Trinayani Serial Today Episode నయనికి విషం ఇచ్చి ఆ నింద హాసిని మీద వేసేయాలి అని ప్లాన్ చేస్తుంది తిలోత్తమ. హాసిని మీద నింద పడితే ఎవరూ మనల్ని తప్పు పట్టరని వల్లభతో చెప్తుంది. ఇక అందరూ హాల్‌లోకి చేరుతారు. ఇంతలో హాసిని అందరి కోసం జ్యూస్‌ తీసుకొని వస్తుంది. అందరికీ పంచి పెడుతుంది. అందరూ జ్యూస్ లొట్టలేసుకొని తాగుతారు. ఇక నయని తాగబోతే విశాలాక్షి ఆపుతుంది. 

విశాలాక్షి: అమ్మా ఆ పళ్ల రసాన్ని పెద్దమ్మకి ఇవ్వు.హాసిని: కంగారు పడుతూ నాకు ఎందుకు నేను చెల్లి కోసం తీసుకొచ్చా.విశాలాక్షి: నీ చెల్లి నీ కోసం ఇస్తే వద్దంటావు ఎందుకు పెద్దమ్మా. అమ్మ ఇస్తుంటే కాదనడం ఎందుకు పెద్దమ్మ తీసుకో.నయని: తీసుకో అక్క ఏం కాదు.హాసిని: నువ్వు తాగుతావని తెస్తే నన్ను తాగమంటావేంటి చెల్లి.సుమన:  మీ ప్రేమ చూడలేక చస్తున్నాం.పావనా: ఏంటమ్మా అన్ని సార్లు ఇస్తే తీసుకోవు ఇలా తీసుకొని ఇలా తాగాలి అని తాగబోతే తిలోత్తమ, హాసిని, నయని ఒకేసారి ఆపుతారు. విశాల్: అమ్మ ఏమైంది ముగ్గురు ఒకే సారి వద్దు అన్నారు.నయని: గ్లాస్ నా చేతిలో ఉన్నప్పుడు నాకు ఏం అనిపించలేదు కానీ ఎప్పుడు అయితే బాబాయ్ ఆ గ్లాస్ తీసుకున్నారో అప్పుడు అనిపించింది అందులో విషం కలిపారని. పావనా: విషమా.సుమన: ఏంటి అక్కా నువ్వు అనేది.విశాల్: వదినా ఏంటి ఇది. అందరికీ జ్యూస్ తెచ్చిన నువ్వు నయని తాగిన జ్యూస్‌లో విషం ఉంది అంటే ఏం మాట్లాడవేంటి.తిలోత్తమ: ఏం మాట్లాడుతుంది విశాల్ విషం కలిపింది హాసినినే కదా.హాసిని: నేనా ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య.

ఇక హాసిని తిలోత్తమనే విషం కలిపుంటుందని అంటే తిలోత్తమ హాసినిని లాగిపెట్టి కొడుతుంది. నేను కొట్టినా ఎందుకు అడగలేదు అంటే హాసిని తప్పు ఒప్పుకుందని తిలోత్తమ అంటుంది. నయని చావుకి హాసిని కారణం అవుతుందని తెలిసే హాసినిని ఫాలో అయ్యానని అందులో భాగంగానే హాసిని జ్యూస్‌లో విషం కలపడం వీడియో తీసి అందరికీ చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు.  వదిన అలా చేయడం ఏంటి అని అనుకుంటారు. ఇక విశాలాక్షి నేను అందుకే అమ్మకి తాగొద్దని చెప్పానని అంటుంది. 

విశాల్: వదినా నువ్వు ఇలా చేశావ్ అంటే నేను నమ్మలేకపోతున్నా.పావనా: నేను కూడావిక్రాంత్: నేను కూడా కానీ కారణం ఏదో ఉంటుంది కదా.వల్లభ: మమ్మీ మన కాన్సెప్ట్‌లో ఇలా వీడియో తీయడం లేదు కదా. విశాల్: ఏంటదితిలోత్తమ: వీడు ఏదో ఒకటి చెప్తాడులే.విశాలాక్షి: పెద్దమ్మా ఎందుకు ఇలా చేశావో చెప్పు.హాసిని: చెల్లిని కాపాడుకోవడానికి చెల్లి నీకు ప్రాణం గండం అని నువ్వే మాకు చెప్పావ్. నీకు కానీ పిల్లలకు కానీ గండం వస్తే నువ్వు కనిపెట్టలేవు కదా. అలాంటప్పుడు అలా ఎలా తెలుస్తుందని ఆలోచించాను. విషయం తెలుసుకోవడానికి ఇలా విషం కలిపి తెచ్చా. నేను తెచ్చిన విషం నువ్వు గుర్తించి ఉంటే నీకు కనిపించిన నీ మృత్యువు నిజం అనుకోవచ్చు కానీ అలా చెప్పలేకపోతే అదంతా భ్రమ అని అనుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదని చెప్పాలని అనుకున్నా.నయని: నిజంగా నాకు తెలీదు అక్క బాబాయ్ చేతిలో గ్లాస్‌ ఉన్నప్పుడే గుర్తించా.హాసిని: చూశావా చెల్లి అంటే అంతా భ్రమే కదా. అసలు నయని కంటే ముందు తిలోత్తమ, విశాలాక్షి ఎలా కనిపెట్టారా అనుకున్నా.విశాల్: ప్రయోగాలకు ఇది పద్ధతి కాదు వదిన.హాసిని: సారీ చెల్లి.నయని: లేదు అక్క నీ వల్ల నాకు గండం రాదనే నమ్మకం కలిగింది.

ఇక విశాలాక్షి నయని జీవితంలో ఊహించని ట్విస్ట్ రాబోతుందని అదెలా తెలుసుకుంటారో మరి అని అంటుంది. ఇక హాసిని కిచెన్ నుంచి వస్తే తిలోలత్తమ, వల్లభలు అడ్డుపడతారు. ఇంతలో నయని, విశాల్ అక్కడికి వస్తారు. ఇక నయని నాకు అపాయం ఉందా లేదా తెలుసుకోవాలని అక్క మాత్రమే తెలుసుకోవాలని పాజిటివ్‌గా మాట్లాడుతారు. దానికి తిలోత్తమ ప్రాణాలు పోయి ఉంటే అని అంటుంది. ఇక విశాల్, నయని ఇద్దరూ హాసినిని వెనకేసుకొస్తారు. హాసినిని కార్నర్ చేయొద్దని అంటుంది.

నువ్వు ఏ తప్పు చేయలేదు వదినా అని  విశాల్ అంటాడు. ఇక నయని నేను హాసిని అక్క చేతిలో చనిపోయినా సంతోషమే అంటుంది. దానికి తిలోత్తమ ఇదే మాట మీద ఉండండి అని అంటుంది. దానికి హాసిని మీరు నేరం చేసి నా మీద నెట్టేయకండి అంటుంది. దాంతో విశాల్, నయనిలు హాసినిని తీసుకెళ్లిపోతారు. ఇక సుమన విక్రాంత్ దగ్గరకు వెళ్లి హాసిని అక్క అంత నేరం చేసినా ఎవరూ ఏం అనడం లేదని అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: మీడియా ముందు మామని ఇరికించేసిన సత్య.. ఇక నో వెపన్స్.. మైత్రి, హర్షల సరసాలు చూసేసిన నందిని!