Brahmamudi Serial Today Episode:  అపర్ణ, ఇందిరాదేవి, కనకం ముగ్గురు కలిసి కావ్యను తిడతారు. మేమంటే నీకు విలువే లేదా? అని అడుగుతారు. ఇంత అవమానించాక మనం ఈ ఇంటి చాయలకే రావొద్దు అంటుంది ఇందిరాదేవి. అపర్ణ అయితే వెళ్దాం పదండి అనగానే థాంక్స్‌ అత్తయ్యగారు.. అమ్మమ్మగారు అంటుంది కావ్య. దీంతో కనకం.. కావ్యను తిడుతుంది.


అపర్ణ: నువ్వు వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతామా ఏంటి? ఈ సమస్య మానుంచి మొదలైంది కాబట్టి పరిష్కారం కూడా మేమే ఇవ్వాలని వచ్చాము.


ఇందిరాదేవి: అవును మంచి పరిష్కారం కూడా కనిపెట్టాము.


కావ్య: ఓహో రెండో నాటకానికి రంగం సిద్దం చేసుకుని వచ్చారన్నమాట.


కనకం: ఆ మాట కొస్తే జీవితం కూడా పెద్ద నాటకరంగమే.. ప్రతి పాత్ర ఆ దేవుడు ఆడించినట్టే ఆడాలి.


   అంటూ కనకం అడగ్గానే కావ్య వెటకారంగా చూస్తుంది. దీంతో అపర్ణ ఇవన్నీ కాదు కావ్య అంటూ ఏదో చెప్పబోతుంటే కావ్య ఎమోషనల్‌ అవుతుంది. ఇక నా బతుకు నేను బతకాలనుకుంటున్నాను అంటుంది. ఇవన్నీ కాదు కానీ నువ్వు మళ్లీ కంపెనీలో జాయిన్‌ అవ్వాలి అని అపర్ణ చెప్తుంది. ఇప్పుడు నేను ఆఫీసుకు వెళ్తే ఆయన నన్ను రోజూ అవమానిస్తూనే ఉంటారు అంటుంది.


అపర్ణ: నువ్వు వాడి కింద పని చేస్తేనే కదా? వాడు నిన్ను అవమానించేది. అదే నువ్వు కంపెనీకి సీఈవో అయితే


కనకం: అవునా నిజమా..? నా కూతురు  అంత పెద్ద కంపెనీకి సీఐడీగా పని చేస్తుందా?


ఇందిర: ఏయ్‌ సీఐడీ కాదు సీఈవో..


కనకం: అదే అంత పెద్ద కంపెనీలో అంత పెద్ద ఉద్యోగం చేస్తుందా.


కావ్య: హలో కాన్సర్‌ కనకం. నువ్వెందుకు అంత ఓవర్‌ చేస్తున్నావు. ఈ విషయం మీరు పక్కకు వెళ్లి చర్చించుకున్నప్పుడే తెలుసు కదా?


అపర్ణ: కనకం నువ్వుండు.. ఇంతకీ నువ్వేమంటావు కావ్య.


కావ్య: మీరు మంచి ఐడియా అనుకుంటున్నారు. కానీ ఇది కూడా బెడిసికొడుతుంది


అని కావ్య చెప్పగానే ముగ్గురు కావ్యను తిడుతూ కన్వీన్స్‌ చేస్తుంటారు. ఇంతలో అనామిక వస్తుంది. అనామికను చూసిన నలుగురు షాక్‌ అవుతారు. అలిగి పుట్టింటికి వచ్చిన కోడలును కంపెనీకి సీఈవోను చేస్తున్నారు ఎంత పెద్ద మనసు మీది అంటుంది. కావ్య నా దగ్గర పని చేసే ఎంప్లాయి తాను ఎక్కడ జాబ్‌ చేయాలన్నా నా పర్మిషన్‌ ఉండాలి అంటుంది అనామిక.


ఇందిర: నువ్వు ఒప్పుకునేదేంటే నీ ముఖం. నీ కింద పనిచేయాల్సిన ఖర్మ నా మనవరాలికేంటి? నీలాగా దిగజారిపోయి బతకాల్సిన అవసరం మా ఇంటి కోడలికి లేదు.


అనామిక: అలా అంటే ఎలా ఇప్పుడు కానీ కావ్య నా కంపెనీకి రాకుండా పోతే నేను నేరుగా వెళ్లి కోర్టులో కేసు పెడతా..?


అపర్ణ: కోర్టుకు వెళ్లి కేసు వేయడానికి కారణం కావాలి కదా? ఏముంది నీ దగ్గర.


అనామిక: నీ కోడలు సంతకం చేసిన అగ్రిమెంట్ ఉంది. మా కంపెనీకి రెండేళ్లు వర్క్‌ చేస్తానని రాసిన అగ్రిమెంట్‌ పేపర్‌ చూపిస్తాను.


అనగానే అపర్ణ పేపర్స్‌ తీసుకుని చదివి పిల్లకాకి ఇవి చూసుకునా నువ్వు ఇంతలా ఎగిరిపడేది అంటూ ఇప్పుడే వస్తాను ఉండు అని కారు దగ్గరకు వెళ్లి 50 లక్షల చెక్‌ తీసుకొచ్చి అనామికకు ఇస్తుంది. అపర్ణ. అగ్రిమెంట్‌లో రెండేళ్లలో ఎప్పుడైనా జాబ్‌ మానేస్తే 25 లక్షలు  కట్టాలని ఉంది. ఇది 50 లక్షల చెక్‌ తీసుకో అని చెప్పగానే అనామిక షాక్‌ అవుతుంది.


కనకం: ఇగ్లీష్‌ కూడా రాదా. చదువుకోలేదా? మా వదిన గారే నీకు నేర్పించాలా..? పాపం మెఖం మాడిపోయిందా? నా కూతురుని నీ ఉచ్చులో బిగించే ముందు ఒకటికి రెండు సార్లు చదువుకోవాలి కదా?


అపర్ణ: ఇంకోక పిడుగు లాంటి వార్త నువ్వు ఇంటికి వెల్లే సరికి నీకు కోర్టు నుంచి నోటీసు వస్తుంది. నీ పెళ్లి జరిగే రోజు నా కొడుకు మీ అమ్మా నాన్నాలకు రెండు కోట్లు ఇచ్చాడు కదా? అవి వెంటనే తిరిగి ఇవ్వకపోతే నేను మిమ్మల్ని జైలుకు పంపిస్తాను గెట్‌ అవుట్‌..


కనకం: నీ ఆఫీసుకు నేను వస్తే నన్ను గెంటి వేస్తాను అన్నావు కదే.. ఇప్పుడు నువ్వు గెట్‌ అవుట్‌


 అంటుంది. అనామిక కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కావ్యను చూసి అపర్ణ ఇప్పుడైనా అర్థం అయిందా..? నువ్వు వెంటనే ఆఫీసుకు వెళ్లి రాజ్‌ను దారిలోకి తెచ్చుకో అని చెప్తుంది. కావ్య సరే అంటుంది. కళ్యాణ్‌ ఆటో దగ్గర నిలబడి ఒక్క గిరాకి కూడా రాలేదని ఎదురుచూస్తుంటాడు.  ఇంతలో లిరిక్‌ రైటర్‌ లక్ష్మీకాంత్‌, ఓ సినిమా నిర్మాత కారు చెడిపోవడంతో కళ్యాణ్‌ ఆటో ఎక్కుతారు. ఫిలింనగర్‌ వెళ్తుంటారు. ఇద్దరూ ఆటోలో ఒక సాంగ్‌ గురించి చర్చించుకుంటుంటే కళ్యాణ్‌ సాంగ్‌ పాడతాడు. పాట బాగుందని ప్రోడ్యూసర్‌, రైటర్‌ మెచ్చుకుంటారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!