Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ఇంట్లో అందరికీ భక్తవత్సలం గాజులు కొనిస్తారు. సహస్ర విహారికి గాజులు కొని ఇవ్వమని చెప్తుంది. సహస్ర పసుపు రంగు గాజులు చూపించి ఇవి ఎలా ఉన్నాయి అని అడిగితే విహారి ఎరుపు రంగు గాజులు తీస్తాడు. సహస్ర ఎరుపు రంగు గాజులు నాకు నచ్చవని పసుపు రంగు గాజులే కావాలి అంటుంది. దాంతో విహారి సహస్రకి ఆ గాజులే తొడుగుతాడు. సహస్ర బావని చూస్తూ ఎమోషనల్‌గా బావని చూసి కళ్లలో నీళ్లు పెట్టుకుంటుంది. గాజులు చూసి మురిసి పోతుంది. అందరూ జంటని చూసి మురిసిపోతారు.
వసుధ: అక్క విహారి సహస్రల్ని చూశావా వీళ్ల ఇద్దరి సంసారం ఇప్పుడే మొదలైనట్లు లేదు.
కాదాంబరి: బాగా చెప్పావే మామూలుగా అయితే ఇవన్నీ భర్త భార్యకి చేస్తాడు. కానీ మన విహారి పెళ్లికి ముందు కాబోయే భార్యకి ఇప్పుడే ఇవన్నీ చేస్తున్నాడు. చూడ ముచ్చటైన జంట.
విహారి: పండు ఈ గాజులు లక్ష్మీకి ఇచ్చేయ్ అని ఎరుపు రంగు గాజులు ఇస్తాడు.
పండు వాటిని కిచెన్‌లో ఉన్న లక్ష్మీ దగ్గరకు తీసుకెళ్లి విహారి బాబు ఇంట్లో అందరితో పాటు నీకు గాజులు కొనిచ్చాడని చెప్తుంది. కనక మహాలక్ష్మీ చాలా సంతోషంగా ఆ గాజులను తీసుకుంటుంది. వాటిని పట్టుకొని నిమురుతూ ఎమోషనల్ అవుతుంది. నీ భర్తతో గాజులు తొడిగించిన అదృష్టం నీకు లేదు కదమ్మా నువ్వే వేసుకో అమ్మ అని పండు అంటాడు. లక్ష్మీ గాజులు వేసుకొని చాలా సంతోషపడుతుంది.
పండు: అమ్మా యమునమ్మ కళ్లు తిరిగి పడిపోయినప్పుడు అందరూ ఎన్నో మాటలు అన్నారు కదా. అదే నీకు విహారి బాబుకి పెళ్లి అయినట్లు బయట పడితే మళ్లీ అమ్మగారిని అలాగే తిడతాడు కదా నాకు భయంగా ఉందమ్మా.
లక్ష్మీ: మరేం పర్లేదు పండు నేను విహారి బాబుకి కనిపించను. నా పెళ్లి గురించి తెలీకుండా చూసుకుంటా. అయినా విహారి బాబుకి సహస్ర అమ్మకి పెళ్లి అయితే నేను యమునమ్మకి చెప్పి వెళ్లిపోతా. వేరే ఎక్కడైనా బతుకుతాను.
పండు: ఎక్కడికి వెళ్తావ్ ఎలా బతుకుతావ్ అమ్మా. అలా అనకమ్మా నాకు చాలా బాధగా ఉంది.
ఉదయం లక్ష్మీ తులసి కోట దగ్గర లక్ష్మీ ముగ్గు పెడుతుంటే పని మనిషి వచ్చి పెద్దాయన ఎప్పుడూ ఇంట్లో ఆడవాళ్లకే గాజులు కొనిపెట్టేవారు. కానీ ఈ సారి విహారి బాబు మనకు కొని పెట్టారని అంటుంది. ఇక విహారి లక్ష్మీకి ఇచ్చిన గాజులు చూస్తూ నీ టేస్ట్ బాబుగారు టేస్ట్ ఒకటే సరిగ్గా నీకు నచ్చినవే కొన్నారని పనామె అంటుంది. అది విన్న సహస్ర కోపంతో లక్ష్మీ దగ్గరకు వచ్చి లక్ష్మీ రెండు చేతులు పట్టుకొని గాజులు పగల గొట్టేస్తుంది. లక్ష్మీ వద్దన్నా వినదు. లక్ష్మీ చేతికి గాయాలవుతాయి.
సహస్ర: మా బావ ఏదో జాలి పడి గాజులు కొనిపెడితే ఆయనేదో తన పెళ్లానికి కొని పెట్టినట్లు సంతోషపడతావేంటి. దిక్కూ ముక్కూలేని దానివి నా బావ టేస్ట్ నీ టేస్ట్ ఒకటే అని మురిసిపోతున్నావ్ ఏంటి. నా బావ దగ్గరకు నువ్వు వెళ్లకూడదు. నువ్వు తన కంట పడకూడదు. మాట మాటికి నువ్వు మా కంట పడొద్దు.
లక్ష్మీ తులసి కోట దగ్గర పసుపు గాయాల మీద వేసుకుంటుంది. మరోవైపు యమునను తలచుకొని పద్మాక్షి కోపంగా ఉంటుంది. ఇంతలో అంబకి అక్కడికి వస్తుంది. తల్లిని కాదని కొడుకు ఏం చేయడం లేదని కొడుకుని కాదని మనం ఏం చేయలేకపోతున్నాం అని కోరలు పీకేసిన నాగు పాము పరిస్థితి అయిపోయిందని ఫీలవుతుంది. దానికి అంబిక టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి అంటుంది. ఇంతలో సహస్ర వచ్చి బావకి ఎవరికి విలువ ఇవ్వాలో ఎవరికీ ఇవ్వకూడదో తెలీదని గాజుల పండక్కి పనివాళ్లకి కూడా మనకి కొనిచ్చిన గాజులే కొనిచ్చాడని అంటుంది. దానికి అంబిక గాజులు వేసుకున్నంత మాత్రానా వాళ్లు మనం ఒకటేనా అని అంటుంది. దానికి సహస్ర నా స్థాయికి లక్ష్మీ వచ్చినట్లు ఫీలవుతుందని బావ ఇచ్చిన గాజులు తీసుకొని బావ తనకి ప్రేమతో ఇచ్చినట్లు ఫీలైపోతుందని అంటుంది. ఇక గాజులు పగల గొట్టిన విషయం చెప్తుంది. ఇక లక్ష్మీ తన కంటికి కనిపించకూడదని అంటుంది. దానికి పద్మాక్షి నిశ్చితార్థం జరుగుతున్నంత సేపు నీకు అది కనిపించదని చెప్తుంది. మరోవైపు లక్ష్మీ చేతులకు పసుపు చూసి పనామె అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర మీద ఎటాక్.. బిజినెస్‌లో ఓడించడానికి రంగంలోకి దిగిన సరయు!