Jagadhatri  Serial Today Episode:   టెర్రస్‌ పైన రూంలోకి వెళ్లిన కేదార్‌ ఆరాధ్యను పలకరిస్తాడు. అక్కడ కాపలాగా ఉన్న రౌడీ కేదార్‌ను కొడతాడు. దీంతో ఇద్దరి మధ్య ఫైట్‌ జరుగుతుంది. మరోవైపు లోపలి సౌండ్‌ ఎవ్వరికీ వినిపించకుండా ధాత్రి క్రాకర్స్‌ కాలుస్తుంది. ఇంతలో కేదార్‌, ధాత్రి కి పోన్ చేసి ఆరాధ్య పైన రూంలోనే ఉందని మీరు మన టీంతో వచ్చేయండి అని చెప్తాడు. సరేనని ధాత్రి వెళ్తుంది. కేదార్‌ రౌడీలను కొడతాడు.

ఆరాధ్య: అన్నయ్యా..

కేదార్‌: ఏం కాదమ్మా నువ్వు బయపడకు..

ధాత్రి: ఆరాధ్య..

ఆరాధ్య: అక్కా మీరొస్తారని  నాకు తెలుసు అక్కా.. నీ మీద గెలవబోతున్నానని మీనన్‌ చాలా సంతోషపడ్డాడు. కానీ నేను చెప్పా నువ్వు వస్తావని. ..

కింది ఫ్లోర్ లో..

మీనన్‌: క్రాకర్స్‌ ఎవరూ కాల్చింది. ముందు వాటిని ఆపండి.

టెర్రస్‌ రూంలో..

ధాత్రి: నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన పతనాన్ని ఎలా తెచ్చుకున్నాడో.. ఇవాళ వాడికి అర్థం అవుతుంది. అర్థం అయ్యేలా నేను చేస్తాను. కిరణ్‌, రమ్య మీరు ఆరాధ్యను తీసుకుని వెనక గేటు దగ్గరకు వెళ్లండి.

 అని చెప్పగానే కిరణ్‌, రమ్య.. ఆరాధ్యను బయట మన వాళ్లకు అప్పజెప్పి మేము ఇక్కడికి వస్తామని చెప్పి వెళ్లిపోతారు. మీనన్‌ అందరినీ పిలిచి ఈ టైంలో క్రాకర్స్‌ పేలడం ఏంటి..? అని అడుగుతాడు. పెళ్లి కూతురు వాళ్లు దెబ్బలతో  బయటకు రావడంతో  ఎవరు మిమ్మల్ని కొట్టింది అని అడుగుతాడు. దీంతో మీనన్‌ ఇక్కడ ఏదో జరగుతుంది దేవా.. ఆరాధ్య సేఫ్‌గా ఉందే లేదో చూడు అని చెప్పాగానే  పై నుంచి రౌడీలు వచ్చి ఎవరో మమ్మల్ని కొట్టి ఆరాధ్యను తీసుకెళ్లారని చెప్తారు.

మీనన్‌: జేడీ బరిలోకి దిగిపోయింది దేవా.. అన్ని ఎగ్జిట్స్‌ క్లోజ్‌ చేయమని చెప్పు. మన వాళ్లందరిని ఒక రూంలో పెట్టి లాక్‌ చేయమని చెప్పు.

దేవా: పదండ్రా.. అన్ని గేట్స్‌ క్లోజ్‌ చేయమని చెప్పు

టోని: అభి మీరిద్దరూ ఆ రూంకి కాపలాగా ఉండండి. ఇక్కడేదో జరగుతుంది.

మీనన్‌: దేవా వాళ్లందరూ నాకు ప్రాణాలతో కావాలి.

కేదార్‌: జేడీ మీనన్‌కు మనం వచ్చామని తెలిసిపోయినట్టుంది అటాక్‌ స్టార్ట్‌ చేద్దామా..?

ధాత్రి: వద్దు ఆరాధ్య సేఫ్‌గా వెళ్లే వరకు మనం  ఎలాంటి స్టెప్‌ తీసుకోకూడదు కేడీ. కిరణ్‌ ఇంకా ఎంతసేపు.

కిరణ్‌: అన్ని గేట్లు క్లోజ్‌ చేశారు మేడం. బ్యాక్‌ గేట్ దగ్గర కూడా వాళ్ల మనుషులు ఉన్నారు.

ధాత్రి: మీనన్‌ మనుషులు ఉన్నారట. మనం వెళ్లి వాళ్లను డైవర్ట్‌ చేద్దాం పద.

అని వెళ్లి బ్యాక్‌ గేట్‌ దగ్గర ఉన్న రౌడీలను ధాత్రి, కేదార్‌ కలిసి కొడతారు. కిరణ్‌, రమ్య ఆరాధ్యను తీసుకుని వెళ్లిపోతారు. కిరణ్‌ వాళ్లు వెళ్లిపోయారో లేదో ఫోన్‌ చేసి కనుక్కుంటానని కాల్‌ చేస్తుంది. ఆ కాల్‌ మీనన్‌ లిఫ్ట్‌ చేస్తాడు. ఆరాధ్య సేఫ్‌గా ఉందా కిరణ్‌ అని అడగ్గానే ఇప్పటి వరకు సేఫ్‌గానే ఉంది. ఇక ఉంటుందో లేదో తెలియదు అంటాడు మీనన్‌ దీంతో ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు.

మీనన్‌: జేడీ నువ్వు ఇక్కడే ఉన్నావు అంతా చూస్తున్నావు అని నాకు తెలుసు. నువ్వు బయటకు రా లేకుంటే ఒక్కొక్కరిని చంపేస్తా

ధాత్రి: కేడీ మన వాళ్లు..

కేదార్‌: వెళ్లి అటాక్‌ చేద్దాం  పద జేడీ..

ధాత్రి: వద్దు వాళ్ల మధ్యకు వెళ్లకుండా మనం ఏం చేయలేము.

కేదార్‌: కనిపించిన వెంటనే షూట్‌ చేస్తారు జేడీ. అక్కడ మన వాళ్లు ఉన్నారు మనం అటాక్‌ చేయగానే మనవాళ్లు జాయిన్‌ అవుతారు.

ధాత్రి: కష్టం అభి, కదీర్‌ దగ్గర కూడా గన్‌ లేదు. ప్లాన్‌ ఫెయిల్ అయితే మీనన్‌ మనతో పాటు వాళ్లను కూడా చంపేస్తాడు.

మీనన్‌ అందరినీ బెదిరిస్తుంటాడు. గన్‌ అభికి ఇచ్చి ఆరాధ్యను కాల్చమని చెప్తాడు. అభి చూస్తుండిపోతాడు. ఆరాధ్య వచ్చి కాల్చమని అడుగుతుంది. ఎమోషనల్‌ డ్రామా నడుస్తుంది. ఇంతలో ధాత్రి, కేదార్‌ వస్తారు. టోనీ కోపంగా ధాత్రిని కొట్టడానికి వెళితే తప్పించుకుంటుంది. వాళ్లను వదిలేయమని చెప్తుంది. వినయపోయే సరికి ధాత్రి అటాక్‌ స్టార్ట్‌ చేస్తుంది. జేడీ టీంకు మీనన్‌ టీంకు పైటింగ్‌ జరుగుతుంది. ఇంతలో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!