Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి లక్ష్మీ పిలిస్తేనే వచ్చాను అని అందరితో చెప్తాడు. సాక్ష్యం కూడా చూపిస్తాను అని చెప్పి లక్ష్మీ తనకు మెసేజ్‌లు పెట్టిందని చూపిస్తాడు. లక్ష్మీ నెంబరు నుంచి మెసేజ్‌లు వచ్చాయని అంబిక అంటుంది. నేనేం చేయలేదు అని లక్ష్మీ అంటుంది. అంబిక అందరికీ మెసేజ్‌లు చూపిస్తుంది.
సహస్ర లక్ష్మీతో అంతా కావాలనే చేశావు కదా ఈ రోజు కార్యం ఆగిపోవాలి అనే ఇలా చేశావ్ కదా అంటుంది. పద్మాక్షి లక్ష్మీని కొడుతుంది. విహారి పద్మాక్షి మీద ఎందుకు లక్ష్మీని కొడుతున్నారని అరుస్తాడు. కార్యం ఆపడానికి ఇది ఇలా చేస్తే ఏం చేయాలి అని పద్మాక్షి అంటుంది. యమున, వసుధలు లక్ష్మీ ఎప్పటికీ అలా చేయదు అని అంటారు. సహస్ర అందర్ని ఆపుతుంది. లక్ష్మీ ఫోన్ తీసుకురమ్మని పండుకి చెప్తుంది. పండు లక్ష్మీ ఫోన్ తీసుకొస్తాడు. సహస్ర చూసి షాక్ అయిపోతుంది. యమునతో అత్తయ్య మెసేజ్‌లు నిజం అని అంటుంది. లక్ష్మీ షాక్ అయిపోతుంది. లక్ష్మీనే మెసేజ్‌లు పంపిందని చెప్తుంది.
విహారి మనసులో నా లక్ష్మీ ఎన్నటికీ ఆ పని చేయదు అని అనుకుంటాడు. ఇది దీని భాగోతం దీని నీచపు బుద్ధి అని పద్మాక్షి అంటుంది. లక్ష్మీ చాలా మంచిదని రెండు తగిలిస్తే వాడే నిజం చెప్తాడని కొట్టబోతే నిజం అందరికీ తెలిసింది వాడిని వదిలేయ్ అని అంబిక చెప్పి వాడిని పంపేస్తుంది. లక్ష్మీ ప్రాణం పోయిన అలాంటి తప్పు చేయదు అని యమున అంటుంది. నేను సంతోషంగా ఉండటం దీనికి ఇష్టం లేదు అని సహస్ర అంటే నేనేం చేయలేదు అని లక్ష్మీ అంటుంది. దానికి పద్మాక్షి ఇది యమున ప్రాణాలు కాపాడటం ఏమో కానీ మా ప్రాణాలు తీస్తుందని అంటుంది. మనకు చెడు చేస్తున్న మనుషుల్ని మనం ఇంట్లో పెట్టుకొని పోషిస్తున్నాం అంతా మన ఖర్మ అని కాదాంబరి అంటుంది. అర్థ రాత్రి పంచాయితీ వద్దని అందర్నీ పంపేస్తుంది.
లక్ష్మీ విహారి వైపు చూసి ఏం చేయలేదని తలూపుతుంది. విహారి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. లక్ష్మీ చాలా ఏడుస్తుంది. ఉదయం పద్మాక్షి, అంబికలు సహస్రతో మాట్లాడుతారు. లక్ష్మీ కావాలనే ఇలా కార్యం ఆపిందని అంటుంది. విహారి మీద మనసు పడే ఇదంతా చేస్తుందని అంబిక అంటుంది. నాకు అనుమానం వస్తుందని పద్మాక్షి అంటుంది. సహస్ర మనసులో దానికి రేపటి నుంచి ఇక్కడ నరకం చూపిస్తా అంటుంది. టైం చూసి లక్ష్మీ పని పడతా అని పద్మాక్షి అంటుంది.
ఉదయం సహస్ర మెడలో నల్లపూసలు వేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇళ్లంతా సందడిగా ఉంటుంది. లక్ష్మీని ఈ రోజు దూరంగా ఉంచాలని కాదాంబరి అంటుంది. లక్ష్మీ ఇంటి దరిద్రం అని దాన్ని ఎలా అయినా గెంటేయాలి అనుకుంటారు. అంబిక సహస్ర దగ్గరకు వెళ్లి ఈ మధ్య నీ ఆలోచనలు మారిపోతున్నాయని అంటుంది. నువ్వు ఈ ఇంటి కోడలివి నువ్వు నేను ఒక మాట మీద నిలిచి దాన్ని తరిమేద్దాం అంటుంది. లక్ష్మీని కళ్ల ముందు ఉంచుకొని నరకం చూపిస్తా అని సహస్ర మనసులో అనుకుంటుంది.
లక్ష్మీ తులసి కోట దగ్గర దీపం పెట్టి ప్రసాదం వండటానికి రెడీ అవుతుంది. లక్ష్మీని సహస్ర, అంబికలు పైనుంచి చూస్తుంటారు. లక్ష్మీ వెనకాలే అఖండ దీపం ఉంటుంది. అది చూసి అఖండ దీపం కొంచెం లక్ష్మీ వైపు తిప్పితే లక్ష్మీ కొంగు అంటుకుంటుందని ప్లాన్ చేస్తారు. లక్ష్మీ దగ్గరకు వెళ్లి అంబిక మాట్లాడినట్లు దీపం కొంగు దగ్గర పెడుతుంది. ప్రసాదం వండుతున్న లక్ష్మీ కొంగు దీపం మీద పడి కొంగు అంటుకుంటుంది. ఇంతలో విహారి బయటకు వచ్చి చూస్తాడు. లక్ష్మీ అని పిలిచి లక్ష్మీ కొంగు దులిపి నీరు చల్లుతాడు. లక్ష్మీ పడిపోతుంటే పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడి దొర్లుతారు. సహస్ర అది చూసి కోపంగా ఉంటుంది. లక్ష్మీ నీకు ఏం కాలేదు కదా అంటాడు. చూసుకొని పని చేయొచ్చు కదా అని అంటాడు.
సహస్ర లక్ష్మీని నెట్టేసి బావ నీకు ఏం కాలేదు కదా అని అంటుంది. ఒక్క పని కూడా సరిగా చేయవు కదా అని తిడుతుంది. లక్ష్మీ నుదిటి మీద కుంకుమ విహారికి అంటుంకుంటుంది. సహస్ర తుడవడానికి వెళ్తే విహారి దేవుడి కుంకుమ వద్దని అంటుంది. యమున వచ్చి సహస్ర, విహారిలను లోపలికి పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!