Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode రుక్మిణి తన కూతుర్ని కాపాడుకుంటానని బయటకు వెళ్లిపోతుంది. లక్ష్మీ, పండు రుక్మిణి కోసం వెళ్తారు. అంబిక కూడా తన రౌడీలను పంపుతుంది. రుక్మిణిని చంపేయడానికి రౌడీలు సిద్ధంగా ఉంటారు. కరెక్ట్‌గా రుక్మిణిని కత్తితో నరికే టైంకి లక్ష్మీ, పండు రుక్మిణిని ఆపుతారు.
విహారి గారు కావేరిని కాపాడుతారు. మీరు మాతో రండి అని చెప్తారు. నా కూతుర్ని నేనే కాపాడుకుంటా.. రేపే దాని పుట్టిన రోజు తనని కనుక్కోవడంతో లేటు అయితే నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది అని అంటుంది. లక్ష్మీ రుక్మిణితో మీ కంగారు మాకు అర్థమైంది కానీ మీరు ఒక్కరే వెళ్లడం కరెక్ట్ కాదు మేం కూడా మీతో వస్తాం అని చెప్తారు.
అంబిక రౌడీలకు కాల్ చేసి రుక్మిణిని చంపేశారా లేదా అని అడుగుతుంది. రౌడీలు అంబికతో చంపే టైంకి లక్ష్మీ వచ్చిందని రుక్మిణిని తీసుకెళ్లిపోయింది అని అంటారు. దాంతో అంబిక మీరు రౌడీలేనా తినడానికి తాగడానికి తప్ప ఇంకా దేనికీ పనికి రారా.. మీరు దాన్ని చంపకపోతే నేను మిమల్ని చంపేస్తా అంటుంది. లక్ష్మీని తెలివిగా తప్పించాలి అని రౌడీలు అనుకుంటారు.
లక్ష్మీ, పండు, రుక్మిణి వెళ్తుంటే రౌడీలు వెనక పడతారు. లక్ష్మీకి తన వెనక ఎవరో ఫాలో అవుతున్నట్లు అనుమానం వస్తుంది. పండు, రుక్మిణిలకు విషయం చెప్తుంది. ఇక పండుకి ఫోన్‌లో ఫ్రెండ్ కెమెరా ఆన్ చేసి ఇవ్వమని చెప్తుంది. అది రుక్మిణికి ఇచ్చి మన వెనక ఉన్న రౌడీలు మిమల్ని చంపాలి అనుకున్న వాళ్లు ఒకరేనా కాదా చెప్పు అంటుంది. రుక్మిణి చూసి వాళ్లు వీళ్లు ఒకరే అని చెప్తుంది. దాంతో లక్ష్మీ పండుకి ఒక ఐడియా చెప్తుంది. లక్ష్మీ చెప్పినట్లు పండు ఫోన్లో పోలీసుల సైరెన్ పెట్టడంతో రౌడీలు పారిపోతారు. తర్వాత పండు క్యాబ్ బుక్ చేస్తాడు.
లక్ష్మీ అమ్మిరాజుని డైవర్ట్ చేయాలి అని అమ్మిరాజుకి ఆడవాళ్ల పిచ్చి ఉందని చెప్పి అమ్మిరాజుతో నేను మాట్లాడతా అని అంటుంది. పండు నెంబరు తీసి నువ్వు అమ్మిరాజుతో మాట్లాడటానికి వీల్లేదు అమ్మ నేను మాట్లాడుతా అని పండు అమ్మిరాజుకి కాల్ చేస్తాడు. పండు అమ్మిరాజుతో లేడీ వాయిస్‌లో మాట్లాడతాడు. అమ్మిరాజు పక్కనే వీర్రాజు ఉండటంతో అమ్మిరాజు పక్కకి వెళ్లి మాట్లాడతాడు. తన పేరు వసంతం అని పండు మాట్లాడతాడు. అమ్మిరాజుని రామాపురం పొలిమేర దగ్గరకు రమ్మని పండు మాట్లాడతాడు. దాంతో అమ్మిరాజు అక్కడికి రాదు కానీ నేను చెప్పిన చోటుకి రా అని పండుకి లోకేషన్ పెడతాడు.
వీర్రాజు చూసి వీడేంటిరా కస్టమర్ కేర్ వాళ్లతో ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు. మీకొడుకు కదా సార్ అని పనకాలు చెప్తాడు. ఇక అమ్మిరాజు పండుతో చెప్పిన లొకేషన్‌కి బయల్దేరుతాడు. అంబిక రౌడీలకు లక్ష్మీ వాళ్లు దొరకలేదని సుభాష్‌కి కాల్ చేసి విషయం చెప్తుంది. సుభాష్‌ని రామాపురం వెళ్లి రుక్మిణిని చంపేయమని అంటుంది. రుక్మిణితో పాటు లక్ష్మీ, విహారిలను కూడా చంపేస్తా అని సుభాష్ అంటాడు. ఇక అంబిక వీర్రాజుకి కాల్ చేసి రుక్మిణి, లక్ష్మీలు ఊరు వస్తున్నారు అని చెప్తుంది. వీర్రాజు రౌడీలు వచ్చి విహారి తప్పించుకున్నాడని మిమల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు అని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.