Prema Entha Madhuram August 25th: మాన్సీ శారదమ్మ ఇంటికి వచ్చి తన మాజీ భర్తతో.. ఏంటి నేను నిన్ను, నీ ఫ్యామిలీని మానసికంగా హింసిస్తున్నానా.. అందుకని వీలైనంత త్వరగా విడాకులు ఇప్పించమని పిటిషన్ పెట్టుకున్నావా అని అడుగుతుంది. అంటే మిమ్మల్ని నేను అంత హింసిస్తున్నానా అని అనడంతో.. వెంటనే నీరజ్ అవును అని నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో సాకులు చెప్పి విడాకులు రాకుండా చేస్తున్నావు అంటూ కోపంగా అరుస్తాడు.


విడాకులు వస్తే మేము సంతోషంగా ఎక్కడ ఉంటామో అని విడాకులు రాకుండా చేస్తున్నావు అని కోపంగా అరుస్తాడు. వెంటనే అంజలి కూడా ఆర్య సర్ ని అనుని విడదీసినందుకు ఆ దేవుడు నిన్ను నీ భర్త నుండి విడదీశాడు అని అంటుంది. దాంతో మాన్సీ ఒకవేళ విడాకులు వచ్చినా కూడా మీ ఇద్దరి సంతోషంగా ఉండనివ్వను అని పొగరుగా అంటుంది. ఇక శారదమ్మ కోపంగా తనని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది.


వెంటనే మాన్సీ అంజలితో ఈ ఇంటికి కోడలు అయినందుకు సంతోషపడుతున్నావేమో.. కానీ వర్ధన్ ఫ్యామిలీ కోడళ్ళకు సంతోషం అనేది పర్మినెంట్ గా ఉండదు. అత్తయ్య కు చిన్నప్పుడే భర్త చనిపోయాడు తనకు సంతోషం లేదు.. అనుకి భర్త ఉన్నా కూడా లేనట్లే.. తనకు కూడా సంతోషం లేదు అంటూ.. ఇక నా సంగతి కూడా అలాగే ఉంది.. రేపు కూడా నీ సంగతి ఇలాగే ఉంటుంది అనటంతో.. వెంటనే శారదమ్మ నోరు ముయ్యి అంటూ ఇది దేవుడు రాసిన రాత అని.. ఈ పరిస్థితులకు కారణం నువ్వే అని కోపంగా అరిచి తనను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మర్యాదగా చెబుతుంది.


దాంతో మాన్సీ వెళ్తాను నన్ను చీకొట్టిన ఈ ఇంటికి మళ్ళీ మహారాణిలా వస్తాను అని అంటుంది. వెంటనే నీరజ్  మహారాణిలా కాదు పనిమనిషిగా కూడా రాలేవు అంటూ గెట్ అవుట్ అని పంపించేస్తాడు. ఇక అంజలి తన అత్తకు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండని అంటుంది. ఇక శారదమ్మ ఇంట్లో అను లేకపోయేసరికి సంతోషాలు,  మనశ్శాంతి లేకుండా పోయిందని బాధపడటంతో వెంటనే నీరజ్ ఎటువంటి టెన్షన్ పడకమ్మా త్వరలోనే వదినమ్మ వస్తుంది అందరం సంతోషంగా ఉంటామని ధైర్యం చెబుతాడు.


సీన్ కట్ చేస్తే అభయ్ వాళ్ళ స్కూల్లో కొందరి పిల్లలు గేమ్స్ గురించి ఆడుకుంటూ ఉండగా అక్కడికి అభయ్, అక్షర ఇద్దరు వస్తుంటారు. అదే సమయంలో ఆ పిల్లలు చెస్ గేమ్ లో ఓడిపోతావ్ అన్న భయం ఉందా అని అడగటంతో.. అభయ్ తను ఓడిపోను అంటూ.. ప్రతి సండే తన తల్లితో ఈ గేమ్ ఆడతాను అని అంటాడు. ఎవరైనా అమ్మతోని ఆడతారా అయిన డాడ్ లేడు కదా అని అనటంతో వెంటనే అభయ్ వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.


అప్పుడే అక్కడికి టీచర్ వచ్చి ఇక్కడికి ఒక పెద్ద చీఫ్ గెస్ట్ వస్తున్నారు అని మీరు గేమ్స్ లో గెలిస్తే ఆయన మీకు గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ చేస్తారు అని చెప్పి వారిని అక్కడ నుంచి పంపిస్తుంది. ఇక అభయ్ తో కాంపిటీషన్ గురించి నువ్వేం చెప్పవ్ ఏంటి అనడంతో ఎందులోనైనా  గెలవాలంటే ముందు మన పైన మనకి నమ్మకం ఉండాలి అని అమ్మ చెప్పిందని.. నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు.. గెలిచి చూపిస్తానని సవాల్ విసిరి అక్కడి నుంచి వెళ్తాడు.


ఆ తర్వాత అభయ్ చెస్ బోర్డు చూస్తూ ఆ గోల్డ్ మెడల్ గెలిచి అమ్మకి గిఫ్ట్ చేసి.. అమ్మే నాన్నని వాళ్లకు బుద్ధి చెప్పాలని పట్టుదలతో కనిపిస్తాడు. మరోవైపు అను ఇంట్లో వంట చేస్తూ ఉండగా అక్కడికి పని ఆవిడ వచ్చి ఆలస్యమైందమ్మ మీరు జరగండి నేను వంట చేస్తాను అని అంటుంది. దాంతో అను ఏమి వద్దు.. పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను.. పెద్ద ఆర్డర్ వచ్చింది త్వరగా పచ్చడి పెట్టమని చెబుతుంది.


దాంతో ఆవిడ సరే అని.. తిరిగి అనుతో నూనె కాస్త తక్కువ వెయ్యమని చెబుతుంది. ఎందుకు అని అను ఆశ్చర్యంగా అడగడంతో.. మొన్న అభయ్ నేను చేసిన ఉప్మాలో కాస్త నూనె ఎక్కువ అయిందని తను చదివే బుక్స్ అన్ని తీసుకువచ్చి ఆరోగ్యాల గురించి చెప్పాడు అని అనటంతో అను నవ్వి అచ్చం తన నాన్న అని మాట ఆపేసి తన టీచర్ చెప్పినట్లు వింటాడు అని చెబుతుంది.


ఇక అక్షర పాప గురించి కూడా చెబుతూ మీ ఇద్దరూ పిల్లలు రత్నాలు అంటూ పొగుడుతూ ఉంటుంది. అప్పుడే ఒక ఆవిడ రాధ అని పిలవగా బయటికి వస్తుంది. అంటే అను రాధ అని పేరు మార్చుకుందని అర్థమవుతుంది. ఇక ఆవిడ తన బాబుకు పాలు కావాలి అని అడగటంతో వెంటనే అను ఇంట్లోకి వెళ్లి చూడగా కొన్ని పాలు ఉండటంతో ఆ పాలు మొత్తం ఇచ్చేస్తుంది.


వెంటనే తన ఇంట్లో పనిచేసే ఆవిడ అందరికీ అన్ని ఇస్తుంటావు ఎందుకు అనటంతో అను ఆమె భర్త బాగా తాగేసి వస్తాడు అని ఆమె పడే బాధ గురించి చెబుతూ ఉండటంతో వెంటనే ఆవిడ.. మీది చాలా మంచి మనసు అమ్మా అంటూ పొగుడుతుంది. ఇక స్కూల్లో టీచర్ పిల్లలకు చీఫ్ గెస్ట్ వస్తున్నారు అని ఆయన గురించి గొప్పగా చెబుతుంది.


ఆ తర్వాత పిల్లలను గేమ్స్ ఆడుకోమని చెప్పి పంపిస్తుంది. అక్షర అక్కడి నుంచి వెళ్తుండగా తన అన్నయ్యని బాధ పెట్టిన పిల్లలకు ఎదురుపడి అందులో ఒక పిల్లోడిని కిందపడేస్తుంది. అంతేకాకుండా వాళ్లపై అరుస్తూ ఉండటంతో అభయ్ వాళ్ళకు సారీ చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత వారిద్దరు వచ్చే చీఫ్ గిఫ్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.


ఇక అక్కడే ఉన్న ఆర్య వర్ధన్ ఫోటో చూసి కప్ గెలిచి ఆయనతో ఫోటో దిగాలి అని అనుకుంటుంది అక్షర.  దాంతో అభయ్ గెలవడం కోసం గేమ్ ఆడాలి కప్పు కోసం కాదు అని.. ముఖ్యంగా ఆ వచ్చే పర్సన్ కోసం కాదు అని అచ్చం ఆర్య వర్ధన్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ టీచర్ వచ్చి  హ్యాండ్ క్రాఫ్ట్ చేసివ్వమని అది చీఫ్ గెస్ట్ కి ఇవ్వాలి అని అనటంతో దానికి అభయ్ సరే అంటాడు.


ఆ తర్వాత ఛాయ మాన్సీ ఐదు సంవత్సరాల నుంచి అను గురించి వెతుకుతున్నాం కానీ దొరకట్లేదు.. ఆర్యను ఓడించాలనుకున్న కూడా గెలుస్తూనే ఉన్నాడు అని అంటుంది. మాన్సీ కూడా అను గురించి మాట్లాడుతుంది. తను ఆర్య గెలవడం కోసం ఏదైనా చేస్తుంది అని అంటుంది. ఇక ఛాయ సారీ ఎలాగైనా అనుని పట్టుకోవాలి అని పొగరుగా చెబుతుంది. వెంటనే మాన్సీ వర్ధన్ ఫ్యామిలీతో గొడవ పడటానికి నాకు ఒక కారణం ఉంది కానీ నువ్వెందుకు గొడవ పడుతున్నావు అని అడుగుతుంది. ఈ ప్రశ్న నేను చాలా సార్లు అడిగాను కానీ నువ్వు ఎప్పుడూ చెప్పలేదు ఎప్పుడైనా చెబుతావా అని అడుగుతుంది.


Also read : Krishna Mukunda Murari August 24th: కూతురి ప్రేమ గురించి శ్రీనివాస్ భవానికి నిజం చెప్పాడా.. ముకుంద, మురారి ఫోటో చూసేసిన నందు?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial