కార్తీకదీపం జులై 22 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam july 22 Episode 1411)

బోనాలు పండుగ చేసుకున్న సౌందర్య కుటుంబం అంతా అమ్మవారికి తమ మనసులో కోరికలు చెప్పుకుంటారు. ఏదైనా మనసులో అనుకుని చీటీ రాసి ఆ హుండీలో వేస్తే ఎప్పటికప్పుడు అవి అమ్మవారి దగ్గర పోస్తామని ఆ కోరికలు నెరవేరుతాయని చెబుతాడు పూజారి.నిజంగా తీరుతాయా అని ప్రేమ్ అడిగితే తప్పకుండా తీరుతాయని చెబుతాడు పూజారి. ఆ తర్వాత ఒక్కొక్కరుగా సౌందర్య ఫ్యామిలీ వాళ్లు వెళ్లి చీటీ రాసి అందులో వేస్తారు. ఎవరు ఏం రాశారంటే...సౌందర్య-ఆనందరావు: కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి, మనవరాళ్లిద్దరూ కలవాలిహిమ: నిరుపమ్ బావకి శౌర్యకి పెళ్లి జరగాలిశౌర్య: అమ్మా నాన్న తిరిగిరావాలినిరుపమ్: నాకు హిమకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరగాలిప్రేమ్: నాకు-హిమకు పెళ్లి జరగాలిఆ తర్వాత అందరూ వెళ్లిపోతారు. ప్రేమ్ అక్కడే నిలబడగా నాకు ప్రసాదం తీసుకునిరా అని చెప్పి అక్కడి నుంచి ప్రేమ్ ను పంపించి ఆ తర్వాత శౌర్య రాసిన చీటీని చదువుతుంది.అందులో శౌర్య అమ్మానాన్న రావాలి అని రాసి ఉంటుంది. ఆ తర్వాత హిమ  వెళ్లి శౌర్యతో మాట్లాడేందుకు ప్రయత్నించినా విసుక్కుంటుంది. హిమ: నీకు నిరుపమ్ బావకీ మధ్య ఎవరు రాకుండా నేను చూసుకుంటాను మీ ఇద్దరికీ నేను పెళ్లి చేస్తాను శౌర్య: నీ టార్చర్ భరించలేకపోతున్నాను..ఇప్పటికిప్పుడు నిరుపమ్ బావ వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పినా కూడా వద్దంటాను

Also Read: హుండీలో శౌర్య వేసిన చీటీ తీసి చదివి షాక్ అయిన హిమ, రౌడీ బేబీని గెలిపించే పనిలో ప్రేమ్

నిరుపమ్, ప్రేమ్ ఇద్దరూ వెళుతూ బోనాలు పండగు, శౌర్య గురించి మాట్లాడుకుంటూ వెళుతుంటారు. శౌర్య టాపిక్ తీసిన ప్రేమ్ పై విరుచుకుపడతాడు నిరుపమ్. నేను మొదట్నుంచీ ఒకేమాటపై ఉన్నాను..హిమనే పెళ్లిచేసుకుంటాను అని క్లారిటీ ఇస్తాడు. వీళ్లిద్దర్నీ కలపమని హిమ అడిగింది కానీ ఎలా సాధ్యమవుతుందో ఏమో అనుకుంటాడు ప్రేమ్. అటు సౌందర్య, ఆనంద్ రావు ఇద్దరూ శౌర్య-హిమను కలిపేందుకు ప్లాన్ చేసుకుంటూ కారు, ఆటో టైర్లలో గాలి తీసేస్తారు. అలా చేస్తే ఇద్దరూ ఇంట్లో ఉండేలా చేయొచ్చని ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇద్దరూ మాట్లాడుకుంటుండగా శౌర్య వస్తుంది.  ఆటో స్టార్ట్ చేసి గాలిలేకపోవడం గమనిస్తుంది. వేరేవాళ్లకి కాల్ చేసి స్టెప్నీ టైర్ పంపించమని చెబుతుంది. దీంతో ప్లాన్ ఫెయిలైనందుకు ఫీలవుతారు సౌందర్య ఆనందరావు.

Also Read: అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే - సరికొత్తగా మళ్లీ వసుకి ప్రపోజ్ చేసిన రిషి

స్వప్న-ప్రేమ్వాడంటే డాక్టరయ్యాడు పెళ్లి చేసుకోబోతున్నాడు మరి నీ సంగతేంటని అడుగుతుంది స్వప్నప్రేమ్: చాలామంది లైఫ్ లో సెటిలయ్యావా అని అడుగుతుంటారు..సెటిలవడం అంటే లైఫ్ లో ఏమీలేనట్టే కదాస్వప్న: జీవితంలో ఓ క్లారిటీ ఉండాలిప్రేమ్: కొన్ని విషయాల్లో క్లారిటీ అదే వస్తుందిస్వప్న: మీ డాడీ దగ్గర పెరిగి ఇలా తయారయ్యావ్..నా దగ్గర పెరిగి వాడెంత చక్కగా ఉన్నాడో చూడుప్రేమ్: ఏదో ఓ రోజు నేషనల్ లెవెల్ ఫొటో గ్రాఫర్ అవుతాను...ఇంతలో అక్కడకు శోభ వస్తుందిఒంటరిగా ఆలోచిస్తున్న నిరుపమ్ దగ్గరకు వెళ్లిన శోభ..కాఫీ షాక్ కి తీసుకెళుతుంది. 

Also Read:  శౌర్య-నిరుపమ్ ని కలపబోతున్న బోనాలు పండుగ, ప్రేమ్ తన మనసులో మాట హిమకు చెబుతాడా!

రేపటి(శనివారం) ఎపిసోడ్ లోప్రేమ్,హిమ కలసి నిరుపమ్-శౌర్యను కలిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత సౌందర్య ఇంటికి నిరుపమ్ రావడం చూసి శౌర్య బయటకు వెళ్లిపోతుంది.