Satyabhama Serial Today Episode క్రిష్‌ని సత్య వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటుంది. క్రిష్ సత్యతో వైరాగ్యం వదిలిందా అని అడిగితే దానికి సత్య మన్మధుడు పట్టుకున్నాడు కదా అని అంటుంది. ఇక హర్ష మైత్రి తలకు కట్టుకడతాడు. రౌడీల దగ్గర ఎందుకు బ్యాగ్ తీసుకోవాలని ప్రయత్నించావని అడుగుతాడు. దానికి మైత్రి ఫ్రెండ్ అయిన నా కోసం ఇన్ని త్యాగాలు చేయడంలో అర్థముందా అని మైత్రి అంటుంది. ఇక హర్ష నువ్వు కావాలనే ఏం చేయవు అతిగా ఆలోచించకు అని హర్ష చెప్పి వెళ్లిపోతాడు.
హర్ష: నా జీవితం ఎటు పోతుంది. ఇంట్లో వాళ్లని బాధ పెడుతున్నానా.
విశ్వనాథం: ఎలా ఉందిరా మైత్రికి నాకు నీ గురించే బెంగగా ఉందిరా. ఏదైనా ఒక రిలేషన్ ఇబ్బంది పెడుతుంది నష్టపోయేలా చేస్తుంది అంటే జాగ్రత్త పడాలి అని హెచ్చరిస్తుందని అర్థం ఇలా ఎందుకు చెప్పానో అర్థం చేసుకో.
విశాలాక్షి: మైత్రిని ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో ఉంచాలని అనుకుంటున్నావ్.
విశ్వనాథం: నువ్వు అడిగావ్ కానీ వీడు ఆ విషయమే ఆలోచించడు.
హర్ష: ఒక మనిషిని ఇంట్లో నుంచి వెళ్లిపో అని చెప్పడం చాలా బాధగా ఉంటుంది. మైత్రితో అంత హార్స్‌గా చెప్పలేను. మైత్రి నిస్సహాయ స్థితిలో ఉంది.
విశాలాక్షి: అంటే జీవితాంతం మన ఇంట్లోనే ఉంచేస్తావా.
విశ్వనాథం: మనకు ఇబ్బంది కలగనంత వరకే భరించాలి హర్ష. తను అర్థం చేసుకోవడం లేదు కాబట్టి మనమే చెప్పాలి.
హర్ష: అంత సూటిగా చెప్పలేను కానీ తనని ఉండమని మాత్రం చెప్పను.
మైత్రి: చాటుగా వింటూ అంటే నిర్ణయం నాకే వదిలి పెట్టాడన్నమాట.
సత్య మొక్కలకు నీరు పెడుతుంటే క్రిష్ రివాల్వర్ క్లీన్ చేస్తుంటాడు. ఇంతలో సంజయ్ వచ్చి పర్సనల్ రివాల్వరా ఇవ్వు అని అడుగుతాడు. క్రిష్ వద్దని అంటే సంజయ్ వినకుండా తీసుకొని కాల్చుతాడు. దాంతో సంజయ్ భయపడిపోతాడు. క్రిష్, సత్య నవ్వుతారు. ఇంట్లో అందరూ అక్కడికి వస్తారు. ఏమైందని అడుగుతారు. సంజయ్ అవమానంగా ఫీలై ఉండిపోతాడు.
సత్య: సంజయ్ క్రిష్ రివాల్వర్ తీసుకున్నాడు. హ్యాండిల్ చేయలేవు అని చెప్పినా వినలేదు పొరపాటున మిస్ ఫైర్ అవ్వడంతో కంగారు పడిపోయాడు.
సంజయ్: నేనేం భయపడలేదు బిగ్ డాడ్
క్రిష్: కాదు సత్య చెప్పింది నిజమే కావాలంటే నువ్వు ఎలా భయపడ్డావో చూపిస్తా అని చెప్పి యాక్షన్ చేసి నవ్వుతాడు.
మహదేవయ్య: రేయ్ అసలు నీకు తుపాకీతో పనేంటిరా పెద్ద తోపుగాడిలా ఎందుకు తీశావ్.
క్రిష్: నేను చెప్పా బాపు వినలే.
మహదేవయ్య: నువ్వు చెప్పాలి కదరా వీడికి ఏమైనా అయింటే.
చక్రవర్తి: చేతకానప్పుడు ఎందుకురా రివాల్వర్ తీసుకోవడం.
సత్య: తప్పు కదా చేతకానప్పుడు చేతకానివాడిలాగే ఉండాలి.
సంజయ్: ఏంటి చేతకాకపోవడం మీ మొగుడు పెళ్లాలు ఇద్దరూ కావాలనే చెప్తున్నారు కావాలనే ఆటపట్టిస్తున్నారు.
సరే తాడో పేడో తేల్చుకుందాం. భయం వాడికో నాకో తేలిపోవాలి.
భైరవి: చిన్నా గాడు దినాం బొమ్మలతో ఆడుకున్నట్లు వాటితో ఆడుకుంటాడు వాడితో నీకు ఎందుకురా పంతం.
ఎవరు ఎన్ని చెప్పినా సంజయ్ వినడు. నేను గేమ్ ఆడుదామని అంటాడు. రివాల్వర్లో ఉన్న బులెట్స్ తీసేసి కేవలం ఒక్క బులెట్ మాత్రమే పెట్టి ఇద్దరూ కాల్చుదాం ఎవరి చేతికి బులెట్ దిగితే వాళ్ల గేమ్ ఓవర్ అంటాడు. మహదేవయ్య సంజయ్‌ని ఆపి నీకు పిచ్చారా ఏం గేమ్స్ ఇవన్నీ అని తిడతాడు. దాంతో క్రిష్ గేమ్ ఆడటానికి నేను రెడీ అంటాడు. దాంతో సంజయ్ మహదేవయ్య చేయి విసిరేసి గేమ్ స్టార్ట్స్ అంటాడు. అందరూ ఎంత చెప్పినా క్రిష్, సంజయ్ ఇద్దరూ వినరు. ఒకరి తర్వాత ఒకరు గన్ పేల్చుతారు. ఇద్దరూ చెరో సారి అయిపోవడంతో మహదేవయ్య వద్దు ఆపండి అని అంటాడు. క్రిష్, సత్య సారీ చెప్తే ఆపేస్తా అని సంజయ్ అంటాడు.
ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఒకర్ని ఒకరు కాల్చుకుంటారు. లాస్ట్ ఛాన్స్ అని సంజయ్‌ని క్రిష్ కాల్చబోతే మహదేవయ్య గన్ లాక్కుంటాడు. సంజయ్‌ని అనకుండా క్రిష్‌ని మాత్రమే అంటావేంటి అని మహదేవయ్య చక్రవర్తిని అంటాడు. క్రిష్ గురించి ఆలోచించకుండా సంజయ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావ్ ఎందుకని చక్రవర్తి అంటాడు. పరాయి ఇంటికి వచ్చినప్పుడు బుద్ధిగా ఉండాలి కదా అని సంజయ్ కోసం చక్రవర్తి అంటే సంజయ్‌ని ఎలా పరాయి ఇళ్లు అవుతుందని అంటాడు. మహదేవయ్య సంజయ్ గురించి గొడవపడితే చక్రవర్తి క్రిష్ గురించి గొడవపడతాడు. దాంతో సత్య ఆలోచనలో పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి పగ పట్టి చంపేస్తుందని మహాలక్ష్మీని వణికించేసిన సీత!