Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, సహస్రల పెళ్లికి పది రోజుల్లో ముహూర్తం ఉందని పంతులు చెప్తారు. దానికి విహిరి వద్దు నాకు ఇష్టం లేదు అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. మరీ పది రోజుల్లో పెళ్లి ఏంటి అని అడుగుతాడు. పెళ్లి ప్లాన్‌గా చేసుకోవాలి అని నిన్నే నిశ్చితార్థం అయింది కదా అప్పుడే పెళ్లి ఏంటి అని అంటాడు. మీ ఇద్దరూ జంట అయితే అందరూ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారని అంటుంది అంబిక. అందరూ విహారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు.
పద్మాక్షి: పంతులు గారు ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి.
విహారి: అత్తా వద్దు. మరీ అంత దగ్గర ఎందుకు. పంతులు గారు నెల తర్వాత ఏదైనా ముహూర్తం ఉంటే చూడండి.
పద్మాక్షి: మనసులో అప్పుడు తల్లి నిశ్చితార్థం ఆపింది ఇప్పుడు వీడు ఇలా అంటున్నాడు ఇద్దరూ అనుకొని చేస్తున్నారా అనుకోకుండా చేస్తున్నారా.
పంతులు: నెల రోజులు తర్వాత దివ్యమైన ముహూర్తం ఉంది అది ఖాయం చేయమంటారా.
చారుకేశవ: ఈ ముహూర్తమైన ఇష్టమేనా విహారి.
విహారి: అమ్మ నీకు ఇష్టమేనా.
యమున: వదినకు ఇష్టం అయితే నాకు ఇష్టమే.
పద్మాక్షి: అంతా మీ ఇష్టప్రకారమే కదా జరుగుతుంది కానివ్వండి.
సహస్ర: అది కాదమ్మా నాకు పెళ్లికి టైం ఉంటే ఇష్టమే అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. పంతులు గారు ఆ నెల రోజుల తర్వాత ముహూర్తమే ఖాయం చేయండి.
పంతులు లగ్న పత్రిక రాసి ఇస్తాడు. సంవత్సరంలో మాకు బాబునో పాపనో కనిస్తే సంతోష పడతామని కాదాంబరి అంటే కవల పిల్లల్ని ఇస్తామని సహస్ర అంటుంది. ఇక చారుకేశవని తాను పిలిచినప్పుడు ఆఫీస్‌కి రమ్మని విహారి చెప్తాడు.చారు కేశవ ఆఫీస్‌కి వస్తే నా ఉనికి కష్టమవుతుందని అంబిక అనుకుంటుంది. చారుకేశవ అంబిక దగ్గరకు వెళ్లి ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావ్ అని అంటాడు. నేను ఆఫీస్‌కి వస్తా నీకంటే నేనే ఎక్కువ డెవలప్ చేస్తానని అంటాడు. ఇంతలో విహారి చారుకేశవని పిలుస్తాడు. పండు లక్ష్మీతో విహారి పెళ్లి చేసుకున్న నీకు సొంతం కావాలి కానీ సహస్రమ్మకి సొంతం కాకూడదని ఈ పెళ్లి ఆపించడానికే విహారి పెళ్లి ఆపించాడేమో అని పండు అంటాడు. పెళ్లి ఆపాలని కోరుకోవద్దని లక్ష్మీ అంటుంది. విహారి బాబు నీకు సపోర్ట్ చేస్తున్నాడని పండు అంటే విహారి బాబుతో మూడు ముళ్లు వేయించుకున్నా అది నాకు చాలు అని లక్ష్మీ అంటుంది. ఇక ఈ విషయం వదిలేయమని చెప్పి గుడి వెళ్తానని బయల్దేరుతుంది.
లక్ష్మీ గుడికి వెళ్లడం యమున చూసి ఏమైంది ఎందుకు అలా వని అడిగితే బాగున్నానని లక్ష్మీ చెప్తుంది. బాధ పడుతున్నావ్ అని అర్థమవుతుంది ఇంట్లో ఎవరు ఏమైనా అన్నారా అని అడుగుతుంది. నీ మనసులో ఏముందో చెప్పమని అడుగుతుంది. ఇక ఇద్దరూ మాట్లాడుకోవడం విహారి చూస్తాడు. విహారి కూడా గుడికి వెళ్లి లక్ష్మీతో మాట్లాడాలి అనుకుంటాడు. ఇక అంబిక కూడా లక్ష్మీ గుడికి వెళ్లడం చూస్తుంది. విహారి లక్ష్మీని చూడటం చూసి విహారిలో మార్పు వచ్చింది ఏదో చెప్పాలి అనుకొని చెప్పుకుండా ఉన్నాడని పని వాళ్లకి గౌరవం ఇవ్వాలి అంటున్నాడు ఏమై ఉంటుందా అని అనుకుంటుంది. లక్ష్మీ గుడికి వెళ్తుందని తెలిసి విహారి ఎగ్జైట్ అవుతున్నాడని విహారి ఎక్కడికి వెళ్తున్నాడో కనిపెట్టాలని విహారిని ఫాలో అవుతుంది. ఎవరికీ చెప్పకుండా విహారి గుడికి ఎందుకు వచ్చాడా అని ఫాలో లోపలికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.