Just In
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 2nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఈ ముత్తయిదువుల్ని మీరూ గుర్తుంచుకోండి.. లక్ష్మీతో వ్రతం పూర్తి చేయించిన విహారి..!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ పద్మాక్షికి తాంబూలం ఇవ్వడం పద్మాక్షి తాంబూలం విసిరి కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ సుమంగళి వ్రతం చేసి మొదటి తాంబూలం బామ్మగా వచ్చిన అమ్మవారికి రెండో తాంబూలం వసుధకి ఇస్తుంది. మూడో తాంబూలం పద్మాక్షికి ఇవ్వమని యమున వాళ్లు చెప్తారు. లక్ష్మీ వెళ్లి తాంబూలం ఇచ్చి అమ్మ తాంబూలం తీసుకొని నా సౌభాగ్యాన్ని కాపాడండి అని అడుగుతుంది. దాంతో పద్మాక్షి తాంబూలం విసిరి కొడుతుంది.
విహారి: అత్తయ్యా తాంబూలం అలా విసిరి కొడతారేంటి.
పద్మాక్షి: ఇదితాంబూలం ఇస్తే నేను తీసుకోవడం ఏంటి. దీని వల్ల నేను నా కూతురు ఎంత క్షోభ పడుతున్నామో నాకు తెలుసు.
అంబిక: తను ఎప్పుడైతే మన ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి మనకు అన్నీ సమస్యలే.
పద్మాక్షి: ఏదో మిమల్ని మచ్చిక చేసుకొని అది చేసే పిచ్చి పనులు మీకు తెలీదు కానీ నాకు అన్నీ గుర్తున్నాయి. నేను మర్చిపోను. అమ్మవారి తాంబూలం కాదనకూడదు అని నాకు తెలుసు. కానీ ఇలాంటి దాని చేతితో తాంబూలం తీసుకుంటే నాలాంటి ముత్తయిదువులకు మంచి జరగకపోగా ఏదో ఒక అరిష్టం జరుగుతుంది. ఇలాంటి దాని తాంబూలం తీసుకొని దీవిస్తే నా మాంగల్యానికి సమస్య రావొచ్చు.
విహారి: తాంబూలం తీసుకోవడానికి తనని ఇన్ని మాటలు అనాలా.
పద్మాక్షి: నేను అన్న ఒక్క మాట తప్పు అని చెప్పు విహారి తన దగ్గర తాంబూలం తీసుకుంటా. దాని చేతితో తాంబూలం తీసుకుంటే ఫలితం ఉంటుందా. ఎందుకంటే దాని మెడలో తాళి కట్టిన భర్త ఇక్కడున్నాడా. వాడు ఎక్కడున్నాడో తెలీదు. అసలు తిరిగి వస్తాడో రాడో తెలీదు. కనీసం బతికి ఉన్నాడో లేడో తెలీదు.
లక్ష్మీ: అమ్మా నా భర్త బతికే ఉన్నాడు. బాగానే ఉన్నాడు.
పద్మాక్షి: అసలు దీని బాగోతం మన కాలనీ వాళ్లకి తెలిసి ఇది చేసిన వ్రతం కోసం రాలేదు.
పంతులు అలా మాట్లాడొద్దని చెప్తారు. అందరూ లక్ష్మీని క్షమించి తాంబూలం తీసుకోమని చెప్తారు. ఇంక తాంబూలం తీసుకోవడానికి ఎవరూ రారు మీరు వెళ్లిపోండి అని పంతులుకి పెద్ద ముత్తయిదుతో చెప్తారు. బామ్మ లక్ష్మీతో నీతో దగ్గరుండి వ్రతం చేయించాలి అనుకున్నా కానీ ఇలాంటి పరిస్థితిలో వెళ్తున్నా అని చెప్పకూడదు అని అంటుంది. ఆమె వెళ్లిపోతుంటే విహారి ఆపుతాడు. వసుధతో అత్త నువ్వు ఒక సారి ఇలాగే వ్రతం చేసి ఇంట్లో ఎవరూ లేకపోతే గడపకు తాంబూలం పెట్టి వచ్చావ్ కదా అని అంటాడు. పంతులు గడపకు తాంబూలం ఇవ్వొచ్చని చెప్తారు. దాంతో విహారి లక్ష్మీకి గడపకు తాంబూలం ఇచ్చి రమ్మని చెప్తాడు.
లక్ష్మీ వెళ్లి గడపకు పసుపు కుంకుమ పెట్టి తాంబూలం పెట్టి వస్తుంది. మరో తాంబూలం తులసమ్మకి ఇవ్వమని చెప్తాడు. తులసి కూడా ముత్తయిదువే అని చెప్పి యమున సంతోషంతో తులసికి తాంబూలం ఇవ్వమని చెప్తుంది. లక్ష్మీ సంతోషంగా నాలుగో తాంబూలం తులసమ్మకి ఇస్తుంది. సహస్ర చాలా టెన్షన్ పడుతుంది. చివరి తాంబూలం ఇవ్వాలి కదా అని అంబిక అంటుంది. ఇక విహారి ముత్తయిదువులు ఎవరైనా ఏ పూజ చేసినా తమలపాకు మీద గౌరీ దేవిని పూజిస్తారు కదా ఆ గౌరీ దేవి కూడా ముత్తయిదువే కదా అంటారు. గొప్ప సలహా ఇచ్చారు అని పంతులు గౌరీ దేవిని చేసి గౌరీదేవికి తాంబూలం ఇవ్వమని లక్ష్మీకి చెప్తారు. విహారి వల్ల లక్ష్మీ సుమంగళి వ్రతం పరిపూర్ణమవుతుంది.
పంతులు లక్ష్మీతో సూర్యస్తమయం అయితే నేల మీద ప్రసాదం తిని నేల మీద పడుకుంటే నీ వ్రతం పూర్తవుతుందని పంతులు చెప్తారు. సహస్ర బావ దగ్గరకు వెళ్లి యూఎస్లో చదువుకున్న నీకు ఇన్ని సంప్రదాయాలు ఎలా తెలుసు అంటుంది. మన వీ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కోసం అన్నీ తెలుసుకున్నా అని చెప్తాడు. ఇక సహస్ర రేపు మన పెళ్లి తర్వాత ఇలాగే అన్నీ నాకు చెప్తావు కదా బావ అంటుంది. యమున సహస్రతో మేం అన్నీ సంప్రదాయ ప్రకారమే మీ కోసం చేస్తాం సహస్ర అంటుంది. నువ్వు నాకు కొండంత అండ అని సహస్ర అత్తకి చెప్తుంది. లక్ష్మీతో నువ్వు హ్యాపీనే కదా లక్ష్మీ అని అంటుంది.
అంబిక లక్ష్మీకి విహారికి ఇచ్చిన సలహాలు గుర్తు చేసుకుంటుంది. ఒక అమ్మాయి గురించి విహారి ఎంత ఆలోచించకపోతే ఆ లక్ష్మీకి అంత సాయం చేస్తాడు అని సహస్రతో చెప్తుంది. ఇన్ని రోజులు విహారి మంచోడు అనుకున్నా కానీ విహారికే లక్ష్మీ అంటే ఇష్టం. విహారికే లక్ష్మీ అంటే ప్రేమలా కనిపిస్తుందని అంటుంది. సహస్ర ఆపమని అంటుంది. ఇంకోసారి నీ పెళ్లి చెడిపోతే మీ అత్త, బావలు మీ జాతకాలు కుదరడం లేదని చెప్పి పెళ్లి ఆపేస్తారని అంటుంది. వెంటనే ఏదో ఒకటి చేయ్ లక్ష్మీని దూరం చేయ్ అని అంటుంది. రేపు ఏది ఏమైనా నా పెళ్లి జరుగుతుందని సహస్ర అంటుంది. విహారి దగ్గరకు లక్ష్మీ వెళ్లి థ్యాంక్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!