Trinayani Serial Today Episode విక్రాంత్, వల్లభలన్ని తిలోత్తమ కొడుతుంది. విక్రాంత్‌తో కన్న తల్లినైన నా చావు కోరుకుంటావురా అని తిడుతుంది. గాయత్రీ అక్క పునర్జన్మలో పుట్టలేదు నాకు చావు లేదు అని ప్రశాంతంగా ఉందని అనుకునేలోపు ఆ రహస్యం చెప్పి నన్ను టెన్షన్ పెట్టావ్ అని తిలోత్తమ అంటుంది. దానికి విక్రాంత్ ఈ రోజు కాకపోయినా ఏదో రోజు తెలియాల్సిన నిజమే ఆ రోజు నువ్వు మిగలవు అమ్మ అని అంటాడు. ఇంతలో సుమన అక్కడికి వచ్చి ఏమైందని అడిగితే దోమలు వాలితే అమ్మ కొడుతుందని అంటాడు వల్లభ.
సుమన: నా సపోర్ట్ ఎప్పుడు అత్తయ్యకే ఉంటుంది.
తిలోత్తమ: చూడరా తోడపుట్టిన అక్కని కాదని నన్ను సపోర్ట్ చేస్తుంది.
విక్రాంత్: తాను ఏం ఆశిస్తుందో.
సుమన: నేను ఏం ఆశించను
తిలోత్తమ: నువ్వు ఏం ఆశించినా ఆశించకపోయినా నీకు ఇవ్వాల్సింది ఇస్తా సుమన.
వల్లభ: కొంచెం క్లారిటీ ఇవ్వు మమ్మీ బెంబేలెత్తిపోతుంది చిన్న మరదలు.
తిలోత్తమ: ఎప్పటిలాగే నువ్వు నా మాట వింటే అందరి ఎదురుగా తలెత్తుకునేలా చేస్తాను.
సుమన: ఆ పని చేస్తే నా ప్రాణం కావాలి అన్నా ఇచ్చేస్తా. అందరూ సుమన రిచ్ అనుకుంటే చాలు తర్వాత నేను పోయినా పర్లేదు..
తిలోత్తమ: నువ్వు బాగు పడటం వాడికి ఇష్టం లేదు సుమన.
సుమన: నిజమే అత్తయ్య మీరే నా జీవితం మార్చేయాలి.
మరోవైపు త్రినేత్రి మేనత్త, మామలు త్రినేత్రిని ఎలా చంపాలా అని ప్లాన్ చేసుకుంటుంటారు. పాముల వాడికి చెప్పి పాములతో కాటేయిద్దామని అనుకుంటారు. ఇక హాసిని గాయత్రీ పాపని పట్టుకొని ఆటాడిస్తుంది. గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని అనుకోలేదని ఇప్పుడు ఈ పాప నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటుందని హాసిని పావనా మాట్లాడుకుంటారు. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. తిలోత్తమ చావు గురించి మాట్లాడుకుంటున్నామ్ అంటే మీరు ఇందుకు ఇలా మాట్లాడుకుంటారని అంటుంది తిలోత్తమ.
వల్లభ: పెద్దమ్మే ఈ పాప అని తెలియనప్పుడే ఆస్తిలో వాటా రాసిచ్చేసారు కదా మమ్మీ.
సుమన: నిజమే బావగారు తోడబుట్టిన దానికన్నా పుట్టు పూర్వొత్తరాలు తెలియని దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు.
హాసిని: చిట్టీ నువ్వు తోడబుట్టిన దానివి అయితే గాయత్రీ పేగు తెంచుకొని పుట్టింది.. ఈ పాపే తన పెద్ద కూతురు అని తెలియకపోయినా కన్నతల్లిదండ్రుల చేయి పట్టుకొని గాయత్రీ దేవి పేరు పెట్టుకొని ఇంటికి వచ్చింది గాయత్రీ దేవి పాప.
నయని: ఏది ఏమైనా అంతా మంచే జరిగింది.
విక్రాంత్ గాయత్రీ పాపకి పట్టాభిషేకం చేద్దామని అంటాడు. సుమన, వల్లభలు వద్దన్నట్లు మాట్లాడుతారు. విశాల్ కూడా వద్దని అంటాడు. దానికి విక్రాంత్ గాయత్రీ పాపే పెద్దమ్మ అని తెలియాలి అంటే ఆ మాత్రం సందడి చేయాలి అని అంటాడు. పావనా కూడా పబ్లిసిటీ కోసం ఫంక్షన్ చేద్దామని అంటాడు. కనీసం చిన్న అనౌస్స్ మెంట్ అయినా చేద్దామని విక్రాంత్ అంటాడు. ఇక నయనికి భవిష్యత్ కనిపిస్తుంది. పాము త్రినేత్రికి కాటేయడానికి వచ్చినట్లు చూస్తుంది. దాంతో త్రినేత్రి ఉందని తెలియని నయని తనకు తానే కనిపించానని షాక్ అయిపోతుంది. వల్లభ నయనిని చూసి ఏమైంది పెద్ద మరదలు అక్కడే ఆగిపోయిందని అంటాడు. నయని తనకే పాము కాటేయనుందని అనుకొని అది ఇంట్లో వాళ్లకి చెప్పాలా వద్దా అని అనుకుంటుంది.
నయని మాట్లాడకుండా అలా ఉండిపోయిందేంటి అని అనుకుంటారు. ఇంతలో నయని ఏం మాట్లాడకుండా పైకి వెళ్లిపోతుంది. నయని అలా వెళ్లిపోయింది ఏంటని అనుకుంటారు. ఇక విక్రాంత్ ల్యాప్ టాప్ సుమన తీసుకుంటుంది. విక్రాంత్ తనని పట్టించుకోకపోయినా పర్లేదు కానీ నా కూతురిని పట్టించుకోకపోతే ఊరుకోను అని అంటుంది. దానికి విక్రాంత్ నా జీతంతో బాగానే చూస్తున్నాను అంటాడు. నయనికి ముగ్గురు ఆడపిల్లలే అని వారసుడు అంటే నీ కొడుకు పుండరీనాథమే కదా ఆయనకు పట్టాభిషేకం చేయమని చెప్పమని సుమన హాసినిని అంటే గాయత్రీ దేవికే పట్టాభిషేకం అవ్వాలని హాసిని అంటుంది. ఇక నయని గాయత్రీ దేవి ఫొటో దగ్గర నిల్చొని నాకు ఏమైనా అయితే మిమల్ని తిలోత్తమ అత్తయ్య ఏమైనా చేస్తుందని భయం వెంటాడుతుందని కోప్పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.