ.. నీకోసం కాదు రిషి సార్ కోసం హెల్ప్ చేస్తున్నాను.. ఆయన మనసులో నేను ఉన్నానా లేదా అని తెలుసుకోవడం కోసం ఇలా చేస్తున్నాను..  మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలిసినప్పుడు నువ్వు ఎలా ఫీలవుతావో అని బాధపడుతున్నాను అని అనుకుంటూ బాధపడుతుంది వసు. ఆ తర్వాత వసు కు మహేంద్ర వర్మ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే రిషి ఆ ఫోన్ లాక్కొని ఇక్కడి విషయాలన్ని అక్కడ చేరవేస్తున్నారా అంటూ కోపంగా అడుగుతాడు.


వెంటనే రిషి నాకు కానీ మా గురువుకి గానీ అటువంటి అలవాటు లేదు.. నేను మహేంద్ర సార్ తో మాట్లాడుతున్నాను.. మిషన్ ఎడ్యుకేషన్ గురించి చర్చించుకుంటున్నాము అనటంతో వెంటనే రిషి దాని గురించి నీతో ఎందుకు మాట్లాడటం అని ప్రశ్నిస్తాడు. దాంతో వసు నాకు ఫోన్ చేసిన వాళ్లని మీరు ఫోన్ చేసి అడగండి అని అనటంతో అప్పుడే అక్కడికి పాండ్యన్   వాళ్ళు వస్తారు. దాంతో రిషి అక్కడి నుంచి వెళ్లిపోగా.. వసు తన మనసులో మీ కళ్ళల్లో కోపం స్థానంలో  ప్రేమని ఎప్పుడు చూస్తానో అని బాధపడుతుంది.


also read it : Prema Entha Madhuram August 26th: అనుని బెదిరించిన ఛాయ, మాన్సీ.. ఆర్యను స్కూల్ లో చూసి షాకైన అను?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial