Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode చారుకేశవ కనకం గదికి వస్తాడు. తాను చేసిన దొంగతనం గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరిస్తాడు. ఇంతలో వసుధ తన భర్త ఎక్కడికెళ్లాడని వెతుకుతూ ఉంటుంది. కనకం గది వైపు వస్తుంది. వసుధ మాట విని చారుకేశవ దాగుండిపోతాడు. తన భర్త రావడం చూశావా అని లక్ష్మీని అడుగుతుంది. లక్ష్మీ లేదని చెప్తుంది. వసుధ వెళ్తూ లక్ష్మీ వణికిపోతూ చమటలు పట్టడం చూసి ఏమైంది అని అడుతుంది.
వసుధ: లక్ష్మీ నీకు ఓ విషయం అడగొచ్చా.
చారుకేశవ: ఈ తింగరిది వచ్చిన పని చూడకుండా అన్నీ అడుగుతుంది.
వసుధ: ఏం లేదు లక్ష్మీ నువ్వు నా చేతి గాజులు చూస్తున్నావ్ ఎందుకు.
లక్ష్మీ: నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా.
వసుధ: అలా ఏం లేదు.
లక్ష్మీ: ఆ గాజులు నిజంగానే చాలా బాగున్నాయ్. అందుకే అలా చూశాను అంతే తప్ప నాకు ఎలాంటి దురుద్దేశం లేదండి. నేను పెరిగిన వాతావరణం కూడా అలాంటిది కాదు నన్ను ఓ దొంగలా చూడకండి.
వసుధ: అంత పెద్ద మాటలు వద్దు లక్ష్మీ ఊరికే అడిగాను. అయినా నీ మంచితనం గురించి మా వదిన చెప్పంది. పడుకో లక్ష్మీ నేను వెళ్తాను.
చారుకేశవ: చూడు ఆ దేవుడు నాకు మనిషి రూపం ఇచ్చినా బుద్ధి మొత్తం పశువుదే ఇచ్చాడు. నీ నగలు ఎత్తుకెళ్లానని నువ్వు ఎవరి దగ్గరైనా చెప్తే ఆ రోజే నీకు నిండు నూరేళ్లు నిండిపోతాయి. అంతే కాదు నువ్వు వీలైనంత త్వరగా వెళ్లిపోవాలి. జాగ్రత్త.
ఉదయం సహస్ర తల్లిదండ్రులతో కలిసి వెండి అమ్మవారి విగ్రహం పట్టుకొని ఇంటికి వస్తుంది. సహస్ర తాతయ్య మంచి చెడు అడుగుతుంది. ఇంట్లో వాళ్లు అంతా అక్కడికి వస్తారు. పద్మాక్షి యమునను చూసి సూటిపోటి మాటలు అంటుంది. ఇక సహస్ర అమ్మవారి విగ్రహాన్ని యమునకు ఇవ్వబోతూ దేవుడి దగ్గర పెట్టమని అంటుంది. ఇంతలో పద్మాక్షి పెద్దగా అరిచి విలువ లేని మనుషులకు ఇవ్వొద్దని తిడుతుంది. ఆ విగ్రహం వసుధకు ఇవ్వమని అంటుంది. వసుధ తీసుకుంటుంది. యమున బాధ పడుతుంది. కనకం చూసి చాలా ఫీలవుతుంది. కనకం అందరికీ జూస్ తీసుకొని వెళ్లి ఇస్తుంది.
పద్మాక్షి: గ్లాసులు కడిగే తీసుకొచ్చావా లేక మీ పల్లెలూరి పాకుడులా తీసుకొచ్చావా.
లక్ష్మీ: లేదండీ కడిగే తీసుకొచ్చాను.
అంబిక: ఈ పని వాళ్లకి పీకల్లదాకా మెక్కడం వచ్చు కానీ పని చేతకాదు అక్క.
యమున: అంబిక తను పని మనిషి కాదు.
అంబిక: పని మనిషి కాకపోతే ఈ ఇంటి యువరాణా నీకే ఈ ఇంట్లో ఈ స్థానం లేదు నువ్వు ఈ ఇంట్లో లక్ష్మీ స్థానం గురించి మాట్లాడుతున్నావా. ముందు నువ్వు ఈ ఇంట్లో ఏ అధికారం అర్హతతో బతుకుతున్నావో అది తెలుసుకో.
పెద్దాయన: అంబిక నోరు మూస్తావా ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు.
లక్ష్మీ: అమ్మగారు తీసుకోండి.
పద్మాక్షి: అవసరం లేదు వెళ్లు.
కాదాంబరి కూడా లక్ష్మీని గసిరేస్తుంది. పెద్దాయన, సహస్ర జూస్ తీసుకుంటారు. లక్ష్మీ బాధ పడుతూ ఇంటికి వెళ్లిపోతుంది. ఇక సహస్ర అందరినీ కూల్ చేయడానికి టీవీ వేసి అందులో రాశి ఫలాలు వేస్తుంది. కామెడీ చేస్తుంది. ఇక సహస్ర రాశి ఫలంలో తనకు మొత్తం ఆటంకాలు కలుగుతాయి అని చెప్తారు. దాంతో సహస్ర ఎవరు అమ్మ నాకు ఆటంకం కలిగిస్తారు అని కంగారు పడుతుంది.
అంబిక: మీ అమ్మ పవర్, పొగరు గురించి నీకు తెలీదా. ఆటంకం అడ్డు వస్తే తొలగించి మరి నీ పెళ్లి చేస్తుంది నువ్వేం బాధ పడకు.
సహస్ర: అమ్మ బలం నాకు తెలీదా అమ్మ పక్కనుంటే జేమ్స్ బాండ్ పక్కనున్నట్లే.
ఇక అందరూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. కిచెన్‌లో కనకం గ్లాస్‌లు శుభ్రం చేస్తుంటే సహస్ర చూసి ఇంట్లో అందరూ తన మంచి కోరుకునే వారే కానీ కొత్తగా వచ్చిన ఈ లక్ష్మీనే తనకి ఆటంకం కలిగిస్తుందని అనుకుంటుంది. ఇంతలోనే తను తన తల్లిలా ఆలోచించాలి కానీ ఇలా పాతాళంలో ఆలోచిస్తున్నానేంటి అనుకొని వెళ్లిపోతుంది. ఇక లక్ష్మీ దగ్గరకు యమున వస్తుంది. లక్ష్మీకి జరిగిన అవమానం గురించి బాధ పడుతూ ఆపలేకపోతున్నాను అని ఫీలవుతుంది. దాంతో లక్ష్మీ నేను వాళ్ల మాటలు మర్చిపోయాను మీరు మరచిపోండి అని చెప్తుంది. ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తుంది చారుకేశవ ఎదురు పడి రాత్రి ఇచ్చిన వార్నింగ్‌కి వెళ్లిపోతావు అనుకుంటే ఇక్కడే ఉన్నావేంటి అని తాను ఎంత చెడ్డ వాడో తెలియాలి అంటే ఇక్కడే ఉండు అని బతకాలి అంటే పారిపో అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.