రత్నం వేదని ఇంటికి రమ్మని పిలిస్తే సున్నితంగా రానని చెప్తుంది. నాన్న స్వయంగా వెళ్ళి బతిమలాడిన రానని చెప్పిందని యష్ కోపంతో ఊగిపోతాడు. ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేశాం కదా వెన్నకి రావచ్చు కదా ఇంకేంటి ప్రాబ్లెమ్ అని యష్ అరుస్తాడు. ఒక భార్య ఒక భర్త నుంచి కోరుకునే ఎఫ్ఫెక్షన్ తను నీ దగ్గర నుంచి కోరుకునేది. మేము ఎన్ని రకాలుగా బతిమలాడిన రాలేదు ఒక్కసారి నువ్వు వెళ్ళి బతిమలాడి చూడు నువ్వు తిరిగొచ్చేసరికి నీకు ఇంట్లో ఎదురు వస్తుంది అది భార్య అంటే అని రత్నం అంటాడు. అప్పుడే ఖుషి అక్కడికి వచ్చి నువ్వు మమ్మీని ఇంట్లో నుంచి ఎందుకు పంపించేశావ్ నీతో కటీఫ్ అని అంటుంది. ఎక్కడికి వెళ్ళిన మమ్మీ నీకు చెప్పే వెళ్తుందిగా, మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా నువ్వు వెళ్ళి మమ్మీని పిలుచుకుని రా అని అడుగుతుంది. నువ్వు మమ్మీని మిస్ అవుతున్నవా లేదా అని ఖుషి యష్ ని అడుగుతుంది. మమ్మీ కూడా మనల్ని మిస్ అవుతుంది తెలుసా.. నువ్వు ఒక్కసారి మమ్మీ దగ్గరకి వెళ్ళి మిస్ యు అని చెప్పు డాడీ వచ్చేస్తుంది ప్లీజ్ డాడీ అని బతిమలాడుతుంది.
Also Read: అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే - సరికొత్తగా మళ్లీ వసుకి ప్రపోజ్ చేసిన రిషి
వేద దగ్గరకి ఖుషి వస్తుంది. నువ్వు, డాడీ, నేను ఒక పార్టీ కదా మరి ఎందుకు మమ్మల్ని వదిలేసి ఇక్కడికి వచ్చావ్ మన ఇంటికి వెళ్దాం రామ్మా, నాకు డాడీకి నువ్వు కావాలమ్మా రామ్మా నేను పిలిచినా రావా అని బతిమలాడుతుంది. అది చూసి వేద కుమిలిపోతుంది. డాడీ నీకు వద్దా అని అడుగుతుంది. మీ డాడీని వద్దనుకోలేదమ్మా, మి దాడినే నన్ను వద్దనుకున్నారు నీకు నేనెమని చెప్పెదమ్మా అని వేద మనసులో మథనపడుతుంది. నాకు ఇంక కోపం వస్తుంది నేను 1..2..3 లెక్కబెడతాను నువ్వు మనింటికి వచ్చే పని అయితే ఖుషి అని పిలువు అప్పుడు వెనక్కి వచ్చి నీకు ముద్దు పెడతా రావడం నీకు ఇష్టం లేదని, డాడీ, నేను వద్దనుకుంటే పిలవకు అని ఖుషి అమాయకంగా అడుగుతుంది. ఎందుకు దేవుడా నాకు ఇంత పెద్ద శిక్ష వేశావ్ఖు, అమ్మా ఖుషి నాకు కూడా నువ్వు కావాలమ్మా, దేవుడా ఇటువంటి పరిస్థితి ఎందుకు కల్పించావ్ దీని కంటే నా గుండె ఆగిపోయిన బాగుండేది అని మనసులోనే అల్లాడిపోతుంది. ఇక ఖుషి వెళ్తూ 1..2..3 లెక్కబెడుతుంది కానీ వేద మౌనంగా ఉండిపోతుంది. ఖుషి వెళ్లిపోవడంతో కుమిలి కుమిలి ఏడుస్తుంది. వేదతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ ఖుషి నడుచుకుంటూ అపార్ట్మెంట్ బయటకి వెళ్ళిపోతుంది.
Also Read: మాధవ మీదకి చెయ్యెత్తిన రాధ, మాధవనే తన నాయన అన్న దేవి - ఆవేదనలో సత్య
మాలిని ఖుషి కోసం ఇల్లంతా వెతుకుతుంది కానీ కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతుంది. యష్ ఖుషి కోసం బొమ్మలు తీసుకొచ్చి తనని పిలుస్తాడు. మాలిని వచ్చి ఖుషి కనిపించడం లేదని చెప్తుంది. వేద దగ్గర కూడా లేదని రత్నం చెప్తాడు. యష్ వచ్చి వేదని ఖుషి గురించు అడుగుతాడు. నిన్ను రమ్మని పిలిచిందా నువ్వు రాను అన్నావా అంటాడు. అవును అంటుంది. పసి పిల్ల అడిగింది కదా వచ్చి ఉండొచ్చు కదా నీకు ఖుషి కంటే నీ ఇగోనే ఎక్కువా, నా కూతురు నా కూతురు అంటావ్ కదా దాని కోసం కూడా రాలేకపోయావా అని అరుస్తాడు. ఖుషి ఇంటికి రాలేదని చెప్పడంతో వేద కూడా టెన్షన్ పడుతుంది. నా ఖుషి నన్ను వదిలిపెట్టి వెళ్ళింది అంటే అది నీ వల్లే తనకి ఏదైనా జరిగితే నిన్ను క్షమించను అని కోప్పడతాడు. ఇంటికి వచ్చి ఖుషిణి ఎవరయినా ఏమైనా అన్నారా అని మాలిని వాళ్ళని నిలదీస్తాడు. దీంతో కాంచన అన్న మాటల గురించి చెప్పడంతో చిన్నపిల్లతో అలాగేనా మాట్లాడేది అని తిడతాడు. ఇక వేదని మళ్ళీ యష్ తిడతాడు. అది నిన్ను ఇంటికి రమ్మనది కదా వచ్చి ఉండొచ్చు కదా ఎందుకు రాలేదని అంటాడు. రాకపోవడం నా తప్పే కానీ నేను లేకపోతే మీరు ఒక్కరోజు కూడా ఖుషిని చూసుకోలేకపోయారు ఇదేనా మీ బాధ్యత అని వేద యష్ ని నిలదిస్తుంది. ఇద్దరు రోడ్ల మీద ఖుషి కోసం వెతుకుతూ ఉంటారు.
తరువాయి భాగంలో..
యష్ ఆవేశంగా అభిమన్యు ఇంటికి వచ్చి ఖుషి ఎక్కడా అని తన కాలర్ పట్టుకుంటాడు. ఎక్కడ దాచావ్ అని అడుగుతాడు. నాకేం తెలుసని అభిమన్యు అంటాడు. నువ్వు చెప్పేది అబద్ధం చేసేది మోసం అని యష్ అరుస్తాడు. నీ బెదిరింపులకి భయపడనని అంటాడు. దాచిపెట్టాల్సిన ఖర్మ మాకేంటి తను నా కన్న కూతురు మీకు గంట టైం ఇస్తున్నాను ఖుషి ఎక్కడ ఉందో వెతికి పట్టుకుని ఆ న్యూస్ నాకు చెప్పాలి లేదంటే మి మీద కేసు పెడతానని మాళవిక వార్నింగ్ ఇస్తుంది.