Karthika Deepam 2 Serial Today November 16th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ మాత్రమే నా కూతురికి తండ్రి.. ఆ మాట అంటే చెప్పుతో కొడతా..: జ్యోత్స్నకి దీప వార్నింగ్  

Karthika Deepam 2 Serial Today Episode పెళ్లి అయి కూతురు ఉన్న దీపని కార్తీక్ పెళ్లి చేసుకున్నాడనే కారణంతో జ్యోత్స్న పెళ్లి క్యాన్సిల్ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న, దీపని కలుస్తుంది. తన బావని తనకు వదిలేయమని శౌర్యని కూతురిలా చూసుకుంటానని చెప్తుంది. బ్లాంక్ చెక్ ఇచ్చి ఆస్తి మొత్తం తీసుకొని దీపని వెళ్లిపోమని అంటుంది. జ్యోత్స్న డీల్‌కి దీప సరే అంటుంది. దాంతో జ్యోత్స్న హ్యాపీగా ఫీలవుతుంది.  

Continues below advertisement

జ్యోత్స్న: చెప్పు దీప నీకు ఎంత కావాలి.
దీప: నేను అడిగినంత నువ్వు ఇవ్వగలవా.
జ్యోత్స్న: మా బావ కోసం నా ఆస్తి మొత్తం ఇవ్వమన్నా ఇచ్చేస్తా.
దీప: నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా తాళి అమ్ముకున్నా అనుభవం లేదు అందుకే మీ నానమ్మ దగ్గరకు వెళ్లి నీ ఐదోతనం ఎంతకు అమ్ముతావు అని అడుగు అప్పుడు మనం మాట్లాడుకుందాం. 
జ్యోత్స్న: దీపా
దీప: చెప్పు తీసి కొడితా నోటి నుంచి మాట వస్తే ఏమనుకుంటున్నావ్ ఐదో తనం అంటే లాగిపెట్టి కొట్టానంటే బుర్ర పని చేయడం మానేస్తుంది. నా కూతురికి నువ్వు తల్లి అవుతావా ముందు మీ అమ్మకి కూతురు అవ్వు. నువ్వు కొనాలి అనుకున్న ప్రతీది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండరు. నా కూతిరికి తండ్రులు మారారు. తల్లిలు మారితే తప్పేంటి అన్నావ్ కదా నా కూతురికి తండ్రులు మారలేదు కార్తీక్ బాబే నా కూతురికి తండ్రి. అది నాన్న అని మొదటి సారి పిలిచింది కార్తీక్‌ బాబే. నా కూతురికి నాన్న కార్తీక్ బాబునే. నేను బతికి ఉన్నంత వరకు దానికి తల్లి అవసరం లేదు. ఇలాంటి పిల్ల వేషాలు వేయకుండా పోయి పాలు తాగి మీ నానమ్మ ఒడిలో బజ్జో. మరోసారి నాకు కాల్ చేస్తే హాస్పిటల్‌కి వెళ్తావ్. జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చి వెటకారంగా సెల్యూట్ చేసి దీప వెళ్లిపోతుంది.

శ్రీధర్ రిసెప్షన్‌లో జరిగిన అవమానాన్ని తలచుకొని బాధ పడుతూ ఉంటే కావేరి వచ్చి బాధ పడొద్దు అని అంటుంది. ఇద్దరూ తగులు కుంటారు. దీపని చూస్తుంటే నాకు మండిపోతుందని పైగా అది నా మేనకోడలిని తిట్టిందని మండిపోతాడు శ్రీధర్. ఇక కావేరి భర్తతో మిమల్ని పిలిచింది మీకూతురు రిసెప్షన్ మీ కొడుకుది. మీ మేనకోడలిని కొట్టింది మీ కోడలు మిమల్ని తిట్టింది మీ అత్త ఇందులో నాకు ఏం సంబంధం ఉందని నన్ను అంటున్నారు అని అంటుంది. ఇక మీకు కాఫీ ఇవ్వడం కూడా వేస్ట్  అని కాఫీ తీసుకెళ్లిపోతుంది. 

మరోవైపు రిసెప్షన్‌లో జరిగినది తలచుకొని కాశీ ఆలోచిస్తూ ఉంటారు. కాశీ దగ్గరకు స్వప్న, దాసు ఇద్దరూ వస్తారు. కాశీ తనకు నానమ్మతో పాటు జ్యోత్స్న అక్క అంటే కూడా ఇష్టం లేదని అంటాడు. తాత దగ్గరకు వెళ్లి జ్యోత్స్నకి త్వరగా పెళ్లి చేయమని చెప్తానని మా దీప అక్క జీవితంలోకి రావొద్దని చెప్తానని అంటాడు. జ్యోత్స్న మీ అక్కరా ఏం అనొద్దురా అని దాసు అంటాడు. ఇక స్వప్న కూడా జ్యోత్స్నకి గట్టిగా వార్నింగ్ ఇద్దామని అంటుంది. దాసు ఇద్దరికి గొడవలు వద్దని చెప్తాడు. సీన్ కట్ చేస్తే స్వప్న వంట చేస్తుంటే కాశీ అక్కడికి వెళ్తాడు. వంట అయిపోలేదా తొందరగా వంట చేయ్ అని నీకు ఇంకేం పని లేదు కదా అని స్వప్నని తిడతాడు. కస్సుబుస్సులాడుతాడు. ఇక స్వప్న అలిగిపోతుంది కాశీతో మాట్లాడదు. దాంతో కాశీ నవ్వుతూ స్వప్న చీర బాగుంది నేనే కొన్నాకదా అని అంటాడు. దానికి స్వప్న ఇది మా అమ్మ కొన్న చీర అని అంటుంది. ఇక స్వప్న ఫుడ్ తీసుకొని వచ్చి కాశీకి తినిపిస్తుంది. 

సుమిత్ర తన భర్త, మామలకు కాఫీ ఇస్తుంది. జ్యోత్స్న విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డు పడను అని దశరథ్ అంటాడు. ఇంతలో విశ్వనాథం శివన్నారాయణకి కాల్ చేస్తాడు. నీ మనవడు దీపని పెళ్లి చేసుకున్నాడని రెండో పెళ్లి దాన్ని మనవడు చేసుకున్నాడని దానికి కూతురు కూడా ఉంది కదా అలాంటి ఆమెని నీ మనవడు పెళ్లి చేసుకోవడం పరువు తక్కువ అలాంటి నీ ఫ్యామిలీకి నా మనవడిని ఇవ్వను నీ మనవరాలికి మరో సంబంధం చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి పగ పట్టి చంపేస్తుందని మహాలక్ష్మీని వణికించేసిన సీత!

Continues below advertisement