Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పద్మాక్షి, సహస్ర, అంబిక వాళ్లు పెళ్లి షాపింగ్‌కి బయల్దేరుతారు. వసుధ యమునను కూడా తీసుకెళ్దామంటే సహస్ర వాళ్లు ఒప్పుకోరు. తన కొడుకు పెళ్లిలో తాను ఎందుకు ఉండొద్దని అంటారని వసుధ అడిగితే దానికి సహస్ర ఆవిడ టేస్ట్ వేరు మా టేస్ట్ వేరు అని మాట్లాడుతుంది. అనవసరంగా ఒకరి మీద ఒకరు అరుచుకోవచ్చు సింపుల్‌గా ఆవిడను వదిలేద్దాం అంటుంది. 


వసుధ: ఈ విషయం విహారికి తెలిస్తే ఎంత బాధ పడతాడో తెలుసా. వాళ్ల అమ్మని మనం దూరం పెడుతున్నామని చిన్న చూపు చూస్తున్నామని తెలిస్తే మన మీద ద్వేషం పెంచుకుంటాడని కనీసం మీ ఊహకి అయినా తెలియడం లేదా.
పద్మాక్షి: సరే అయితే రమ్మను వచ్చి ఏదో ఒక మూల కూర్చొమను.
వసుధ: వదినా చీరలు కొనడానికి ధర్మపురం వెళ్దాం బయల్దేరండి.
యమున: నేను రాను మీరు వెళ్లండి నేను రావడం కొందరికి నచ్చదు. 
పద్మాక్షి: చూశావా వసుధ వద్దని వదిలేసి వెళ్లిపోయిన బాగుండేది కానీ ఇప్పుడు చూడు రమ్మని చెప్పినందుకు ఎంత రాద్ధాంతం చేస్తుందో.
యమున: అందరి మనసులు నొప్పించకూడదు అని రాను అంటున్నా అంతే రాద్దాంతం ఏం లేదు.


వసుధ ఒప్పించి యమునను తీసుకెళ్తుంది. మరోవైపు ఆదికేశవ్ విహారిని బలవంతంగా బయటకు తీసుకొచ్చి నలుగు పెట్టి స్నానం చేయించాలని అంటాడు. విహారి నాకు బయట స్నానం వద్దని ఇబ్బంది పడి వద్దని చెప్తాడు. విహారిని కూర్చొపెట్టి కనకంతో నలుగు తీసుకురమ్మని చెప్తాడు. విహారి ఇబ్బంది పడటం కనకం చూస్తుంది. ఆదికేశవ్ విహారికి షర్ట్ తీసేయమని చెప్తే నా వల్ల కాదు అని విహారి ఒళ్లు కప్పుకుంటాడు. విహారి పారిపోవాలని ప్రయత్నిస్తే ఆదికేశవ్ పట్టుకొని షర్ట్ తీయాలని అంటాడు. విహారి ఇబ్బది పడుతూనే షర్ట్ తీస్తాడు. కనకం వెళ్లిపోతుంటే బామ్మ ఆపి నీ భర్తకి నలుగు స్నానం చేయిస్తుంటే నువ్వు వెళ్లిపోతావేంటి అని ఆపుతుంది.


ఆదికేశవ్ అల్లుడి తలకు నూనె రాసి మసాజ్ చేస్తాడు. ఒళ్లంతా రుద్దుతాడు. ఆదికేశవ్ ఆయాస పడతాడు. దాంతో బామ్మ నువ్వు వద్దులే నీ కూతురు నలుగు పెడుతుందని అంటుంది. కనకంతో పాటు విహారి కూడా షాక్ అయిపోతాడు. కనకం కంగారు పడుతుంది. బామ్మ ఒప్పుకోకపోవడంతో కనకం విహారికి నలుగు రాస్తుంది. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. అది చూసి బామ్మ మొగుడు పెళ్లాలు అంటే ఇలాగే ఉండాలి మీరు ఎప్పటికీ అందరికీ ఆదర్శంగా ఇలాగే కలిసి మెలసి ఉండాలని కోరుకుంటుంది. కనకం నీరు తీసుకురావడానికి వెళ్లి జారి విహారి ఒడిలో పడిపోతుంది. ఒకర్ని ఒకరు చూసుకుంటే బామ్మ సిగ్గు పడిపోతుంది. ఆదికేశవ్ పిలవడం కనకం తేరు కొని లేస్తుంది. 


విహారికి సత్య కాల్ చేస్తాడు. ఎవరికీ అనుమానం రాలేదు కదా అంటే లేదని అంటాడు. ఇక సత్య విహారి నీ పరిస్థితి అర్థమవుతుంది కాస్త జాగ్రత్తగా డీల్ చేయరా అని చెప్తాడు. మరోవైపు కనకం ఇంటికి కనకం రిలేటివ్ అయిన ఓ చెల్లి వచ్చి ఇద్దరూ తూర్పు పడమరలా ఉన్నారు ఇద్దరినీ మనమే కలపాలి అనుకొని ఆయిల్ గదిలో పడేస్తుంది. తర్వాత విహారి దగ్గరకు వెళ్లి బావగారు కనకం మిమల్ని ఉన్నఫలంగా పిలుస్తుంది వెళ్లండి అంటే విహారి పరుగున వెళ్లి ఆయిల్ మీద కాలు వేసి వెళ్లి లక్ష్మీ మీద పడిపోతాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, లక్ష్మీలకు సంబంధం ఉందని సహస్రతో చెప్పిన అంబిక.. ఆధారాలు చూపించిందా!