రిషి కాలేజ్ రాగానే పాండ్యన్ బ్యాచ్ ఎదురపడతాడు. పవర్ ఆఫ్ స్టడీస్ గురించి మాట్లాడదామని చెప్తాడు. కాలేజ్ అయిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడదామని అంటాడు. అప్పుడే వసుధార కాలేజ్ కి వస్తుంది. డల్ గా ఉన్నారు ఏమైంది సర్ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. పెళ్లి చేసుకోవాలంట పెళ్లి ఈ పొగరు బోడి సలహా ఇచ్చిందని తిట్టుకుంటాడు. కావాలని వసు గిఫ్ట్ గా ఇచ్చిన బ్రేస్ ని సరిచేసుకుంటాడు. అది చూసి మురిసిపోతుంది.


అసలు నా చుట్టు ఏం జరుగుతుంది. వసుధార ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది. ఒకప్పుడు నా పక్కనే ఉండేది. ఇప్పుడు పెళ్లి చేయడానికి నా పక్కనే ఉంటుంది. అసలు ఏం చేస్తుందో తనకైన అర్థం అవుతుందా అని ఆలోచిస్తూ ఉండగా పాండ్యన్ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఎప్పుడూ లేనిది ఏంటి కొత్తగా అంటాడు. తలనొప్పి అన్నారు కదా అందుకే తీసుకొచ్చానని పాండ్యన్ కవర్ చేస్తాడు. కానీ రిషి మాత్రం నమ్మడు. తనే తీసుకొచ్చానని ట్యాబ్లెట్ కూడా వేసుకోమని ఇస్తాడు. ఇదంతా చాటుగా వసు చూస్తూ ఉంటుంది. రిషి కాఫీ తాగగానే అది వసు పెట్టిందని అర్థం అవుతుంది. ట్యాబ్లెట్ తిరిగి ఇచ్చేసి ఎవరు పంపించారో వాళ్ళకి ఇవ్వమని అంటాడు. ఏంజెల్ డల్ గా ఉండటం చూసి ఎందుకు అలా ఉన్నావని విశ్వనాథం అడుగుతాడు.


ఏంజెల్: రిషి ఈ మధ్య ఎందుకో డల్ గా ఉంటున్నాడు


విశ్వం: అవును మార్నింగ్ నేను కూడ గమనించాను ఏదో విషయంలో బాధపడుతున్నాడు


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: నిజం తెలిసి ఏంజెల్ మీద అరిచిన రిషి- మిస్టర్ ఇగోకి ప్రేమలేఖ రాసిన వసుధార


ఏంజెల్: అది తెలుసుకోవడానికి ట్రై చేద్దామని మాట్లాడుతుంటే టాపిక్ డైవర్ట్ చేసి వెళ్లిపోతున్నాడు


విశ్వం: ఒకవేళ ఆ విషయం నీతో పంచుకోవడం ఇష్టం లేదేమో


ఏంజెల్: నాతో పంచుకోవడానికి కూడ ఇష్టం లేనివి ఏముంటాయ్


విశ్వం: గతం ఉంటుంది ఆ విషయం చెప్పాల్సింది అయితే ఏదో ఒకరోజు రిషి తప్పకుండా చెప్తాడు. నువ్వు పదే పదే అడిగి తనని ఇబ్బంది పెట్టకు. ఇంతకీ నీ పెళ్లి గురించి ఏం ఆలోచించావ్. ఎవరిని నిర్ణయించుకున్నావ్


ఏంజెల్: చెప్తాను నాకు కొన్ని రోజులు టైమ్ కావాలి


విశ్వం: నీ పెళ్లి నేను త్వరగా చేయాలి అదే నా కోరిక


రిషి క్యాబిన్ కి వసు ఫైల్ పట్టుకుని వస్తుంది. ఏంజెల్ మెసేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరూ కాసేపు వాదులాడుకుంటారు. రిషి కోపంగా మాట్లాడుతుంటే వసు మాత్రం తిక్క తిక్క సమాధానాలు చెప్తూ విసిగిస్తుంది. ఫైల్ ఇచ్చి చూడమని అంటుంది.


రిషి: ఫైల్ చూసి రాత్రంతా నిద్రపోకుండా పని చేశారా?


వసు: అవును మా ఇంటి మీద నిఘా పెట్టారా?


రిషి: నిఘా పెట్టాల్సిన పని లేదు మీ కళ్ళు చూస్తే అర్థం అవుతుంది. రాత్రంతా మీరు మేల్కోనే ఉన్నారని


వసు: నా కళ్ళు ఇంకా ఏం చెప్తున్నాయ్ సర్. నా కళ్ళు ఇంకా చాలా చెప్తున్నాయ్ అవి అర్థం కావడం లేదా? నా కళ్ళలోని బాధ, ప్రేమ కనిపించడం లేదా?


రిషి: పని గురించి మాట్లాడండి మేడమ్. అయినా మీరు చేసిన పనికి మీకు నిద్రపట్టదు, నాకు నిద్రపట్టదులే


Also Read: అమ్మాకొడుకుని ఏకిపారేసిన శుభాష్- అత్తింట్లో తిరిగి అడుగుపెట్టిన కావ్య


కాఫీలు పంపించడం మానేయమని సీరియస్ గా చెప్తాడు. మళ్ళీ వసు తిక్క సమాధానాలు ఇస్తూ ఉంటుంది. కాఫీ ఇచ్చినందుకు థాంక్స్ చెప్తాడు. తాగినందుకు వసు కూడా తిరిగి థాంక్స్ చెప్తుంది. ఇగో మాస్టర్ ప్రేమ మాత్రం కనిపించకుండా బాగానే కవర్ చేసుకుంటాడు. ఏంజెల్ కాలేజ్ కి వచ్చి వసు మీద ఫైర్ అవుతుంది. కాల్ చేస్తుంటే ఎందుకు ఏవాయిడ్ చేస్తున్నావని అడుగుతుంది. బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేదని అంటుంది. ఏంజెల్ వసుతో మాట్లాడటం చూసి రిషి కాల్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావ్ అంటే కాలేజ్ లో అని చెప్తుంది. వసుతో మాట్లాడటానికి వచ్చానని చెప్తుంది. రిషి ఏంజెల్ తో మాట్లాడటం చూస్తే మరింత కోపం పెరిగిపోతుందని అనుకుని తన దగ్గర నుంచి వెళ్లిపోవడానికి తెగ ట్రై చేస్తుంది. కానీ ఏంజెల్ మాత్రం జిడ్డులాగా పట్టుకుని వదలదు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏ చర్చ జరుగుతుందో? ఆ చర్చ ఏ రచ్చకి దారి తీస్తుందో ఏమోనని రిషి టెన్షన్ పడతాడు.